రివ్యూ - సామ్ సంగ్ గెలాక్సీ జే 6

మొన్న‌టివ‌ర‌కు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో నెంబ‌ర్‌వ‌న్‌గా ఉన్న శాంసంగ్.. షియోమీ దూకుడుతో ఇప్పుడు వెన‌క‌బ‌డిపోయింది. అయితే మ‌ళ్లీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు చేర‌డానికి కొత్త మోడ‌ల్స్, బెస్ట్ ఫీచర్ల‌తో వ‌స్తుంది. త‌క్కువ ధ‌ర‌లోనే మంచి ఫీచ‌ర్లే షియోమీ విజ‌య‌ర‌హ‌స్య‌మ‌ని గ్ర‌హించిన శాంసంగ్ ఇప్పుడు తాను కూడా అదేబాట‌లో ప‌య‌నిస్తోంది. దీనిలో  భాగంగా లేటెస్ట్‌గా గెలాక్సీ జే6ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్‌5 ప్రో, జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1ల‌తో పోటీగా ఈ గెలాక్సీ జే6ను శాంసంగ్ లాంచ్ చేసింద‌ని టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ విశ్లేష‌ణ‌. గెలాక్సీ జే6 ఎలా ఉందో చూద్దాం రండి..
 

డిజైన్‌
 గెలాక్సీ జే6లో టాల్ డిస్‌ప్లే ఉంది. మంచి గ్రిప్‌, స్లీక్ బాడీతో కాస్త ఎట్రాక్టివ్‌గా క‌నిపిస్తుంది.రియ‌ర్ ప్యాన‌ల్ అంత గ్లాసీగా లేక‌పోవ‌డంతో చిన్న‌దానికే గీత‌లుప‌డే బాధ లేదు. ఇక ఫోన్ ఫ్రంట్ పార్ట్‌లో  18.5:9 ఇన్ఫినిటీ డిస్‌ప్లేతో కూడిన 5.45 ఇంచెస్ సూప‌ర్ అమోల్డ్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌తో కూడిన డిస్‌ప్లే.. శాంసంగ్ ఫోన్ల‌లో ఉండే క‌ల‌ర్ శాచ్యురేష‌న్‌తో స్క్రీన్  బాగా క‌నిపిస్తుంది. మొత్తంగా డిజైన్ బాగుంది.

సాఫ్ట్‌వేర్‌, స్పెసిఫికేష‌న్స్‌
గెలాక్సీ జే6లో శాంసంగ్ సొంత ఓఎస్ అయిన ఆక్టాకోర్ ఎక్సినోస్ 7870 ఎస్‌వోసీ ప్రాసెసర్ ఇచ్చారు. శాంసంగ్ కొంత‌కాలంగా త‌న బ‌డ్జెట్ ఫోన్ల‌కు ఈ ప్రాసెస‌ర్‌నే వాడుతుంది. గెలాక్సీ జే6 ధ‌ర 12వేల పైనే ఉన్న ప‌రిస్థితుల్లో ఈ స్థాయి ప్రాసెస‌ర్ యూజ‌ర్‌ను ఇంప్రెస్ చేయ‌లేదు. 4జీ వోల్ట్ క‌నెక్టివిటీ ఉంది కాబ‌ట్టి జియో సహా అన్ని సిమ్‌లూ వాడుకోవ‌చ్చు. 13 ఎంపీ రియ‌ర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్  ఉన్న ఫోన్ ప్రైస్ 12,500 వ‌ర‌కు ఉంది. 

ప్ల‌స్ పాయింట్స్ 
1. ఇప్ప‌టివ‌ర‌కు త‌న ప్రీమియం ఫోన్ల‌లో మాత్ర‌మే వాడిన  ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్‌ను శాంసంగ్ ఈ ఫోన్‌లో వినియోగించ‌డం విశేషం.
2. ఇమేజ్‌ను రిక‌గ్నైజేష‌న్ ఆప్ష‌న్‌తో కూడిన శాంసంగ్ మాల్ షాపింగ్ యాప్ ఉంది. 
3. ఎన్ఎఫ్‌సీ టెక్నాల‌జీతో పేమెంట్స్‌చేయ‌డానికి శాంసంగ్ పే మినీ ఫీచ‌ర్ ఉంది. 
4. టూవీల‌ర్ మీద ఉన్న‌ప్పుడు మిమ్మ‌ల్ని కాల్స్‌,మెసేజ్‌లు డిస్ట్ర‌బ్ చేయ‌కుండా ఎస్ బైక్ ఫీచ‌ర్‌
5. డ్యూయ‌ల్ మెసెంజ‌ర్ మోడ్, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స‌మాచారం ఇవ్వ‌డానికి పానిక్ మోడ్  
6. టెంపుల్  ర‌న్‌, స‌బ్‌వే స‌ర్ఫ‌ర్స్ వంటి గేమ్స్ ఆడినా ఫోన్  వేడెక్క‌దు.
7. కెమెరాలో స్టిక్క‌ర్స్ మోడ్ బాగుంది.
8. 3,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ రెగ్యుల‌ర్ యూసేజ్‌తోపాటు రెండు గంట‌లు వీడియో స్ట్రీమింగ్ చేసినా ఒక రోజంతా బ్యాక‌ప్ వ‌స్తుంది. దాదాపు 14 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది.

మైన‌స్ పాయింట్స్‌
1. యాంబియంట్ లైట్ సెన్స‌ర్ లేక‌పోవ‌డంతో ఆటోమేటిగ్గా  స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జ‌స్ట్ అవ్వ‌దు.
2. ఈ ప్రైస్‌లో అన్ని కంపెనీలు స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస‌ర్లు వాడుతుంటే దానికంటే త‌క్కువైన శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెస‌ర్‌ను వాడ‌డం
2. నియ‌ర్ ఫీల్డ్ క‌నెక్టివిటీ (NFC) ఆప్ష‌న్ లేదు. 
3.గైరో స్కోప్ లేక‌పోవడంతో గూగుల్ మ్యాప్‌లో మీరు ఏ డైరెక్ష‌న్‌లో వెళుతున్నారో తెలియ‌దు.
4. ఫేస్ రిక‌గ్నైజేష‌న్ ఫీచ‌ర్ స‌రైన లైటింగ్ లేక‌పోతే పనిచేయ‌డం లేదు.
5. కెమెరా క్వాలిటీ బాగాలేదు.  డేలైట్లో  తీసిన ఫొటోల‌కు కూడా క‌ల‌ర్ వాష్ అవుట్ అయిపోతుంది. హెచ్‌డీఆర్ మోడ్‌లో కూడా పిక్చ‌ర్ క్వాలిటీ పెద్ద మెరుగుప‌డినదేమీ లేదు. సెల్ఫీ కెమెరా కోసం ఫ్రంట్ సెల్ఫీ లైట్ ఇచ్చినా కూడా నైట్ టైమ్ తీసే ఫొటోలు అంత క్వాలిటీగా లేవు.
6. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్ లేదు.
మొత్తంగా చూస్తే ఈ ప్రైస్ రేంజ్‌లో ఉన్న మిగ‌తా ఫోన్ల‌ను ప‌డ‌గొట్టే సీన్ శాంసంగ్ గెలాక్సీ జే6కి ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. 
 

Samsung Galaxy J6 Review. శాంసంగ్ గెలాక్సీ జే 6 రివ్యూ