అన్ని టెల్కోల 499 ప్లాన్స్‌లో ఏది బెస్ట్‌?

 జియో ఎంట‌ర‌య్యాక ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీలో నెల‌వారీ ప్లాన్స్ సీన్ దాదాపు ముగిసిపోయింది.  75, 80 రోజులు, మూడు నెలల ప్లాన్స్‌ను ఆప‌రేట‌ర్లంద‌రూ తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో 499 ప్లాన్స్ కూడా ఉన్నాయి.  వివిధ టెల్కోలు ఆఫ‌ర్ చేస్తున్న 499 ప్లాన్స్‌లో బెస్ట్ ఏమిటో చూద్దాం.

ఐడియా 499 ప్లాన్ 
ఐడియా నెట్‌వ‌ర్క్‌లో 82 రోజుల వ్యాలిడిటీతో 499 ప్లాన్ తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 499 ప్లాన్‌కు పోటీగా ఈ ప్లాన్ ప్ర‌వేశ‌పెట్టింది.
ధ‌ర‌: 499 రూపాయ‌లు
వ్యాలిడిటీ: 82 రోజులు
డైలీ డేటా: 2జీబీ (ఆ త‌ర్వాత వాడితే 10 కేబీకి 4 పైస‌ల ఛార్జి ప‌డుతుంది)
మొత్తం డేటా: 84 రోజుల‌కు 164 జీబీ 
కాల్స్‌: అన్‌లిమిటెడ్ లోక‌ల్, ఎస్టీడీ కాల్స్‌, ఐడియా నెంబ‌ర్ల‌కు రోమింగ్ ఫ్రీ 
ఎస్ఎంఎస్‌లు:  రోజుకు 100 ఫ్రీ

ఎయిర్‌టెల్ 499 ప్లాన్ 
ఇది కూడా సేమ్ ఐడియా ప్యాకేజీలాగే ఉంటుంది.అయితే రోజుకు 2జీబీ డేటా త‌ర్వాత కూడా ఫ్రీగా డేటా వాడుకోవ‌చ్చు. అయితే స్పీడ్‌ 128 కేబీపీఎస్ మాత్ర‌మే వ‌స్తుంది.
ధ‌ర‌: 499 రూపాయ‌లు
వ్యాలిడిటీ: 82 రోజులు
డైలీ డేటా: 2జీబీ 
మొత్తం డేటా: 82 రోజుల‌కు 164 జీబీ 
కాల్స్‌: అన్‌లిమిటెడ్ ఫ్రీ లోక‌ల్, ఎస్టీడీ, నేష‌న‌ల్ రోమింగ్ కాల్స్ 
ఎస్ఎంఎస్‌లు:  రోజుకు 100 ఫ్రీ

జియో 498 ప్లాన్ 
ఇది కూడా పై ప్లాన్ లాంటిదే. అయితే మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల్లో 2జీ, 3జీ, 4జీ డేటా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవాలి. జియోలో అయితే 4జీ నెట్‌వ‌ర్క్ ఒకటే కాబ‌ట్టి నెట్ స్పీడ్ బాగుంటుంది. అంతేకాదు వ్యాలిడిటీ కూడా 91 రోజులు అంటే మిగిలిన‌వాటితో పోల్చితే  9రోజులు ఎక్కువ‌. 
అయితే రోజుకు 2జీబీ డేటా త‌ర్వాత కూడా ఫ్రీగా డేటా వాడుకోవ‌చ్చు. అయితే స్పీడ్‌64 కేబీపీఎస్ మాత్ర‌మే వ‌స్తుంది 
ధ‌ర‌: 498 రూపాయ‌లు
వ్యాలిడిటీ: 91 రోజులు
డైలీ డేటా: 2జీబీ 
మొత్తం డేటా: 91 రోజుల‌కు 182 జీబీ 
కాల్స్‌: అన్‌లిమిటెడ్ ఫ్రీ లోక‌ల్, ఎస్టీడీ, నేష‌న‌ల్ రోమింగ్ కాల్స్ 
ఎస్ఎంఎస్‌లు:  రోజుకు 100 ఫ్రీ

వొడాఫోన్ 511 ప్లాన్  
వొడాఫోన్‌లోనూ సేమ్ ఆఫ‌ర్లే ఉంటాయి. అయితే వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది.
అయితే రోజుకు 2జీబీ డేటా త‌ర్వాత కూడా ఫ్రీగా డేటా వాడుకోవ‌చ్చు. అయితే స్పీడ్‌64 కేబీపీఎస్ మాత్ర‌మే వ‌స్తుంది 
ధ‌ర‌: 511 రూపాయ‌లు
వ్యాలిడిటీ:84     రోజులు
డైలీ డేటా: 2జీబీ (ఆ త‌ర్వాత వాడితే ల ఛార్జి ప‌డుతుంది)
మొత్తం డేటా: 84 రోజుల‌కు 168 జీబీ 
కాల్స్‌: అన్‌లిమిటెడ్ ఫ్రీ లోక‌ల్, ఎస్టీడీ, నేష‌న‌ల్ రోమింగ్ కాల్స్ 
ఎస్ఎంఎస్‌లు:  రోజుకు 100 ఫ్రీ

బీఎస్ఎన్ఎల్ 485 ప్లాన్ 
బీఎస్ఎన్ఎల్ కూడా ఈ రేంజ్‌లో తీసుకొచ్చిన ప్లాన్ ఇది. అయితే రోజుకు 1.5 జీబీ డేటా మాత్ర‌మే వ‌స్తుంది. అదీ 3జీ డేటా మ‌త్ర‌మే. రోమింగ్ ఫ్రీ లేదు. వ్యాలిడిటీ 91 రోజులు ఉండ‌డం కాస్త ప్ల‌స్‌పాయింట్‌
ధ‌ర‌: 485 రూపాయ‌లు
వ్యాలిడిటీ: 91    రోజులు
డైలీ డేటా: 2జీబీ (ఆ త‌ర్వాత వాడితే ల ఛార్జి ప‌డుతుంది)
మొత్తం డేటా: 91రోజుల‌కు 136.5 జీబీ 
కాల్స్‌: అన్‌లిమిటెడ్ ఫ్రీ లోక‌ల్, ఎస్టీడీ కాల్స్ 
ఎస్ఎంఎస్‌లు:  రోజుకు 100 ఫ్రీ
మొత్తంగా చూస్తే ఈ సెగ్మెంట్‌లో జియోనే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాలిడిటీ ఎక్కువ‌. 4జీ డేటా స్పీడ్‌, జియో యాప్స్‌కి ఫ్రీగా వాడుకోవ‌చ్చు. 


 

Best Rs 499 Plan Idea Rs 499 Plan Airtel Rs 499 Plan Vodafone Rs 511 Plan BSNL Rs 485 Plan బెస్ట్ 499 రూపాయ‌ల రీఛార్జి ప్లాన్‌ ఐడియా 499 ప్లాన్ ఎయిర్‌టెల్ 499 ప్లాన్ జియో 498 ప్లాన్ Jio Rs 498 Plan వొడాఫోన్ 511 ప్లాన్  బీఎస్ఎన్ఎల్ 485 ప్లాన్