ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ కోసం గూగుల్ పాఠాలు

ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ కేవ‌లం సెర్చ్ ఇంజిన్ మాత్ర‌మే కాదు. అంత‌కుమించి ఎంతో స‌మాజానికి మేలు చేసే సంస్థ కూడా. వివిధ దేశాల్లో నిరుపేద పిల్ల‌ల‌కు విద్య‌ను అందించ‌డానికి ఆర్థిక సాయం చేయ‌డం, వైద్య శిబిరాలు నిర్వ‌హించ‌డం, స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌డం ఇలా ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాల్లో గూగుల్ భాగ‌మైంది. సామాజిక కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌తి ఏడాది గూగుల్ కొంత నిధిని కూడా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఈ సొమ్ము నుంచే ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. తాజాగా గూగుల్ కంపెనీ ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ గురించి దృష్టి సారించింది. ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించే చిన్నారుల‌కు క‌చ్చితంగా దానిపై పూర్తి అవ‌గాహ‌న ఉండాల‌ని, వారు ఆన్‌లైన్‌పై వ‌ర్క్ చేసేట‌ప్పుడు పూర్తి స్పృహ‌తో ప‌ని చేయాల‌ని గూగుల్ భావిస్తోంది. దీనిలో భాగంగానే పాఠ‌శాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నుంది.

ప్రి టీన్స్ ల‌క్ష్యంగా
గూగుల్ ప్ర‌ధానం ప్రి టీనేజ‌ర్ల‌పైనే దృష్టి సారింది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ మోసాల‌కు గుర‌వుతుంది ఈ వ‌య‌సు వారే. అందుకే వారికి ఆన్‌లైన్ గురించి, ఇంట‌ర్నెట్ గురించి పూర్తి అవ‌గాహ‌న ఉండాల‌ని గూగుల్ చెబుతోంది. బి ఇంట‌ర్నెట్ అస‌మ్ పేరుతో గూగుల్ ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఎనిమిది నుంచి 12 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌లకు పాఠాలు చెప్పాల‌ని నిర్ణ‌యించింది. ఇంట‌ర్నెట్‌లో ఎదుర‌య్యే మోసాల నుంచి స్కామ్‌ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి.. వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే విష‌యాల‌పై గూగుల్ పిల్ల‌ల‌ను ఎడ్యుకేట్ చేయ‌నుంది. ఎందుకంటే ప్ర‌స్తుత త‌రం పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్ల‌లో ఇంట‌ర్నెట్‌ను అల‌వోక‌గా వాడేస్తున్నారు. వారికి తెలియ‌కుండానే కొన్ని ప్ర‌మాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌మాదాల్లో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో గూగుల్ బి ఇంట‌ర్నెట్ అస‌మ్ కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశం.

ఇంట‌ర్‌ల్యాండ్ గేమ్‌తో..
పిల్ల‌లకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం గూగుల్ ఒక గేమ్‌ను త‌యారు చేసింది. అదే ఇంట‌ర్‌ల్యాండ్‌. ఆన్‌లైన్ సేఫ్టీ కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఈ వీడియో గేమ్‌లో పిల్ల‌ల‌కు పూస గుచ్చిన‌ట్లు వివ‌రించారు. 8 నుంచి 12 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వీడియో గేమ్ లాంటి వాటి ద్వారా చెబితేనే అర్థం అవుతుంద‌నే ఉద్దేశంతో ఈ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు గూగుల్ తెలిపింది. డే డ్రీమ్ వ‌ర్చువ‌ల్ రియాల్టీ టెక్నాల‌జీని ఉయోగించే వారికి ఈ వీడియో గేమ్ ఉప‌యోగించ‌డం చాలా సుల‌భ‌మ‌ని గూగుల్ చెప్పింది. పాఠ‌శాలల్లో పిల్ల‌ల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని అల‌వాటు చేయాల్సిందిగా గూగుల్ టీచర్ల‌ను కోరింది.

Google Teach School Kids Online Safety Etiquette Danger games children campaign అవ‌గాహ‌న వీడియో గేమ్‌ ఇంట‌ర్‌ల్యాండ్‌ వ‌ర్చువ‌ల్ రియాల్టీ