2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2019. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటారు. మరికొందరు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంటారు. మరి మీ ఈ-వ్యాలెట్లోకి స్నేహితులు లేదా ఇతర బంధువుల ద్వారా వచ్చే నగదు, ఈ-షాపింగ్స్ వంటి ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్ల ద్వారా మీకు కలిగిన లాభంపై ట్యాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
ఆదాయపన్ను నిబంధనల ప్రకారం బహుమతులుగా పరిగణించే వాటి విలువ రూ.50,000 లోపు ఉంటే గిఫ్ట్ ట్యాక్స్ వర్తించదు. స్నేహితులు లేదా ఎవరైనా రూ.50,000 ట్రాన్సఫర్ మించితే మాత్రం అది ట్యాక్స్ పరిదిలోకి వస్తుంది. ఒకవేళ, మనకు ఎవరైనా మనకు ఇవ్వాల్సిన డెబ్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో దానికి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అయితే ఇందుకు సంబంధించి వారి నుంచి రాతపూర్వక పత్రం తీసుకొని, దానిని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సమర్పించాల్సి ఉంటుంది.
క్యాష్ బ్యాక్ ఆఫర్ అమౌంట్ మీ ఆదాయం కిందకే వస్తుంది. ఇలాంటి దానిని మీరు ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో సమర్పించాలా? అంటే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తే 'ఇతర సోర్స్ ద్వారా ఇన్‌కం'గా చూపించాలి. రూ.50 వేల కంటే తక్కువగా ఉంటే మాత్రం చూపించవలసిన అవసరం లేదు.
గిఫ్ట్ వోచర్స్ ద్వారా వచ్చే గిఫ్టులకు సంబంధించిన ట్యాక్స్ అనేది ఇద్దరి మద్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ కంపెనీ యజమాని నుంచి రూ.5,000 విలువ కలిగిన గిఫ్ట్ ఓచర్‌ను అందుకున్నప్పుడు ఆదాయపన్ను చట్టం నిబంధన (7)(iv) ప్రకారం పన్నుకు లోబడి ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు లేదా ఇతర రిలేషన్ కలిగిన వ్యక్తి లేదా వారసులు.. వంటి వాటి నుంచి వచ్చే వాటిపై ఎలాంటి పన్ను ఇబ్బందులు లేవు. స్నేహితులు, ఇతర గిఫ్ట్ ఓచర్ల పైన రూ.50,000 మించితే పన్ను పరిమితికి లోబడి ఉంటుంది.
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, బహుమతి విలువ రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే, అటువంటి వాటిపై స్వీకర్త చేతిలో ఉన్న ఆదాయంలో భాగంగా పన్ను విధించబడుతుంది. బహుమతి ఈ క్రింది రూపాలలో ఎదో ఒక రూపంలో నగదు, కదిలే లేదా స్థిరమైన ఆస్తి, ఆభరణాలు మొదలైనవి కావచ్చు. వ్యక్తి సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల యొక్క సోదరుడు లేదా సోదరి, వ్యక్తి భార్య సహోదరుడు, భాగస్వామి దగ్గరి వారు.. ఇలా వీటిపై పన్నురహితంగా ఆ బహుమతిని క్లెయిమ్ చేసుకోవచ్చు.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ à°ˆ వాలà±à°²à±†à°Ÿà±à°¸à± à°Ÿà±à°¯à°¾à°•à±à°¸à±. ఇనà±â€Œà°•à°‚ à°Ÿà±à°¯à°¾à°•à±à°¸à± పేటీఎం గూగà±à°²à± పే అమెజానౠపే