ఇప్పుడు నడుస్తోంది యాప్ల హవా.. ఏ స్మార్ట్ఫోన్ నిండా చూసినా యాప్లే. ఎక్కడ చూసినా యాప్ల గురించి చర్చే. ఏదైనా కొత్త యాప్ మార్కెట్లోకి వచ్చి సంచలనంగా మారితే ఆ యాప్ కచ్చితంగా మన ఫోన్లో ఉండి తీరాల్సిందే అన్నట్లున్నారు జనం. అయితే యాప్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్ మెమెరీ నెమ్మదిగా కరిగిపోతోంది. ఎంత మెమరీ కార్డులు ఉన్నా కూడా యాప్లు స్టోరేజ్ని తినేస్తున్నాయి. దీనివల్ల కొన్ని యాప్లను డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకు కొన్ని లైట్ యాప్లు వచ్చాయి. వీటితో మనకు స్పేస్ ఆదా అయి చాలా వరకు మెమరీ సమస్య తీరుతుంది. అయితే ఈ లైట్ యాప్లలో లైట్ ఎంత?.. రిస్క్ ఎంత?
ఫేస్బుక్ మొదలుకొని..
చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు లైట్ యాప్లపైనే దృష్టి పెట్టాయి. ఫేస్బుక్ మొదలుకొని వాట్సప్ వరకు అన్ని లైట్ వెర్షన్ మీద దృష్టి పెట్టాయి. లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సులభంగా మా యాప్లు వాడడండని ఈ సంస్థలు ప్రకటలను కూడా ఇస్తున్నాయి. అయితే లైట్ యాప్లు ఎన్ని ఉన్నా.. ఎక్కువమంది ఎందుకో వాటిని ఉపయోగించట్లేదు. మూములు యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ గో అనే లైట్ వెర్షన్ను విడుదల చేసింది. యూట్యూబ్ కూడా యూట్యూబ్ గో అనే వెర్షన్ను బయటకు వదిలింది.
ఎంట్రీ లెవల్ డివైజ్ల కోసం..
స్మార్ట్ఫోన్ ఉన్న వాళ్లకు యాప్లతో మరీ ఎక్కువ ఇబ్బందుల ఉండవు. మహా అయితే పాత యాప్లను డిలీట్ చేసుకుని కొత్త యాప్లు డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే ఎంట్రీ లెవన్ డివైజ్లతోనే ఇబ్బందులు. వాటికి మెమరీ చాలా తక్కువ. ఒకటి రెండు యాప్లకే మెమరీ మాయం అవుతుంది. ఇలాంటి వాటి కోసమే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సంస్థలు లైట్ యాప్లను రూపొందించాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఈ ఎంట్రీ లెవల్ డివైజ్ల వాడకం ఎక్కువ. ఇటీవలే జియోమి సంస్థ రెడ్మి 3ఎస్ ప్రైమ్ పేరిట ఒక లో ఎండ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. లైట్ యాప్ల కోసమే ఇది ప్రత్యేకంగా రూపొందింది. స్కైప్ లైట్ యాప్ కూడా వచ్చేసింది. దీని కెపాసిటీ 13 ఎంబీ మాత్రమే. అయితే ఈ లైట్ యాప్లు కొన్ని బాగానే పని చేస్తున్నా.. కొన్ని మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరిగా బిల్ట్ చేయకపోవడమే దీనికి కారణం. ముఖ్యంగా కొన్ని లైట్ యాప్లలో సాధారణ యాప్లలో ఉండే ఫీచర్లు మిస్ అవుతున్నాయి. ఇది కూడా పెద్ద లోపమే. సెఫ్టీ విషయంలో కూడా ఈ యాప్లది కొంచెం వెనుకడుగే. ఎందుకంటే తక్కువ శ్రేణి డివైజ్లలో వాడడం వల్ల సేఫ్టీ మెజర్లు తక్కువగా ఉంటాయి. హ్యాకింగ్ ఇబ్బందులు మీకు ఎప్పుడూ పొంచి ఉంటాయి.
Lite Android Apps Entry Level Phones facebook lite messenger lite à°Žà°‚à°Ÿà±à°°à±€ లెవ‌లౠడివైజà±â€Œ యూటà±à°¯à±‚బౠగో లైటౠవెరà±à°·â€Œà°¨à±â€Œ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± గో