స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. అయితే దీనివల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్వచ్చే ప్రమాదం ఉందని ఇండియన్ ఆర్మీ తన సైనికులను హెచ్చరించింది. ముఖ్యంగా చైనా నుంచి భద్రతాపరమైన ఇబ్బందులున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇందుకోసం వాట్సాప్ వాడుతున్న తమ సైనికులందరికీ 6 టిప్స్ను చెప్పింది. అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ తమ అఫీషియల్ ట్విట్టర్ @adgpiలో ఈ టిప్స్ను ప్రకటించారు. సైనికులు అఫీషియల్ లేదా పర్సనల్ వాట్సాప్ గ్రూప్ల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. అవేంటో చూద్దాం.
1. +86తో ప్రారంభమయ్యే చైనీస్ మొబైల్ నెంబర్లు ఇండియన్ ఆర్మీ గుట్టుమట్లు తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ల్లోకి చొరబడుతున్నాయి. కాబట్టి +86తో ప్రారంభమయ్యే నెంబర్లమీద ఓ కన్నేసి ఉంచండి.
2. మీ గ్రూప్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏవైనా అనాథరైజ్డ్ నెంబర్లను మీ గ్రూప్లో ఎవరైనా యాడ్ చేస్తున్నారేమో చూసుకోండి.
3. మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్న నెంబర్లన్నీ కచ్చితంగా సంబంధిత వ్యక్తుల పేర్లమీద సేవ్ అయి ఉన్నాయా లేదా చూడండి.
4. తెలియని నెంబర్ల నుంచి గ్రూప్లోకి ఏదైనా యాక్టివిటీ వస్తుందేమో తరచూ చెక్ చేయండి.
5.మీరు మొబైల్ నెంబర్ మార్చితే వెంటనే గ్రూప్ అడ్మిన్కు తెలియపరచడం మరిచిపోకండి.
6. మీ పాత సిమ్ కార్డ్ను వాడకపోతే వెంటనే ధ్వంసం చేయండి. అంతేకాదు ఆ నెంబర్ను వాట్సాప్ గ్రూప్లో నుంచి ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి.
Whatsapp security tips indian army whatsapp security tips ఇండియ‌నౠఆరà±à°®à±€ వాటà±à°¸à°¾à°ªà± à°Ÿà°¿à°ªà±à°¸à± సెకà±à°¯à±‚à°°à°¿à°Ÿà±€ à°Ÿà°¿à°ªà±à°¸à±â€Œ చైనీసౠమొబైలౠనెంబ‌రà±à°²à±