భారత టెలిఫోన్ మార్కెట్లో చాలా ఫోన్లు ఉన్నాయి.. రోజుకో వెర్షన్ ఫోన్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్.. వాటిలో ఏది ఉత్తమం.. వీటిని తెలుసుకోవడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే ఒక్కో ఫోన్‌కు ఒక్కో యూనిక్ లక్షణం ఉంది. మరీ ముఖ్యంగా రెండు ఫోన్ల మధ్య భారీగా పోటీ నడుస్తోంది ఆ ఫోన్లే రెడ్ మి, రియల్ మి. ఈ రెండూ కస్టమర్ల అటెన్షన్ గ్రాబ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతటి పోటీకి కారణం ఆన్‌లైన్ మార్కెటింగ్!
ఆన్‌లైన్ పెరిగింది.. ఆఫ్‌లైన్ తగ్గింది
ఆన్‌లైన్ మార్కెటింగ్ విపరీతంగా పెరగడం వల్లే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు కూడా చాలా ర్యాపిడ్‌గా ఉన్నాయి. ఆన్‌లైన్లో సేల్స్ ఉండడం వల్ల ఆఫర్లు పెట్టడం వల్ల ఎక్కువమంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆఫ్‌లైన్ మార్కెట్ పడిపోయింది. ఇది మిగిలిన ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఆన్‌లైన్‌లో మంచి సేల్ ఉన్న రెడ్ మి, రియల్ మీ మాత్రమే మార్కెట్లో దూసుకెళుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా 58 శాతం సేల్స్ జరిగితే, అమేజాన్ ద్వారా 29 శాతం సేల్స్ అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం రెడ్‌మి, రియల్ మి ఫోన్లే ఉండడం విశేషం.
ప్రిమియం ఫోన్లలో అమేజాన్ టాప్
ఐఫోన్, వన్‌ప్లస్ లాంటి ప్రిమియం ఫోన్ల అమ్మకాల్లో మాత్రం అమేజాన్ టాప్‌లో ఉంది. ఈ ఏడాది మిగిలిన సైట్లతో పోలిస్తే అమేజాన్ ఎక్కువశాతం ప్రిమియం ఫోన్లను అమ్మింది. వీటిలో ఐఫోన్లతో పాటు వన్ ప్లస్ 7 సిరీస్, రెడ్‌మి 6ఏ, రెడ్ మి 7, గెలాక్సీ ఎం లాంటి ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. షియోమి ఫోన్లు మాత్రం ఎప్పటిలాగే మిగిలిన అన్ని ఫోన్ల కంటే టాప్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా అమ్ముడుపోయిన ఫోన్లలో 46 శాతం వాటా షియోమి ఫోన్లదే. ఆ తర్వాత రియల్ మి పోటీలో ఉంది. బడ్జెట్ ఫోన్లు కావడం, అందరికి అందుబాటు ధరల్లో మంచి ఫీచర్లతో ఉండడంతో ఎక్కువమంది ఈ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Redmi Realme Indian Online Smartphone Market Grows