శాంసంగ్ గెలాక్సీ నోట్ 8.. ఇప్పుడు మొబైల్ ప్రియుల్లో ఆసక్తిని రేపుతున్నఫోన్. ఇది ఎలా ఉండబోతుంది. మిగిలిన ఫోన్లకు దీనికి ఏంటి డిఫరెన్స్? ఇటీవల వచ్చిన శాంసంగ్ సిరీస్లకు దీనికి ఉన్న ప్రధానమైన తేడాలు ఏంటి? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఫోన్లకు ఇది ఎంత వరకు పోటీ ఇవ్వగలదు? ఇవన్నీ ప్రశ్నలే. కానీ శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 అద్భుతమైన ఫీచర్లతో తయారైందని.. కచ్చితంగా ఇది మిగిలిన ఫోన్ల బీట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూఎస్, కెనడా, యూకేల్లో ఈ ఫోన్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. మరి శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్కు శాంసంగ్ గెలాక్సీకి ఎస్8 ప్లస్ మధ్య ఏంటి తేడా?
డిజైన్, డిస్ప్లే
గత కొన్ని సిరీస్లలో డిజైన్, డిస్ప్లే విషయంలో శాంసంగా చాలా జాగ్రత్లు తీసుకుంటోంది. మిగిలిన ఫోన్లకు ఏమాత్రం తగ్గకుండా స్లిమ్ అండ్ ఫిట్గా ఉండేలా చూసుకుంటోంది. మెటల్, గ్లాస్ మిక్సింగ్తో తయారవుతున్న ఈ మోడల్ అటు గెలాక్సీ నోట్ 8, ఇటు ఎస్8 ప్లస్ రెండిట్లోనూ ఉంది. గ్లాస్ మరియు మెటల్ ఛాసిస్ ఈ రెండు ఫోన్ల ప్రత్యేకత. ఇవి డిస్ప్లేను మరింత నాజూకుగా మారుస్తున్నాయి. కర్వ్డ్ ఎడ్జ్లు కూడా ఈ రెండు ఫోన్లకు మంచి లుక్ను తీసుకొచ్చాయి. అంతేకాదు చేతిలో పట్టుకోవడానికి రెండు హ్యాండ్సెట్లు ఎంతో అనుకూలంగా కూడా ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 8 ప్లస్ మోడల్లో ఉన్నట్లే కెమెరా తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ గెలాక్సీ నోట్ 8లో కూడా ఉంది.
సాఫ్ట్వేర్, స్టోరేజ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్లో ఎక్స్నోస్ 98895 ఆక్టా కోర్ ప్రాసెసర్ వాడారు. దీనిలో 4 జీబీ ర్యామ్ ఉంది. 6 జీబీ ర్యామ్ వరకు వేరియంట్లో దొరుకుతుంది. గెలాక్సీ నోట్8లో కూడా ఆక్టా కోర్ ప్రాసెసరే ఉంది. ఇది 6జీబీ సామర్థ్యం వరకు దొరకుతుంది. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ నౌగట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. ఎస్ 8లో ఆన్ బోర్డు స్టోరేజ్ 64జీబీ, 256 జీబీ ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. నోట్ 8లో 128 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్, 256 జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
కెమెరా, బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8లో 12 మెగా పిక్సల్ స్నాపర్, డ్యుయల్ పిక్సల్ కెమెరా వాడారు. దీనిలో ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఆప్షన్ ఉంది. అంతేకాక డ్యుయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. గెలాక్సీ నోట్ 8 ఈ విషయంలో ఒక అడుగు ముందంజలో ఉంది. దీనిలో అడిషనల్ కెమెరా లెన్స్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉన్నాయి. ఎస్8లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, నోట్ 8లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఆప్షన్ల పరంగా చూస్తే ఈ రెండు ఫోన్లకు వేటికవే ప్రత్యేకం. అయితే వెర్షన్ పరంగా చూస్తే మాత్రం గెలాక్సీ నోట్ 8 ముందంజలో ఉంటుంది.
Samsung Galaxy Note8 S8+ Design display AMOLED octa-core processor 12 మెగా పికà±à°¸â€Œà°²à± à°¸à±à°¨à°¾à°ªâ€Œà°°à±â€Œ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± నౌగ‌టౠఫింగ‌రౠపà±à°°à°¿à°‚à°Ÿà± à°¸à±à°•ాన‌రà±