బిలియ‌న్ డివైజ్‌ల‌లో యాపిల్ ఏఆర్ టెక్నాలజీ

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించేది, న‌మ్మేది  యాపిల్‌నే. కంప్యూట‌ర్‌లు మాత్ర‌మే కాదు ఫోన్లు, ట్యాబ్‌లతో యాపిల్ పెద్ద విప్ల‌వ‌మే తీసుకొచ్చింది. అయితే యాపిల్‌కు ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా అగ్‌మెంటెడ్ రియాల్టీ (ఏఆర్‌) వ‌చ్చాక గూగుల్ ఒక ర‌కంగా యాపిల్‌ను బీట్ చేసేసింది. గ‌త కొంత కాలంగా ఆ సంస్థ ఏఆర్ టెక్నాల‌జీతో దూసుకెళ్లింది. అయితే అదే అగ్‌మెంటెడ్ రియాల్టీతో గూగుల్‌ను దెబ్బ కొట్టాల‌ని యాపిల్ ప్ర‌య‌త్నిస్తోంది. వ‌చ్చే మూడేళ్ల‌లో  బిలియ‌న్ డివైజ్‌ల‌లో ఏఆర్ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది యాపిల్‌.

గూగుల్ చేయ‌లేనిది..
ఏఆర్ టెక్నాలజీ ముందుగా తీసుకొచ్చి యూజ‌ర్ల నుంచి మార్కులు కొట్టేసిన గూగుల్‌కు యాపిల్ నుంచి పోటీ రావ‌డం పెద్ద ప‌రీక్షే. ఎందుకంటే యాపిల్ డివైజ్‌ల‌తో పోలిస్తే గూగుల్ డివైజ్‌లు వాడేవాళ్లు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌క్కువ‌. అందుకే ఆ సంస్థ తెచ్చిన ఏఆర్ టెక్నాల‌జీ అంత‌గా వినియోగ‌దారుల్లోకి చొచ్చుకెళ్ల‌లేదు. ఈ సాంకేతిక‌త‌ను వాడ‌టానికి వాళ్లు అల‌వాటు ప‌డ‌లేదు.  గూగుల్ ద‌గ్గ‌ర ఉన్న ఈ  లోపాన్నే బ‌లంగా చేసుకోవాల‌ని యాపిల్ ఆలోచిస్తోంది.  ఈ ఏడాది చివ‌రి నాటికి బిలియ‌న్ డివైజ్‌ల‌లో ఏఆర్ టెక్నాల‌జీ అందుబాటులోకి తెచ్చి గూగుల్‌ను బీట్ చేయాల‌నేది ఆ సంస్థ వ్యూహం.

ఏఆర్ కిట్‌తో మొద‌లు
ఏఆర్ టెక్నాల‌జీ విష‌యంలో యాపిల్ ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయింది. మార్కెట్లోకి ఏఆర్ కిట్‌ను వ‌దిలింది. ఐఫోన్లు, ఐపాడ్స్‌లో ఏఆర్ అప్లికేష‌న్లు త‌యారు చేయ‌డానికి ఏఆర్ కిట్ టూల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 2014లో గూగుల్ టాంగో ఏఆర్ సాఫ్ట్‌వేర్ సిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేసింది. అయితే ఏఆర్ కిట్‌.. టాంగో క‌న్నా టెక్నాల‌జీ ప‌రంగా చాలా ముందుంది. టాంగోకి డెప్త్ ప‌ర్‌సెప్ష‌న్ సెన్సార్ల అవస‌రం ఉంది. అంతేకాక గూగుల్ ఏఆర్ టెక్నాల‌జీని ప్ర‌స్తుతం కేవ‌లం లెనొవో ఫాబ్ 2, ప్రొ, అస‌స్ జెన్‌ఫోన్ మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నాయి.

పాత డివైజ్‌ల‌లో కూడా 

ఏఆర్ కిట్ మాత్రం ఐఫోన్ ఎగ్జిస్టింగ్ హార్డ్‌వేర్‌లోనూ ఉప‌యోగించే అవ‌కాశం ఉంది. అయితే గూగుల్‌కు ఏఆర్‌తో ఉన్న మ‌రో ఇబ్బంది ఏంటంటే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌. ఆండ్రాయిడ్‌లో దీన్ని అప్‌డేట్ చేసిన‌ప్పుడు నెట్‌వ‌ర్క్ స్లో అయిపోతుంది. అయితే యాపిల్ టెక్నాల‌జీ అటు సాఫ్ట్‌వేర్‌, ఇటు హార్డ్‌వేర్ మీద నియ‌త్రణ‌తో ఏఆర్ కిట్‌ను రూపొందించింది. దీని ఫ‌లిత‌మే 86 శాతం యాపిల్ మొబైల్ డివైజ్‌లు లేటెస్ట్ ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌లో ర‌న్ అవుతున్నాయి. ఏఆర్ టెక్నాల‌జీలో యాపిల్ క‌చ్చితంగా ముందంజ‌లో ఉంటుంద‌న‌డానికి ఇది ఒక ఉదాహ‌రణ మాత్ర‌మే.

Apple augmented reality AR billion devices ARKit ecosystem iPhones Android గూగుల్‌ టాంగో ఏఆర్ టెక్నాల‌జీ లేటెస్ట్ ఐఓఎస్ ఎగ్జిస్టింగ్ హార్డ్‌వేర్‌