టెక్నాలజీ ప్రపంచంలో జరిగిన విభిన్న పరిణామాలను వారం వారం మీ ముందుకు తెస్తున్న ఈ వారం టెక్ రౌండప్.. కొత్త రౌండప్తో మీ ముందుకొచ్చేసింది. ట్రాయ్ స్పామ్ రిపోర్టింగ్ యాప్ నుంచి ఈకామర్స్ కొత్త రూల్స్ వరకు వివిధ అంశాల్లో ఈ వారం జరిగిన పరిణామాలు ఇవిగో..
ట్రాయ్ స్పామ్ రిపోర్టింగ్ యాప్స్కి ఐఫోన్లో యాక్సెస్ ఇవ్వలేమన్న యాపిల్
స్పామ్ ఎస్ఎంఎస్లను అరికట్టేందుకు రూపొందిస్తున్న డీఎన్డీ 2.0 స్పామ్ రిపోర్టింగ్ యాప్కు ఫోన్లలో పర్మిషన్ ఇవ్వాలని ట్రాయ్ మొబైల్ తయారీ కంపెనీలకు సూచించింది. ఈ పర్మిషన్ ఇస్తే తమ ఐ ఫోన్ లాగ్స్ లోని వివరాలన్నీ బయటకొస్తాయని,ఇది తమ యూజర్ల ప్రైవసీకి భంగమని యాపిల్ దీన్ని తిరస్కరించింది. అయితే ట్రాయ్ దీనిమీద గట్టిగా పట్టుబడితే ఐఫోన్లు ఇండియాలో అమ్ముకోవడం కష్టంగా మారుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉడాయ్ టోల్ ఫ్రీ నెంబర్పై రగడ
గత వారం రోజుల నుంచి ఇండియాలోని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల ఫోన్ బుక్లో UIDAI పేరుతో 1800-300-1947 అనే నెంబర్ సేవ్ అయింది. ఇది ఆధార్ మాతృసంస్థ అయిన ఉడాయ్ టోల్ ఫ్రీ నెంబర్. మనకు తెలియకుండానే మన ఫోన్లలో ఈ నెంబర్ ఫీడ్ అవడంతో టెక్నాలజీ సర్కిల్స్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వమే మొబైల్ తయారీ సంస్థలను ఈ నెంబర్ అన్ని ఫోన్లలో ఉండేలా చూడాలని ఆదేశించిందని చాలామంది ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అయితే తాము ఎలా ఎవరినీ ఆదేశించలేదని ట్రాయ్ చెప్పింది. చివరకు తేలిందేమిటంటే గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్స్ కోడింగ్లో చాలా హెల్ప్లైన్ నెంబర్లతో పాటు ఈ టోల్ ఫ్రీ నెంబర్ను చాలా కాలం కిందటే ఇచ్చింది. అది ఇప్పుడు వస్తుంది. అయితే ఇది సెక్యూరిటీ పరంగా భయాందోళనలు కలిగిస్తుంది కాబట్టి తర్వాత అప్డేట్లో దీన్ని తొలగిస్తామని గూగుల్ చెప్పింది.
నెట్ న్యూట్రాలిటీపై కమిటీ వేయనున్న డీవోటీ
నెట్ న్యూట్రాలిటీపై వచ్చే ఫిర్యాదులపై ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వాలని టెలికం శాఖ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది.
నేషనల్ ఈకామర్స్ పాలసీ డ్రాఫ్ట్
నేషనల్ ఈకామర్స్ పాలసీ డ్రాఫ్ట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈకామర్స్ వెబ్సైట్లలో రూపే కార్డ్ను పెట్టడం, జనధన్ అకౌంట్లు డేటాను కూడా క్రెడిట్ వర్తీనెస్కు ఉపయోగించడం లాంటి పలు నిబంధనలు ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఉన్నాయి.
ఈకామర్స్ పాలసీపై ప్రజాభిప్రాయం కోరనున్న కేంద్రం
ఇండియాలో ఈకామర్స్ విధానం ఎలా ఉండాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను తయారుచేసింది. దీనిమీద ప్రజాభిప్రాయం కూడా సేకరించాలని భావిస్తోంది. వచ్చే పది రోజుల్లో దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ సుధాన్షు పాండే చెప్పారు.
రోజూ 18 వెబ్పేజీలను బ్లాక్ చేస్తున్న ఇండియా
ఇండియన్ ఐటీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెబ్పేజీలను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 2016 జనవరి నుంచి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 11,045 యూఆర్ ఎల్స్ను ఇండియన్ ఇంటర్నెట్ నుంచి బ్లాక్ చేసింది. అంటే రోజుకు 18 పేజీలు బ్లాక్ చేస్తున్నట్లు చెప్పింది.
రాజస్థాన్లో మరోసారి ఇంటర్నెట్ షట్డౌన్
రాజస్థాన్లో మరోసారి ఇంటర్నెట్ షట్డౌన్కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గురువారం దళితులు ఆందోళనకు దిగిన పరిస్థితుల్లో షట్డౌన్ చేసింది. ఇంటర్నెట్ షట్ డౌన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో కోర్టు ఇంటర్నెట్ షట్డౌన్ చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. అయినా సరే ప్రభుత్వం మళ్లీ దానికి ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది.
మరిన్ని నగరాల్లో జొమాటో సర్వీస్లు
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన సర్వీస్లను మరిన్ని నగరాలకు విస్తరించబోతుంది. డెహ్రాడూన్, ఆగ్రా, పాట్నా, మైసూర్, రాంచీ, రాయ్పూర్, ఔరంగాబాద్ నగరాలకు ఈ నెలలోగా సర్వీసులను ప్రారంభిస్తామని జొమాటో ప్రకటించింది.
వాల్మార్ట్ ఫ్లిప్ కార్ట్ ఒప్పందంపై వ్యాపారుల న్యాయపోరాటం
వాల్మార్ట్- ఫ్లిప్కార్ట్ ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) అంగీకరించడంతో ఇండియాలోని ఆఫ్లైన్ ట్రేడర్లు ఆందోళన బాటపట్టారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ దీనిపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.
Internet shutdown in  Rajasthan Net Neutrality Tech roundup à°ˆ వారం టెకà±â€Œà°°à±Œà°‚డ‌పà±â€Œ  రాజ‌సà±à°¥à°¾à°¨à±â€Œà°²à±‹ ఇంట‌రà±à°¨à±†à°Ÿà± ష‌టà±â€Œà°¡à±Œà°¨à±â€Œ à°Ÿà±à°°à°¾à°¯à± à°¸à±à°ªà°¾à°®à± రిపోరà±à°Ÿà°¿à°‚గౠయాపౠఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± ఫోనà±à°²â€Œà°²à±‹ ఉడాయౠటోలౠఫà±à°°à±€ నెంబ‌రà±â€Œ నేష‌న‌లౠఈకామ‌రà±à°¸à± పాల‌సీ à°¡à±à°°à°¾à°«à±à°Ÿà± Â