షియామీ QIN AI వ‌ర్సెస్ జియోఫోన్ వ‌ర్సెస్‌ జియోఫోన్-2, ఫీచ‌ర్ ఫోన్ రారాజు ఎవ‌రు

దేశీయ మార్కెట్‌లో షియామీ సంస్థ హ‌వా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల బ‌డ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల‌తో వినియోగ‌దారుల‌కు చేరువైన ఈ చైనా కంపెనీ.. తొలిసారిగా ఫీచ‌ర్ ఫోన్‌ను విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఫీచ‌ర్ ఫోన్‌ల‌లో  జియో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే జియో ఫోన్‌-2 కూడా రాబోతోంది. ఇప్పుడు వీటికి పోటీగా షియామీ కంపెనీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ప‌నిచేసే 4G ఫీచ‌ర్ ఫోన్‌ను రూపొందించింది. జియో ఫీచ‌ర్ ఫోన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.. దాని కంటే మెరుగైన ఫీచ‌ర్ల‌తో షియామీ కూడా కొత్త మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఒక్క‌టే కాదు.. VoLTE, 17 భాష‌లను ట్రాన్స్‌లేట్ చేసే స‌దుపాయం కూడా ఉంది. ఒక‌వేళ Qin AI టెక్నాల‌జీతో దేశంలో క‌నుక షియామీ సంస్థ ఫీచ‌ర్ ఫోన్‌ను విడుద‌ల చేస్తే.. ఇది జియోకు స‌రైన పోటీ అని భావిస్తున్నారు. మ‌రి ఈ రెండింటిలో ఎవ‌రు రారాజు అనేది తెలుసుకుందాం!

Qin AI vs JioPhone 2 vs JioPhone
ఈ ఫోన్లలో ముఖ్యమైన ఫీచ‌ర్లు, వాటిలో ఆప్ష‌న్లు ఉన్నాయో ప‌రిశీలిద్దాం! 

డిజైన్‌
8.5 మిల్లీ మీట‌ర్ల మందంతో, జియో ఫోన్‌లో ఉండే T9 కీ ప్యాడ్‌తో షియామీ Qin AI ఫోన్ ఉంటుంది. ఇక జియో ఫోన్‌-2లో బ్లాక్‌బెర్రీ మోడ‌ల్‌లో ఉండే QWERTY కీప్యాడ్ ఉంటుంది. ఈ మూడింటితో పోల్చుకుంటే డిజైన్ విష‌యంలో జియో ఫోన్‌-2కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. 

Display
Xiaomi Qin AI ఫోన్ 2.8 అంగుళాల డిస్ల్పేతో ఉంటుంది. ఇక జియో ఫీచ‌ర్ ఫోన్‌, జియో ఫోన్‌-2లో 2.4 అంగుళాల TFT డిస్ల్పే ఉంటుంది. ఈ విభాగంలో  Xiaomi Qin AI ముందంజ‌లో ఉంది. 

Camera
షియామీ ఫీచ‌ర్ ఫోన్‌లో కెమెరా లేదు. జియో, జియో-2 ఫోన్ల‌లో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. అంతేగాక వీజీఏ సెన్సార్ ఉంటుంది. షియామీ Qin AI ఫోన్‌లో IR బ్లాస్టర్ అమ‌ర్చారు. ఇందులో విన్న‌ర్‌– Jio Phones. 

Storage
జియో ఫోన్ల‌లో ర్యామ్ 512 ఎంబీ, 4 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఉంటుంది. ఈ షియామీ ఏఐ ఫోన్ల‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి 256 ఎంబీ ర్యామ్‌, 512 ఎంబీ ర్యామ్‌తో, మ‌రొక‌టి 8 ఎంబీ ర్యామ్‌, 16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో ఉంటుంది. సో ఎక్కువ మెమొరీ ఉన్న Jio Phones వైపే అంతా మొగ్గు చూపుతారు. 

Software
జియో ఫోన్లు.. KAI OS మీద ర‌న్ అవుతాయి. ఇది యూట్యూబ్‌, వాట్సాప్, గూగుల్ మ్యాప్స్‌తో పాటు ఇత‌ర యాప్‌లు కూడా ఫీచ‌ర్ ఫోన్‌లో స్మూత్‌గా ప‌నిచేసేలా స‌పోర్ట్ చేస్తుంది. షియామీ Qin AI ఫోన్‌.. ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఫోర్క్‌డ్ వెర్ష‌న్ అయిన మోకోర్ 5పై ప‌నిచేస్తుంది. ఇందులోనూ జియో ఫోన్స్‌ను షియామీ బీట్ చేయ‌లేదు. 

SIM Support
జియో ఫోన్‌లో కేవ‌లం ఒకే ఒక్క సిమ్ వాడుకోవ‌చ్చు. ఇక షియామీ ఏఐ ఫోన్‌తో పాటు జియో ఫోన్-2లో రెండు సిమ్ కార్డులు ఉప‌యోగించుకోవ‌చ్చు. సో డ్యుయెల్ సిమ్ ఫోన్‌లో Jio Phone 2, Xiaomi Qin AI కూడా మంచివే! 

Connectivity
జియో, జియో ఫోన్‌-2.. 4G LTE, 4G VoLTE, బ్లూటూత్‌, ఎన్ఎఫ్‌సీ, వైఫై వంటి ఆప్ష‌న్లు స‌పోర్ట్ చేస్తాయి. ఇక Qin AI కూడా LTE, VoLTE, వైఫైని స‌పోర్ట్ చేస్తుంది. ఇందులోనే రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒక‌టి 2జీ ఫోన్ కాగా, మ‌రొక‌టి 4జీ ఫోన్.
విన్న‌ర్‌– చెప్ప‌లేం

Battery
షియామీ ఫోన్ కేవ‌లం 1480 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌స్తుంది. ఇక జియో ఫోన్ల‌లో 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంటుంది. ఈ విభాగంలో జియోనే గెలిచింది. 

Price
జియో ఫోన్ పూర్తి ఉచితంగా వ‌స్తుంది. మొద‌ట రూ.1500 క‌ట్టినా.. త‌ర్వాత వాటిని ఇచ్చేస్తారు. ఇక జియో ఫోన్‌-2 ధ‌ర‌ రూ.2,999 అయినా ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్‌లో రూ.501కే వ‌స్తోంది. క్విన్ ఏఐ ఫోన్ ధ‌ర రూ.1999గా ఉండ‌బోతోంది. మ‌రి ఇందులో Jio Phonesనే బెట‌ర్‌. ప్ర‌స్తుతం షియామీ ఫీచ‌ర్ ఫోన్‌లో అంద‌రినీ ఆకర్షించేది ట్రాన్స్‌లేష‌న్ ఫీచ‌ర్‌. ఇండియ‌న్ మార్కెట్‌ని ప‌రిశీలిస్తే.. జియో ఫోన్‌కి ఈ Xiaomi Qin AI ఫోన్‌.. ఏమాత్రం పోటీ కాద‌ని తేలిపోయింది. ఈ ట్రాన్స్‌లేష‌న్ ఫీచ‌ర్‌.. ఇక్క‌డ ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. ఈ రెండింటింటి మ‌ధ్య కాంపిటేష‌న్‌లో జియోనే రారాజుగా తేలింది.

jio feature phone xiaomi feature mobile artificial intelligence jio phone-2 competitor jio vs xiaomi