మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

ప్రపంచం చాలా స్మార్ట్ గా మారిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వీటికి తోడు సెల్ఫీల గోల. ఈ కారణంతోనే మార్కెట్లో రెండు నుంచి మూడు కెమెరాలు ఉన్న ఫోన్లు ప్రవేశిస్తున్నాయి. అసలు మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగానే అవసరమా? అయితే ఎందుకు అవసరం...ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి. 

మల్టిపుల్ కెమెరాల గురించి ఆసక్తికర విషయాలు...
డ్యుయల్ కెమెరాలతో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ కంపెనీ 2011లో పరిచయం చేసింది. HTC Evo 3D పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉంటాయి. 3డీ ఫోటోలను క్యాప్చురు చేసుకునే విధంగా ఈ డ్యుయల్ కెమెరాను రూపొందించారు. 2014లో ఇదే హెచ్‌టీసీ కంపెనీ మరో అత్యుత్తమ డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. HTC one M8 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ HTC Evo 3Dతో పోలిస్తే మన్నికైన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. డ్యుయల్ కెమెరాలు ట్రిపుల్ కెమెరాలకు దారితీశాయి. ట్రిపుల్ కెమెరా సెన్సార్లను క్వాడ్ కెమెరా మాడ్యూల్స్ తో భర్తీ చేశారు. ఫిబ్రవరి 2019 చివరిలో నోకియా ప్రపంచంలోనే మొట్టమొదటి పెంటా లెన్స్ స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది. నోకియా రివ్యూ..బ్యాక్ 5రెర్ కెమెరాలు సెన్సర్లతో వస్తోంది. ఇదంతా చూసినట్లయితే ఫోన్లకు మల్టిపుల్ కెమెరాలు అవసరమా అనే సందేహం కలగడంలో తప్పులేదు. డ్యుయల్ కమెరా ద్వారా చిత్రీకరించుకునే ఫోటోల్లో ఫీల్డ్ డెప్త్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఫోటోలు చాలా క్లారిటీగా ఉంటాయి. 
అదనపు కెమెరా వల్ల కలిగే ప్రయోజనాలు....
అదనపు కెమెరా సెన్సార్లనేవి మెరేలీ జిమ్మికులు కావు. మీకు కావాల్సిన రీతిలో ఫోటో క్వాలిటీని మెరుగుపరుస్తూ ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ కెమెరా సెటప్ తో వచ్చే ఫోన్లలో సెన్సార్ సైజ్, పిక్సెల్ సైజ్, అపెర్చర్లు కీలక పాత్ర పోషిస్తాయి. 
అన్నింటిలో చాలా భిన్నమైంది...
గూగుల్ పిక్సెల్ యొక్క ప్రస్తుత ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 3XL మార్కట్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లలో ఒకటి. ఈ డివైసుకు వెనక భాగంలో మాత్రమే కెమెరా ఉంటుంది. కేవలం ఒక సెన్సర్త్ కంపెనీ మంచి స్థానాన్ని ఎలా సంపాదించింది?దీనికి సమాధానం సాఫ్ట్ వేర్ ఆప్టిమైజేషన్లో ఉంది. ఇక గూగుల్ తన పరిమితిని మించిపోయింది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో బలమైన ఇమేజ్ ప్రాసెసింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు మల్టిపుల్ కెమెరాలు ఉన్న ఇతర స్మార్ట్ ఫోన్లకు సమానంగా ఉంటుంది. 2019 ఏప్రిల్లో హువాయి పి30 ప్రోను విడుదల చేసింది. ఇది మల్టిపుల్ స్మార్ట్ కెమెరా సెన్సార్లతో ఉపయోగించుకోవడానికి బెస్ట్ డివైసు. 
మీరు ఎలాంటి ఫీచర్లున్న దాని కోసం చూస్తున్నారు?
ఇమేజ్ ప్రాసెసింగ్ తోపాటు..మంచి జూమ్ కెపబులిటిస్ తో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఈ రోజుల్లో అవసరం. ఎందుకంటే ఆల్ రౌండ్ డిస్ ప్లే కెమెరా కేవలం సాఫ్ట్ వేర్ ఆప్టిమైజేషన్ నుంచి వచ్చింది కాదు. మీ పర్ఫామెన్స్ ప్రోర్ట్రెయిట్ మోడ్ సెల్యుస్ అయితే వైడ్ అప్చర్ కలిగి స్మార్ట్ ఫోన్ కెమెరాను చాలా మంది ఇష్టపడుతారు. అంతేకాదు కెమెరా వైడ్ ఎపర్చర్ కలిగి ఉండటం వల్ల మంచి షాట్స్ తీయడానికి ఉపయోగపడుతుంది.  
స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ మల్టిపుల్ కెమెరాలతో డివైసులను రోలింగ్ చేస్తాయి. ఇది ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అయితే సాఫ్ట్ వేర్ అభివ్రుద్ది చెందుతూ ఉండగానే...ఒక కెమెరా మరియు మల్టిపుల్ కెమెరాల సెటప్ తో ఉన్న పరికరాలు వస్తున్నాయి. 
 

మల్టిపుల్ కెమెరాలు డ్యుయల్ కెమెరాలు స్మార్ట్‌ఫోన్‌ multiple cameras dual cameras samrtphones