చాలామంది స్మార్ట్ఫోన్లను పదే పదే మారుస్తుంటారు. కొంతమంది ఆపర్లను బట్టి కొనుక్కుంటారు.. ఇంకొందరు ఫ్యాషన్ కోసం కొంటారు.. ఇంకొందరు బడ్జెట్ ఫోన్ల కోసం వేచి చూసి కొనుక్కుంటారు. స్మార్ట్ఫోన్లో అప్డేట్లు వస్తూ ఉంటాయి.. వాటి ధరలు తగ్గుతూ ఉంటాయి ఈ కారణాలతో ఫోన్లను కొనడానికి స్మార్ట్ఫోన్ వినియోగదారులు బాగా ఉత్సాహం చూపిస్తుంటారు. అలా ఉత్సాహం చూపించేవారికి ఇదే సరైన సమయం.
సేల్స్ వస్తున్నాయ్
చాలామందికి ఒక సందేహం ఉంటుంది.. స్మార్ట్ఫోన్లను ఎప్పుడు కొనుగోలు చేయాలి అని. ఈ కన్ఫ్యూజన్ను తీర్చడానికి కొన్ని సందర్భాలు వస్తుంటాయి. అవే పండగలు.. సాధారంగా ఆన్లైన్ ఇ-కామర్స్ సైట్లు పండగల వేళల్లో భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. సెల్ఫోన్ కంపెనీలు కూడా ఇలాంటి సందర్భాల్లోనే ఫ్లాగ్షిష్ వెర్షన్లను తీసుకొస్తుంటాయి. శాంసంగ్, వన్ ప్లస్ లాంటి ఫోన్లు ఇలా బిగ్ సేల్స్ అప్పడే కొత్త వెర్షన్లను తీసుకొస్తాయి. ఇలాంటప్పుడే అవి భారీ ఆఫర్లతో ఈ ఫోన్లను అందిస్తాయి. వినియోగదారులకు ఫోన్లు చవకగా దొరికేది ఇలాంటి సందర్భంలోనే.
ఎందుకు కొనాలి..
సాధారణ పరిస్థితుల్లో స్మార్ట్ఫోన్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. డిస్కౌంట్లు తక్కువగా ఉంటాయి. అదీ కాక ఎక్సేంజ్ ఆఫర్లు ఉండవు. కానీ పండగల సమయంలో మనకు ఎక్కువ ఆఫర్లతో సేల్స్ నడుస్తాయి. ఎక్సేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు మన పాత ఫోన్లను ఇచ్చేసి కొత్త ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదీ తక్కువ ధరకే ఫోన్లను పొందొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త ఫోన్లను లాంఛ్ చేసే సమయంలో స్మార్ట్ఫోన్ కంపెనీలు తక్కువ దరకే ఫోన్లను అందిస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో ఆఫర్లను మిస్ చేసుకోకూడదు.
Best Time Buy Smartphone Amazon flipcart sales festivels