ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..ఇదే బ్యాంకుల నినాదం. దీంతోనే క్రెడిట్కార్డు సేవలు భారత్లో విపరీతంగా పెరిగిపోయాయి. బిల్లు చెల్లించడానికి 14 రోజుల గడువు కూడా ఉంటుంది. ఈ గడువు దాటితే వడ్డీ పడుతుంది. అయితే ప్రతి చోటకి క్రెడిట్ కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదు. క్రెడిట్ కార్డు లేకుండానే నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇందుకోసం వర్చువల్ క్రెడిట్ కార్డులు వచ్చాయి. అంటే మన చేతిలో కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించొచ్చన మాట. ఐడీఎఫ్సీ బ్యాంకు కొత్తగా ఇలాంటి వర్చువల్ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. మరి ఈ కార్డు ప్రత్యేకత ఏంటి?
ఈపే లేటర్ అప్లికేషన్తో..
వర్చువల్ క్రెడిట్ కార్డును ఉపయోగించాలంటే ముందుగా. ఈపే లేటర్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రియల్ టైమ్ క్రెడిట్ అసెస్మెంట్స్కోసం ఈ అప్లికేషన్ను ఉపయోగిస్తారు. డిజిటల్ క్రెడిట్ సోల్యుషన్స్ కోసం వినూత్నంగా దీన్ని రూపొందించారు. ఐడీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్యం అయిన డిజిటల్ క్రెడిట్ సొల్యూషన్స్ ఈ వర్చువల్ క్రెడిట్ కార్డుకు రూపకల్పన చేసింది. భీమ్ యూపీఐ పేమెంట్ ఫ్లాట్ఫాంను ఉపయోగించుకుంటూ ఈ వర్చువల్ క్రెడిట్కార్డు నడుస్తుంది.
చిన్న వ్యాపారులకు...
చిన్న వ్యాపారుల వ్యాపారానికి వర్చువల్ కార్డుల పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు కావాల్సినప్పుడు, సరుకులు కొనాల్సినప్పుడు డబ్బులు లేకుండానే వాళ్లు లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. క్రెడిట్తో పాటు స్వల్పకాల రుణాలు, క్యాష్ ఇన్ అడ్వాన్స్ లాంటి సదుపాయాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్న వ్యాపారులు, లావాదేవీల మీద దృష్టి పెట్టిన ఇ పే లేటర్ ఇకపై పెద్ద కంపెనీలపై కూడా దృష్టి సారించనుంది. ఫిజికల్ కార్డు లేకుండా.. ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ లేకుండా అందరూ వర్చువల్ క్రెడిట్ కార్డులు ఉపయోగించాలనేదే ఆ సంస్థ వ్యూహం. ఐడీఎఫ్సీ బ్యాంకుతో పాటు మిగిలిన అన్ని బ్యాంకులతో ఇలా భాగస్వామ్యాన్ని కుదురుర్చకుని ఇపే లేటర్ను విస్తరించాలని ప్రయత్నం జరుగుతోంది. యూపీఐతో పాటు బాప్ (బ్యాంక్ యాజ్ ఏ ఫ్లాట్ఫాం)ను కూడా ఉపయోగించనున్నారు.
ePayLater IDFC Bank partner India first UPI-based digital credit card à°¬à±à°¯à°¾à°‚కౠయాజౠఠఫà±à°²à°¾à°Ÿà±â€Œà°«à°¾à°‚ ఫిజిక‌లౠకారà±à°¡à± ఈపే లేట‌రౠఅపà±à°²à°¿à°•ేష‌నà±â€Œ