ఇంటర్నెట్ షట్ డౌన్లు, ప్రైవసీ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్, అమెజాన్ వెబ్ సర్వీసుల ఆదాయం.. ఇలాంటి టెక్నాలజీ విశేషాలన్నింటితో ఈ వారం టెక్ రౌండప్ మీ కోసం..
1.ఇంటర్నెట్ షట్ డౌన్లు ఎక్కువే
రాజస్థాన్ లో ఇంటర్నెట్ గత ఏడాది 9సార్లు షట్ డౌన్ అయిందని ఆ రాష్ట్ర హోమ్ శాఖ చెప్పింది. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇండియాలో అత్యధికంగా ఇంటర్నెట్ షురూ డౌన్లు జరుగుతున్న రాష్ట్రం రాజస్థాన్. కమ్యూనల్ హింసతోపాటు రాజస్థాన్ పోలీస్ నియామక పరీక్షల్లో కాపీయింగ్ ని అడ్డుకోవడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినట్టు హోం శాఖ తెలిపింది. మొత్తంగా లాస్ట్ ఇయర్ ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో 79 సార్లు ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు.
2) జస్ట్ డయల్ త్రైమాసిక ఆదాయం 38.5 కోట్లు
ఆన్లైన్ క్లాసిఫైడ్స్, ఈ కామర్స్ సంస్థ జస్ట్ డయల్ 2018 మార్చి నుంచి జూన్ వరకు ముగిసిన మొదటి త్రైమాసికానికి 38.5 కోట్ల రూపాయల నికర లాభం సంపాదించింది. గత ఏడాది ఇదే సమయంలో సంపాదించిన దాని కంటే ఇది 1% తక్కువ.
3)ఇన్ఫో ఎడ్జ్ ఆదాయం 63 కోట్లు
నౌకరీ. కామ్, జీవన్ సాథీ, 99 ఎకర్స్. కామ్ సైట్లు నడిపే ఇన్ఫో ఎడ్జ్ సంస్థ 2018 మార్చి నుంచి జూన్ వరకు ముగిసిన మొదటి త్రైమాసికానికి 62.9 కోట్ల రూపాయల నికర లాభం సంపాదించింది. గత ఏడాది ఇదే సమయంలో సంపాదించిన దాని కంటే ఇది 1.5 కోట్లు తక్కువ.
4)ప్రైవసీ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్ ప్రవేశపెట్టిన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
వ్యక్తిగత సమాచార రక్షణ కోసం తయారు చేసిన పర్స నల్ ప్రొటెక్షన్ డేటా బిల్ 2018ను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ఐటీ శాఖకు సమర్పించింది. దీన్ని ఐటీ శాఖ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఈ బిల్ ఆమోదం పొందితే డేటా లీక్ చేసిన వారు కోట్ల రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది.
5)నీట్ అభ్యర్ధుల డేటా లీక్ కాలేదన్న సీబీఎస్ఈ
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష రాసిన అభ్యర్ధుల డేటా లీకైనదన్న ఆరోపణలను పరీక్ష నిర్వహించిన సీబీఎస్ఈ కొట్టిపారేసింది. ఈ డేటా సురక్షితంగా ఉందని చెప్పింది.
5)పేమెంట్ సర్వీసు డాటాను ఇండియాలోనే స్టోర్ చేయాలి: పేటీఎం
పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పేమెంట్ డేటాను ఇండియాలోనే స్టోర్ చేసేలా నిబంధన తేవాలని పేటీఎం ప్రభుత్వాన్ని కోరింది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇండియాలో పేమెంట్ సర్వీసులు అందిస్తున్న నేపధ్యంలో ఈ డేటాను వేరే దేశాల్లో స్టోర్ చేస్తే ప్రమాదం అని పేటీఎం ఆందోళన వ్యక్తం చేసింది.
6) భారీగా అమెజాన్ వెబ్ సర్వీసుల ఆదాయం
అమెజాన్ వెబ్ సర్వీసుల ఆదాయం ఏకంగా 50% పెరిగింది. వాల్ స్ట్రీట్ జర్నల్ అంచనాలను కూడా దాటి ఏకంగా ఈ మూడు నెలల్లో 2.5 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 1200% ఎక్కువ
à°ˆ వారం టెకౠరౌండపà±