ఈ -వాలెట్స్ అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌య్యింది.. ముందే జాగ్ర‌త్త ప‌డండి 

డీమానిటైజేష‌న్‌తో ఈ-వాలెట్ల‌కు గిరాకీ పెరిగింది. పెద్ద నోట్ల ర‌ద్దుతో చేతిలో డ‌బ్బుల్లేని జనం క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల్లోంచి వాలెట్ల‌లోకి మనీ లోడ్ చేసుకుని వాటితో పాల‌ప్యాకెట్ల నుంచి ఫ్లైట్ టికెట్ల వ‌ర‌కూ కొనుక్కున్నారు. ఆ త‌ర్వాత ఈ ట్రెండ్ బాగా హిట్ట‌యింది. అయితే 2000, 500 నోట్ల రాకతో క్యాష్ ఫ్లో పెరగ‌డంతో జనానికి ఈ-వాలెట్ల మీద ఇంట్ర‌స్ట్ త‌గ్గుతూ వ‌స్తోంది. 

 బ్యాంకుల‌కే మేలు 
2016 న‌వంబ‌ర్‌లో  మొత్తం వాలెట్ ట్రాన్సాక్ష‌న్స్‌లో పేటీఎం, మొబీక్విక్‌, ఫ్రీ ఛార్జి లాంటి ఈ-వాలెట్ల వాటా 42%. అయితే ఈ ఫిబ్ర‌వ‌రికి అది 31%కి ప‌డిపోయింది. మ‌రోవైపు పెద్ద బ్యాంకులు వీటి వ‌ల్ల లాభ‌పడుతున్నాయి. ముఖ్యంగా యంగ్ క‌స్ట‌మ‌ర్లు ఈ వాలెట్ల ద్వారా వ‌చ్చే క్యాష్‌బ్యాక్స్‌, డిస్కౌంట్స్ కోసం డైనింగ్‌, పెట్రోల్‌, సినిమా టికెట్స్ కొన‌డానికి అన్నింటికీ వాటినే వాడుతున్నారు.  వీటితోపాటు యూపీఐ, భీమ్‌, భార‌త్ క్యూఆర్ లాంటి పేమెంట్ ఆప్ష‌న్స్‌కు బ్యాంకుల‌కే బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఎందుకంటే క‌స్ట‌మ‌ర్లకు ఏటీఎంలు, బ్యాంకుల ద్వారా స‌ర్వ్ చేయ‌డానికి అయ్యే ఖర్చు ఈ పేమెంట్ ఆప్ష‌న్ల వ‌ల్ల వాటికి మిగులుతుంది. అంతేకాదు ఇప్ప‌టికే బాగా క్లిక్క‌యిన ఈ- వాలెట్ల‌ను బ్యాంకులు కొనే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. యాక్సిస్ బ్యాంక్ అలాగే ఫ్రీఛార్జిని కొనేసింది. 

ఆదాయం త‌గ్గింది  
ఓప‌క్క డిజిల్ వాలెట్ల‌తో ట్రాన్సాక్ష‌న్లు త‌గ్గుతున్నాయని వాలెట్ కంపెనీలు బాధ‌పడుతుంటే మ‌రోవైపు ఆర్‌బీఐ వాటి మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ల‌ను త‌గ్గించింది. యూజ‌ర్‌కు దీనివ‌ల్ల ఉప‌యోగం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, కాబట్టి ఎక్కువ మంది క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్లకు అల‌వాటు ప‌డ‌తార‌ని ఆర్‌బీఐ అంచ‌నా. దీనిమీద డిజిటల్ వాలెట్ కంపెనీలు ఆందోళ‌న చెందుతున్నాయి. బ్యాంకుల‌కు  డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు అనేవి వాళ్ల బిజినెస్లో ఓ చిన్న పార్ట్ మాత్ర‌మే. అదే ఈ వాలెట్ల‌కు అయితే అదే ఆధారం.. కాబ‌ట్టి వాలెట్ ట్రాన్సాక్ష‌న్లు త‌గ్గినా, వ‌చ్చే మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ త‌గ్గినా కంపెనీల మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌మ‌ని కోట‌క్ మహీంద్ర బ్యాంక్ చీఫ్ డిజిట‌ల్ ఆఫీస‌ర్ దీపక్ శ‌ర్మ చెప్పారు.  బ్యాంకుల‌తో వాలెట్లు పోటీప‌డ‌లేక‌పోతున్నాయి. బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి అన్ని ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతేకాదు వాటి కి ల‌క్షల మంది క‌స్ట‌మ‌ర్ల బేస్ ఉంటుంది. ఈవాలెట్ల ఓన్లీ మ‌నీ పేమెంట్ కోస‌మే అదీ క‌స్ట‌మ‌ర్ల‌ను అవి ఇంకా సంపాదించుకునే ప‌నిలోనే ఉన్నాయి. 
* వాలెట్ నుంచి మ‌రో వాలెట్‌కు ఇంట‌ర్ ట్రాన్స్‌ప‌ర్‌బుల్ కు అవ‌కాశం లేదు. అదే గవ‌ర్న‌మెంట్ బేస్డ్ భీమ్‌, భార‌త్ క్యూఆర్‌ల‌కు ఆ ఆప్ష‌న్ ఉంది. ఇది కూడా ఈ-వాలెట్ల‌కు దెబ్బే.
బిజినెస్ డైవ‌ర్సిఫై చేస్తున్నాయి..
వాలెట్‌తో మ‌నీ పేమెంట్ ఒక‌టే చేస్తే మ‌నుగ‌డ సాధించ‌లేమ‌ని ఈ కంపెనీలు ఇప్పుడు ఇత‌ర స‌ర్వీసులు కూడా ప్రారంభించాయి.  Paytm  స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారింది.  గోల్డ్  , ఇత‌ర గూడ్స్ కూడా అమ్మ‌డం ప్రారంభించింది.   Mobikwik  ఇన్స్యూరెన్స్ పాల‌సీలు అమ్మ‌డం, మ్యూచువ‌ల్ ఫండ్స్ బిజినెస్ చేస్తోంది.  

Digital walletrs  Paytm Mobikwik PayU ఈ -వాలెట్స్ పేటీఎం మొబీక్విక్‌ పే యూ పేటీఎం