పండగ సీజన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లాంటి ఈకామర్స్ సంస్థలు పండగ చేసుకున్నాయి. వాలెట్లతో ఈకామర్స్లో వస్తువులు కొంటే డిస్కౌంట్లు పెట్టడంతో ఫోన్ పేలాంటి వాలెట్ల ట్రాన్సాక్షన్లు కూడా వందల కోట్ల రూపాయల్లో జరిగాయి. మరోవైపు టెలికం రంగంలో పోటీతో ఎయిర్టెల్ లాభం దాదాపు 70 శాతం పడిపోయింది. ఇలా ఈ వారం టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న పరిణామాల సమాహారం ఈ వారం టెక్ రౌండప్లో మీకోసం..
ఫ్లిప్కార్ట్ బిగ్బిలియన్ డేస్లో ఫోన్ పే హవా
పండగల సీజన్లో ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్బిలియన్ డేస్ సేల్.. ఫోన్ పేకి పండగ చేసింది. ఫ్లిప్కార్ట్ సబ్సిడరీ కంపెనీ అయిన డిజిటల్ వాలెట్ ఫోన్ పే ఈ బిగ్బిలియన్ డేస్ 5 రోజులపాటు సాధారణం కంటే 150% ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేసింది. ఫోన్ పేతో చేస్తే 10 % డిస్కౌంట్ ఉండడమే ఇందుకు కారణం. ఒక్క రోజే ఏకంగా 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు ఫోన్ పే ఫ్లాట్ఫాం మీద జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్లు దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ జరగడం విశేషమని ఫోన్ పే ప్రకటించింది.
పండగ సీజన్ సేల్లో 15వేల కోట్లు సంపాదించిన ఈకామర్స్ సంస్థలు
దసరా, దీపావళి పండగల కోసం ఈకామర్స్ సంస్థలు తీసుకొచ్చిన సేల్స్ ఆ కంపెనీలకు కనకవర్షం కురిపించాయి. ఆరు రోజుల సేల్లో ఏకంగా 15వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇది గత సంవత్సరం సేల్తో పోల్చితే ఏకంగా 64% ఎక్కువ. 15 వేల కోట్ల రూపాయల బిజినెస్లో ఫ్లిప్కార్ట్ 60 శాతానికి పైగా సంపాదించింది. అమెజాన్ 37% పైగా సంపాదించింది.
డేటా ప్రొటెక్షన్ బిల్పై అభిప్రాయాలు బయటపెట్టని ప్రభుత్వం
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ తాను రూపొందించిన డేటా ప్రొటెక్షన్ బిల్ను ముసాయిదా తయారుచేసి ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టింది. అయితే శ్రీ కృష్ణ కమిటీ గానీ, పబ్లిక్ గానీ ఈ బిల్పై ఎలాంటి అభిప్రాయాలు చెప్పాయని ప్రభుత్వం బయటపెట్టడం లేదు.
పేటీఎం సీఈవోను బెదిరించిన సంస్థ ఉద్యోగులు
పేటీఎం సీఈవో విజయ్శేఖర్ శర్మను అతని సంస్థ ఉద్యోగులే బెదిరించారు. తమకు 10 కోట్లు ఇవ్వకపోతే విజయ్ వ్యక్తిగత సమాచారం అంతా బయటపెడతామని సంస్థ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సోనియా ధావన్, ఆమె భర్త రూపక్ జైన్, పేటీఎం ఉద్యోగి దేవేంద్రకుమార్ బెదిరించారు. ఈ ముగ్గురినీ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
క్రిప్టో కరెన్సీ ఏటీఎం మీద సీసీఎస్ పోలీసుల దాడి
దేశంలో నిషేధించిన క్రిప్టో కరెన్సీని డ్రా చేసుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా బెంగుళూరులో ఏటీఎంనే ఏర్పాటు చేశాడు. అయితే దీనిమీద సీసీఎస్ పోలీసులు రైడ్ చేశారు. ఈ ఏటీఎం కియోస్క్ ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండా పెట్టినందువల్ల యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు డీసీజీఐ నోటీసులు
నిబంధనలు పాటించని, కల్తీ, నకిలీ కాస్మోటిక్స్ అమ్ముతున్నారంటూ ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 5,6 తేదీల్లో 8 నగరాల్లో రైడ్ చేసి 4కోట్ల రూపాయల విలువైన నకిలీ కాస్మోటిక్స్ పట్టుకున్నామని డీజీసీఐ ప్రకటించారు. ఇవి ఎలాంటి లైసెన్స్లు లేని నకిలీ కంపెనీలు తయారుచేసినవని, వీటితో మనుషుల శరీరానికి హాని కలుగుతుందని చెప్పింది. అయితే తమకు ఎలాంటి నోటీసులు రాలేదని ఇండియా మార్ట్ ప్రకటించింది.
శాక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కండక్ట్ చేయనున్న నెట్ఫ్లిక్స్
నెట్ ఫ్లిక్స్ తన శాక్రెడ్ గేమ్స్ (Sacred Games)ను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో రెండో సీజన్కు లైన్ క్లియర్ అయింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వరుణ్ గ్రోవర్పై అవేవీ నిరూపణ కానందున అతనితో ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్లో వృద్ధి
కోటక్ మహీంద్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ వేగం అందుకుంది. గతేడాదితో పోల్చితే మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు సెప్టెంబర్లో ముగిసిన రెండో క్వార్టర్కు 250 శాతం పెరిగాయని బ్యాంక్ ప్రకటించింది.
65 శాతం పడిపోయిన ఎయిర్టెల్ లాభం
టెలికం రంగంలో పోటీ ఎయిర్టెల్ లాభాలను దెబ్బకొడుతోంది. గతేడాది సెప్టెంబర్లో ముగిసిన త్రైమాసికానికి ఎయిర్టెల్ రూ.343 కోట్ల లాభం సంపాదిస్తే ఈసారి అదే సమయానికి కేవలం రూ.119 కోట్లే సంపాదించింది. ఇది గతేడాదితో పోల్చితే 65 శాతం తక్కువ.
వీడియో యాడ్స్ ద్వా ట్విట్టర్ 5,543 కోట్ల సంపాదన
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వీడియో యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి ఏకంగా 5,543 కోట్ల రూపాయలు దీని ద్వారనే సంపాదించినట్లు ట్విట్టర్ అనౌన్స్ చేసింది.
This week Tech roundup Airtel net profit falls Data protection bill Flipkart amazon great indian sale Phonepe à°ˆ వారం టెకౠరౌండ‌పà±â€Œ ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± లాà°à°‚ ఢమాలà±â€Œ పండ‌గ సేలà±à°¸à±â€Œà°¤à±‹ à°«à±à°²à°¿à°ªà±â€Œà°•ారà±à°Ÿà±â€Œ అమెజానౠపండ‌గ‌ ఫోనౠపే హ‌వా కోటకౠమహీందà±à°° మొబైలౠబà±à°¯à°¾à°‚à°•à°¿à°‚à°—à±â€Œ డేటా à°ªà±à°°à±Šà°Ÿà±†à°•à±à°·â€Œà°¨à± బిలà±â€Œ