ఈ వారం టెక్ రౌండ్ అప్

ఫారెక్స్ సర్వీస్ లను ఆఫర్ చేస్తున్న పేటిఎం

ప్రముఖ వ్యాలెట్ సంస్థ అయిన పేటిఎం ఇకపై ఫారెన్ ఎక్స్చేంజ్ రంగంలోనికి మరియు అంతర్జాతీయ పే మెంట్ రంగం లోనికి కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నుండి అథరైజ్ద్ డీలర్ షిప్ లైసెన్స్ ( AD కేటగరీ II ) ని కూడా పొందింది. విదేశాలలో పర్యటించే విదేశీయులకు అలాగే విదేశాలలో పర్యటించే భారతీయులకూ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని పేటిఎం భావిస్తుంది.

ఇండియా లో ప్రారంభం కానున్న VICE

కెనడా కు చేఇద్న డిజిటల్ మీడియా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అయిన VICE మీడియా వాస్తవానికి గత సంవత్సరం మోడతో త్రైమాసికం లోనే ఇండియా లో తన ఆపరేషన్ లను ప్రారంభించవలసి ఉంది. కానీ ఒక సంవత్సరం ఆలస్యంగా మరో కొద్ది రోజుల్లో ఇండియా లో తన పని మొదలు పెట్టేందుకు VICE కసరత్తు మొదలుపెట్టింది.

డేటా కలెక్షన్ పాలసీ లను ఎక్స్ ప్లెయిన్ చేసిన ఫేస్ బుక్

యూజర్ ల నుండి ఫేస్ బుక్ డేటా ఎలా సేకరిస్తుందీ తదితర వివరాలను ఇవ్వడానికి ఫేస్ బుక్ యాజమాన్యం అంగీకరించింది. 10 గంటల సుదీర్ఘ వాదనల తర్వాత ఫేస్ బుక్ సీఈఓ అయిన మార్క్ జుకర్ బర్గ్ దీనికి అంగీకరించాడు.

 ఆర్ కాం ఆస్తుల అమ్మకాలపై స్టే విధించిన సుప్రీం కోర్ట్

రిలయన్స్ కమ్యూనికేషన్స్ యొక్క అస్త్లను రిలయన్స్ జియో కు పాక్షికంగా అమ్మడం పై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తుది తీర్పు వెలువడే వరకూ ఈ స్టే అలాగే ఉంటుందని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ వెల్లడించింది.

నకిలీ వార్తలపై నిజ నిర్ధారణ చేస్తున్న ఫేస్ బుక్

ముంబై కి చెందిన నిజ నిర్ధారణ వెబ్ సైట్ అయిన BOOM తో కలిసి సోషల్ నెట్ వర్క్ లో హల్ చేసే ఫేక్ న్యూస్ పైనిజ నిర్ధారణ చేయనున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. కర్ణాటక లో వచ్చే నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యం లో పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడ దీనిని ప్రారంభించనున్నారు.

రూ 40-45 కోట్ల కు పెంచనున్న వోగో

టు వీలర్ రెంటల్ స్టార్ట్ అప్ అయిన  వొగో తన భాగస్వామ్యులు అయిన వోలా మరియు ఇతరుల నుండి  పెట్టుబడిని రూ 40-45 కోట్లకు పెంచనుంది. ఈ మేరకు ఈ సంస్థ ఒక మీడియా ప్రకటనను విడుదల చేసింది.

ఇండియా లో వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న ఉబెర్

తాజాగా ఉబెర్ యొక్క coo గా నియమితులైన బార్నీ హార్డ్ ఫోర్డ్ ఇండియా లో జనవరి లో పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యం లోనే ఇండియా లో తమయొక్క వ్యాపార  విస్తరణ గురించీ, పెట్టుబడులు మరియు ఇతర ప్రణాళికల గురించి  ఆలోచిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేశారు.

ఫేస్ బుక్ ద్వారా మొబైల్ రీఛార్జి

ఇకపై యూజర్ లు తమ ఫేస్ బుక్ ఎకౌంటు నుండే తమ  మొబైల్ ను రీఛార్జి చేసుకునే సదుపాయాన్ని ఫేస్ బొక్ ప్రారంబించింది. ఇండియా లోని డిజిటల్ పేమెంట్ ల విభాగం లో ఫేస్ బుక్  యొక్క మొట్టమొదటి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు.

tech round up face book vogo forex pay TM digital payments