పండ‌గ డిస్కౌంట్ల‌న్నీ మాయే అన‌డానికి ఇదిగో ఫ్రూఫ్‌!

ఇప్పుడు పండ‌గ డిస్కౌంట్లు భారీగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ సైట్లు డిస్కౌంట్ల‌తో హోరెత్తిస్తున్నాయి. కార్డు ఆఫ‌ర్లు, ఇన్‌స్టంట్లు, నో ఈఎంఐ కాస్ట్ అంటూ ఊద‌ర‌గొడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ పేరు మీద కోట్లాది రూపాయిల బిజినెస్ జ‌రిగిపోయింది. ఇప్పుడు దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని కూడా అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జాలు మ‌ళ్లీ సేల్స్‌కు తెర తీస్తున్నాయి. మ‌రి పండ‌గ డిస్కౌంట్లు అన్ని మాయేనా! అవునా అని చెబుతున్నాయి  కొన్ని రుజువులు..

ధ‌ర‌లు ఎక్కువ పెట్టేసి..
ఆన్‌లైన్ సేల్స్ పేరిట ఇటీవ‌ల ద‌స‌రా, దీపావ‌ళి ముంగిట అమేజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్ ఇ-కామ‌ర్స్ సైట్లు భారీగా నిర్వ‌హించాయి. ఈ సేల్స్ గ్యాప్ ఇచ్చి మ‌రీ ఇంకా నిర్వ‌హిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సేల్స్‌లో భాగంగా అమేజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌లు ఇచ్చిన డిస్కౌంట్ల‌లో నిజా నిజాలు ఎంత‌? ఎంత వ‌ర‌కు ఇవి రియ‌ల్ అని ఆరా తీస్తే చాలా డిస్కౌంట్లు మ‌సి పూసి మారేడు కాయ చేసిన‌ట్లు కొన్ని స‌ర్వేల్లో తేలింది. మామూలు సమ‌యాల్లో ఉండే ధ‌ర‌ల‌కు ఒక రెండు, మూడు వేలు పెంచేసి.. డిస్కౌంట్ పేరుతో ఆ రెండు మూడు వేలే త‌గ్గించిన‌ట్లుగా ఈ స‌ర్వేల్లో తేలింది. అంటే క‌స్ట‌మ‌ర్లు మామూలు ధ‌ర‌కే ఫోన్ల‌ను కొన్న‌ట్లు వాళ్ల‌కు ఎలాంటి డిస్కౌంట్లు రాలేద‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి..

సెల్‌ఫోన్లు భారీ మోసం
ఆన్‌లైన్ సేల్స్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోయిన వ‌స్తువులు సెల్‌ఫోన్లే.  అయితే మామూలు స‌మ‌యంలో ఉండే ధ‌ర‌ల‌నే ఇంకా ఎక్క‌వ ధ‌ర‌కు పెంచేసి ఆ త‌ర్వాత కార్డ్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అని, లేదా ఫ్లాష్ సేల్‌, వ‌న్ అవ‌ర్ డీల్‌, టూడేస్ డీల్ పేరిట వాటిని తగ్గించి క‌స్ట‌మ‌ర్ల‌ను బురిడీ కొట్టించిన‌ట్లు తెలుస్తోంది. అంటే ఏదో బాగా అవ‌స‌రం ఉన్న‌వాళ్లు త‌ప్ప స‌ర‌దాగా సేల్ పెట్టార‌ని, డిస్కౌంట్లు పెట్టార‌ని కొన్న‌వాళ్లు మోస‌పోయిన‌ట్లే అని ఈ స‌ర్వేలు చెబుతున్నాయి. 

Festive Discounts Amazon Flipkart Illusion