ఈ వారం టెక్ రౌండ‌ప్

మ‌రో వారం పూర్త‌యిపోయింది. ఈ వారంలో టెక్నాల‌జీ రంగంలో జ‌రిగిన సంగ‌తుల్లో కీల‌క‌మైన అంశాల‌తో రీ క్యాప్ మీకోసం..

1. మ‌న డేటా ఎంత వ‌ర‌కు భ‌ద్రం?
 పేటీఎం యూజ‌ర్ల‌ స‌మాచారాన్నిప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (పీవోఎం) అడిగింద‌ని పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు విజయ్ శేఖ‌ర్ శ‌ర్మ సోద‌రుడు, సంస్థ సీనియ‌ర్ వైస్‌ప్రెసిడెంట్‌ అజ‌య్‌శ‌ర్మ కోబ్రా పోస్ట్ అనే ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ చేసిన‌ ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో  చెప్ప‌డం క‌ల‌కలం సృష్టించింది.  అజ‌య శేఖ‌ర్ శ‌ర్మ‌,  పేటీఎం  వైస్ ప్రెసిడెంట్ సుధాన్షు గుప్త‌లు  తాము ఆరెస్సెస్ (భాజ‌పా అనుబంధ సంస్థ‌)తో ద‌గ్గ‌ర సంబంధాలున్న వ్య‌క్తుల‌మ‌ని , తాము ప్ర‌భుత్వంతో కూడా ద‌గ్గ‌ర సంబంధాలు  న‌డుపుతుంటామ‌ని ఈ ఆప‌రేష‌న్‌లో చెప్పారు. అయితే కోబ్రాపోస్ట్ చెబుతున్న‌వాటిలో నిజాల్లేవ‌ని పేటీఎం అంటోంది. త‌మ ద‌గ్గ‌రున్న యూజ‌ర్ల డేటా పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త‌మ‌ని, 100 శాతం సుర‌క్షితంగా ఉన్నద‌ని చెప్పింది. దాన్ని  తాము గానీ థ‌ర్డ్ పార్టీ యాప్స్‌గానీ తీసుకోలేద‌ని చెప్పారు. ఎవ‌రు అడిగినా ఇవ్వ‌లేద‌న్నారు. కేవ‌లం శాంతిభ‌ద్ర‌త‌లు ప‌ర్య‌వేక్షించే సంస్థ‌లు కోరిన‌ప్పుడు మాత్ర‌మే ఇచ్చామ‌న్నారు.అయితే ఆ సంస్థ‌లేమిటో చెప్ప‌క‌పోవ‌డం అనుమానాల‌కు దారితీసింది. పేటీఎంకు ఇప్పుడు 20 కోట్ల మంది యూజ‌ర్లున్నారు. ఇలా చాలా కంపెనీల ద‌గ్గ‌ర ల‌క్ష‌ల మంది డేటా ఉంది. వాళ్లు ఆ డేటాను ఏం చేస్తున్నార‌నే ఆందోళ‌న పేటీఎం ఉదంతంతో మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది.

2. 9 కోట్లు పెరిగిన జాగ‌ర‌ణ్‌ ప్ర‌కాశ‌న్ డిజిట‌ల్ యాడ్ రెవెన్యూ
దేశంలోనే అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ క‌లిగిన దైనిక్ జాగ‌ర‌ణ్ పత్రిక‌ను న‌డుపుతున్న జాగ‌ర‌ణ్ ప్ర‌కాశ‌న్ లిమిటెడ్ (జేపీఎల్‌) త‌న‌డిజ‌ట్ యాడ్ రెవెన్యూలో ప్ర‌గ‌తి సాధించింది. మార్చి నెలాఖ‌రుతో ముగిసిన త్రైమాసికంలో 9కోట్లు ఎక్కువ ఆదాయం సాధించింది.

3.ప‌తంజ‌లి స్వ‌దేశీ సిమ్‌ల సంద‌డి
ప‌తంజ‌లి పేరుతో ఆయుర్వేద ఉత్ప‌త్తుల బిజినెస్‌ను వేల కోట్ల‌కు తీసుకెళ్లిన బాబా రామ్‌దేవ్ కంపెనీ దేశీయ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి స్వ‌దేశీ స‌మృద్ధి సిమ్ కార్డును తీసుకొచ్చింది.  స్పెష‌ల్ ఆఫ‌ర్స్ ఉండే ఈ సిమ్ ఇది ప‌తంజ‌లి మెంబ‌ర్స్‌కు మాత్ర‌మేన‌ని బీఎస్ఎన్ఎల్ త‌ర్వాత ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎవరైనా ఈ సిమ్‌లు తీసుకోవ‌చ్చ‌ని  తాజాగా ప్ర‌క‌టింంచింది.మ‌రోవైపు వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా కింబో యాప్ తెస్తామ‌ని ప‌తంజ‌లి ప్ర‌క‌టించడం టెక్నాల‌జీ స‌ర్కిల్లో ఈ వారం సంద‌డి చేసిన మ‌రోవార్త‌. 

