ఫేస్బుక్ నుంచి వాట్సాప్ దాకా, కొత్త ఫోన్ల నుంచి సాఫ్ట్వేర్ల వరకు.. కంపెనీల లాభనష్టాల లెక్కల నుంచి మెర్జర్ల వరకు టెక్నాలజీ రంగంలో ఈ వారం జరిగిన అప్డేట్స్ మీకోసం ఈ వారం టెక్ రౌండప్లో ఇస్తున్నాం.. అలాగే ఈ వారం విశేషాలేమిటో చూద్దాం రండి..
కోటీ 40 లక్షల ఫేస్బుక్ యూజర్ల డేటా లీక్
ఫేస్బుక్లో యూజర్ల ప్రైవసీకి రక్షణ లేకుండా పోతోంది. రీసెంట్గా ఓ బగ్ వల్ల దాదాపు కోటీ 40 లక్షల మంది యూజర్ల ప్రైవేట్ డేటా ఎఫెక్ట్ అయినట్లు కంపెనీయే ఒప్పుకుంది. featured items పేరిట యూజర్ల టైమ్లైన్ యాక్టివిటీపై ఫేస్బుక్ మే 18న కొత్త ఫీచర్ తెచ్చింది. ఆ ఫీచర్ను పబ్లిక్ కోసం తీసుకొచ్చామని, అయితే పొరపాటున అది యూజర్కు సంబంధించిన అన్ని పోస్ట్లకూ అప్లయి అయిపోవడంతో డేటా బయటికి పొక్కిందని ఫేస్బుక్ చెప్పింది. దీనికి మే 22న ఫిక్స్ తీసుకొచ్చి మే 27 కల్లా క్లియర్ చేశామని చెప్పింది.
ఏఐ టెక్నాలజీతో న్యూస్ఫీడ్
న్యూస్ అగ్రిగేటర్ యాప్ ఇన్షార్ట్స్ తన న్యూస్ఫీడ్కు మరింత టెక్నాలజీని యాడ్ చేయబోతోంది. ర్యాపిడ్ 60 పేరిట ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆల్గరిథమ్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది పూర్తి న్యూస్ ఆర్టికల్ను 60 పదాల న్యూస్గా దానికదే మార్చి హెడ్లైన్తో సహా పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం నెలకు 10వేల ఆర్టికల్స్ వేస్తున్న ఇన్షార్ట్స్ ఈ కొత్త ఫీచర్తో నెలకు లక్ష ఆర్టికల్స్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హెచ్టీ మీడియా త్రైమాసిక లాభం 75 కోట్లు
ఇండియాలోని పెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన హెచ్టీ మీడియా మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి 75 కోట్ల నికర లాభం సంపాదించింది. అయితే అంతకు మందు మూడు నెలల్లో 124 కోట్ల సాధించింది. యాడ్ రెవెన్యూ తగ్గడం, నిర్వహణ వ్యయం పెరగడంతో లాభం దాదాపు 50 కోట్లు తగ్గింది.
అమెరికాలో నెట్ న్యూట్రాలిటీకి టాటా
ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నెట్ న్యూట్రాలిటీకి ఇప్పుడు యూఎస్లో కాలం చెల్లిపోయింది. సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత ఇంటర్నెట్ ఫ్రీడమ్ను తిరిగి ప్రవేశపెడుతూ ఎఫ్సీసీ ఛైర్మన్ అజిత్ పాయ్ ఆర్డర్స్ ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్కి సోమవారం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
క్రిప్టో కరెన్సీ బ్యాన్పై ఎవర్నీ సంప్రదించని ఆర్బీఐ
బిట్ కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీని బాన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ సొంతంగానే నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రజాభిప్రాయం తీసుకోలేదు. బిట్కాయిన్ ప్రభావం ఏమిటని సొంతంగా కూడా ఎలాంటి పరిశోధన చేయలేదు. బిట్ కాయిన్ బ్యాన్ నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆర్బీఐని వరుణ్ సేథీ అనే స్టార్టప్ కన్సల్టెంట్ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ప్రశ్నించగా ఆర్బీఐ పై విధంగా జవాబిచ్చింది.
పేమెంట్స్ యాప్ చిల్లర్ను కొన్న ట్రూకాలర్
టెలికాలర్ యాప్ ట్రూ కాలర్.. పేమెంట్స్ యాప్ చిల్లర్ను కొనుగోలు చేసింది. దీంతో ట్రూ కాలర్ కూడా ఇప్పుడు చిల్లర్ ఫ్లాట్ఫాం మీద పేమెంట్స్, మనీ ట్రాన్సాక్షన్ జరపబోతోంది. చిల్లర్ టీమ్ను ఉద్యోగాల్లో నుంచి తీసేయట్లేదని, వారు ఇకపై ట్రూ కాలర్ పే టీమ్గా ఉంటారని ట్రూ కాలర్ తన బ్లాగ్లో ప్రకటించింది.
ట్విట్టర్ యూజర్లకు పర్సనలైజ్డ్ న్యూస్ఫీడ్
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ మీద ఫోకస్ పెట్టింది. యూజర్లు ఇతర అకౌంట్లవారితో చేసే ఇంటరాక్షన్ను, వాళ్లు లైక్ చేసే అంశాలను బట్టి పర్సనలైజ్డ్ ఫీచర్లను తమ యూజర్లకు అందించబోతోంది. discover more of what matters to you అనే పేరుతో కొత్త ఆప్షన్ను తీసుకురాబోతోంది. బ్రేకింగ్ న్యూస్, అలర్ట్స్, పర్సనలైజ్డ్ న్యూస్ అలర్ట్స్ ఈ టైమ్లైన్లో ఉంటాయి.
ఆధార్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఆగస్టు తర్వాతే..
మీ ముఖకవళికలను బట్టి మీ ఐడెంటిటీని గుర్తించే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఆధార్కు అందుబాటులోకి తేవడానికి మరో రెండు నెలలె టైం పట్టే అవకాశం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఆగస్టు తర్వాతే అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ విషయాన్ని యూఐడీఏఐ సీఈవో అజయ్భూషణ్ పాండే ప్రకటించారు.
నెట్ న్యూట్రాలిటీకి బెరెక్తో ట్రాయ్ ఒప్పందం
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశంలో నెట్ న్యూట్రాలిటీకి అవసరమైన సహకారం అందించేందుకు బాడీ ఆఫ్ యూరోపియన్ రెగ్యులేటర్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (బెరెక్)తో ఎంవోయూయ కుదుర్చుకుంది. నెట్ న్యూట్రాలిటీ మీద తమకున్న పరిజ్ఞానాన్ని ఈ రెండు సంస్థలు పరస్పరం పంచుకోవాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం.
Truecaller buys payments app Chillr Facebook bug set 14 million users’ private posts to public TRAI signs net neutrality MoU with  BEREC à°•à±à°°à°¿à°ªà±à°Ÿà±‹ క‌రెనà±à°¸à±€ à°¬à±à°¯à°¾à°¨à±â€Œ పేమెంటౠయాపౠచిలà±à°²â€Œà°°à±â€Œà°¨à± కొనà±à°¨ à°Ÿà±à°°à±‚కాల‌రà±â€Œ ఫేసà±â€Œà°¬à±à°•ౠబగà±â€Œà°¤à±‹ డేటా లీకà±â€Œ నెటà±â€Œà°¨à±à°¯à±‚à°Ÿà±à°°à°¾à°²à°¿à°Ÿà±€à°®à±€à°¦ బెరెకà±â€Œ à°Ÿà±à°°à°¾à°¯à± ఎంవోయూ Â