ఇక పాప‌ప్ కెమెరాలు మాయం అవ‌నున్నాయా?

స్మార్ట్‌ఫోన్ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది కెమెరానే.. కాల్స్‌, మెసేజ్‌లు ఎంత ఇంపార్టెంటో కెమెరా మ‌న‌కు అంత‌కంటే ఎక్కువ‌గా ఇంపార్టెంట్. ఎందుకంటే మ‌న ఫొటోలు తీసుకోవ‌డానికి.. వీడియోలు తీసుకోవ‌డానికి దీని అవ‌స‌రం చాలా ఉంది. అయితే మార్కెట్లో పోటీ పెరిగిన త‌ర్వాత కెమెరాల్లో కూడా ఎన్నో మార్పులు వ‌చ్చాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా కెమెరాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.  వీటిలో భాగంగా వ‌చ్చిన‌వే పాప‌ప్ కెమెరాలు. మ‌న సెల్ఫీల కోసం బాగా యూజ్ అయ్యే ఆప్ష‌న్ ఇది.  అయితే త్వ‌ర‌లోనే ఈ కెమెరాలు మాయం కానున్నాయా!

అన్ని ఫోన్ల‌లోనూ..
దాదాపు అన్ని ఫోన్ల‌లోనూ ఈ పాప‌ప్ కెమెరా అనేది ఒక ఆప్ష‌న్‌గా  మారిపోయింది. షియోమి, వ‌న్ ప్ల‌స్‌, ఒప్పో కెమెరాల్లో ఇది త‌ప్ప‌ని స‌రి ఆప్ష‌న్‌. 2019లో వ‌చ్చిన ట్రెండ్స్‌లో ఈ పాప‌ప్ సెల్ఫీ కెమెరాలు ఒక‌టి. ఫోన్ల అమ్మ‌కాల‌ను మ‌రింత పెంచుకోవ‌డానికి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు  చైనా కంపెనీలు ఈ పాప‌న్ సెల్ఫీ కెమెరాల‌ను ఒక ఆప్ష‌న్‌గా వాడుకున్నాయి. మోట‌రైజ్డ్ పాప‌ప్ కెమెరాలు వినియోగ‌దారుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. 

హోల్ పంచ్ డిజైన్‌
అయితే పాప‌ప్ కెమెరాలు అంద‌రి మ‌న్న‌న‌లు పొందినా.. వినియోగ‌దారుల‌ను మ‌రింత ఆక‌ర్షించే దిశ‌గా కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌స్తున్నాయి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే హోల్ పంచ్ డిజైన్‌. పాప‌ప్ కెమెరాల స్థానంలో హోల్ పంచ్ డిజైన్ అమ‌ర్చ‌డం ద్వారా ఫోన్‌ను మ‌రింత ఆకర్ష‌ణీయంగా మార్చొచ్చ‌నేది కంపెనీల మాట‌. షియోమి, వ‌న్ ప్లస్‌, ఒప్పో ఈ దిశ‌గానే అడుగులు వేస్తున్నాయి. హాన‌ర్‌, శాంసంగ్ కూడా ఈ ఆలోచ‌నే చేస్తున్నాయి. పాప‌ప్ కెమెరాల‌నేవి బ్యాడ్ డిజైన్ ఛాయిస్ అని పంచ్ హోల్ డిజైన్ అయితే స్ర్కీన్‌కు మ‌రింత రిచ్ లుక్ తేవ‌చ్చ‌నేది కంపెనీల మాట‌. 

హోల్ పంచ్ డిజైన్‌తో వ‌స్తున్న ఫోన్లు

వ‌న్ ప్ల‌స్ 8 ప్రొ

రెడ్ మి కె 30 ప్రొ

రియ‌ల్ మి ఎక్స్ 50 5జీ

వివో ఎక్స్ 30 

Goodbye pop-up camera Redmi K30 OnePlus 8 punch-hole camera