4. ఆధార్ లింకేజీ మీ ఇష్ట‌మ‌న్న ఇండియా  పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌
అన్నింటికీ ఆధార్ లింకేజి త‌ప్ప‌నిస‌ర‌న్న మాట‌తో విసిగిపోయిన మ‌నంద‌రికీ శుభ‌వార్త‌. ఆధార్ లింకేజి చేసుకోవాలా వ‌ద్దా అన్న‌ది మీ ఇష్టం (ఛాయిస్‌) అని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు చెప్పింది. ఆధార్ లింకేజి నిర్బంధం కాకూడ‌ద‌ని, స్వ‌చ్ఛందంగానే దాన్ని వాడుకునే వీలుండాల‌ని సుప్రీంకోర్టులో ప‌లువురు పిటిష‌న్లు వేసి వాదిస్తున్న ప‌రిస్థితుల్లో ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

5. ఇన్ఫీ ఎడ్జ్ ఆదాయంలో 10.7% పెరుగుద‌ల‌
నౌక‌రీ.కామ్‌, జీవ‌న్‌సాథీ.కామ్‌, 99 ఎక‌ర్స్‌.కామ్ వంటి సైట్ల‌ను న‌డుపుతున్న ఇన్ఫోఎడ్జ్ కంపెనీ ఆదాయం గ‌త త్రైమాసికంలో బాగా పెరిగింది. మార్చి నెలాఖ‌రుకు 76.3 కోట్ల నిక‌ర లాభం సాధించింది. గ‌తేడాది ఇదే టైమ్‌తో పోల్చితే 10.7% గ్రోత్ సాధించింది.

6. స్పామ్ కాల్స్‌కు బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో అడ్డుక‌ట్ట వేయ‌నున్న ట్రాయ్‌
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల‌తో విసిగిపోతున్న టెలికం వినియోగ‌దారుల‌కు బ్లాక్ చైన్ టెక్నాలజీతో విముక్తి కల్పించాలని టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  తన కొత్త విధానపత్రంలో పేర్కొంది. ట్రాయ్.. టెలి మార్కెటింగ్ కాల్స్, మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ లిస్ట్ తయారు చేస్తుది. ఆ కాల్స్, మెసేజ్ లను రికార్డ్ చేసి ఒక పెద్ద డేటాబేస్ తయారు చేస్తుంది. ఆ లిస్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు రియ‌ల్ టైమ్‌లో అప్‌డేట్ అవుతుంది. వారికి మాత్ర‌మే  టెలి మార్కెటింగ్ కంపెనీలు కాల్స్ లేదా మెసేజ్‌లు పంపాలి. అలాంటివి వద్దన్న వారికి వస్తున్నాయేమో  బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రియల్ టైంలో చెక్ చేస్తుంది. ఈ ఆధారాలతో స్పామ్ కాల్స్ చేసే కంపెనీలకు ఫైన్ విధించాలన్నది ట్రాయ్ ఆలోచన.      

7. కోడ్ మాస్ట‌ర్స్‌లో 60% వాటా అమ్మేసిన అడాగ్‌
అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన వీడియో గేమ్ ప‌బ్లిష‌ర్ కోడ్ మాస్ట‌ర్స్ త‌న 60% వాటాను 1700 కోట్ల‌కు అమ్మేసింది.  2009లో బ్రిటిష్ వీడియో గేమ్ మేక‌ర్ నుంచి కోడ్ మాస్ట‌ర్స్‌లో 90 శాతం వాటాను అడాగ్ రూ.100 కోట్ల‌కు కొంది.  ఇప్పుడు అందులో 60 శాతాన్ని 1700 కోట్ల‌కు అమ్మింది. అంటే 25 రెట్లు ఎక్కువ సంపాదించింది.

8. రూ.172 కోట్ల న‌ష్టాల్లో మేక్ మై ట్రిప్‌
 ఆన్‌లైన్ మార్కెట్ ట్రావెల్ ఏజెన్సీ మేక్ మై ట్రిప్ న‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.  మార్చి నెలాఖ‌రుతో ముగిసిన త్రైమాసికానికి మేక్ మై ట్రిప్ న‌ష్టం 172 కోట్ల రూపాయ‌ల దాటిపోయింది.ఏడాదికాలంగా  ఇదే ప‌రిస్థితి కొనసాగుతోంది. ఉద్యోగుల జీతాలు, మార్కెటింగ్ ఖ‌ర్చులు పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మని ఎంఎంటీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

9. సోష‌ల్ మీడియా మానిట‌రింగ్ చేస్తాం:  కేంద్ర‌ ప్ర‌భుత్వం
సోష‌ల్ మీడియా మా మంత్రిత్వ శాఖ ప‌రిధిలోకి రాద‌ని, అది స్వ‌తంత్ర‌మైన‌దని కేంద్ర స‌మ‌చార‌, ప్ర‌సారాల శాఖ మంత్రి, మాజీ షూట‌ర్ రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ గ‌త నెల‌లో చెప్పారు. అయితే రీసెంట్‌గా ఓ టెండ‌ర్‌లో త‌మ మంత్రిత్వ శాఖ ఓ సోష‌ల్ మీడియా క‌మ్యూనికేష‌న్ హ‌బ్‌ను ఏర్పాటు చేయ‌బోతుంద‌ని ప్ర‌క‌టించారు.  బిడ్డ‌ర్లు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌తోపాటు కొన్ని బ్లాగ్స్‌ను కూడా మానిట‌ర్ చేయాల‌ని దానిలో చెప్పారు. 

Tech round up Paytm Data leak Patanjali Sims Block Chain Technology to control Spam calls  టెక్ రౌండ‌ప్‌ పేటీఎం డేటా లీక్‌ ప‌తంజ‌లి సిమ్స్‌  బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో స్పామ్ కాల్స్‌కు అడ్డుక‌ట్ట‌