ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ నిజంగా అంత సేఫ్ అని నమ్మొచ్చా ?

స్మార్ట్‌ఫోన్లో ర‌క్ష‌ణ కోసం ఇప్పుడు చాలా ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా సేఫ్టీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండే యాపిల్ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీని అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. త‌న ఐ ఫోన్ల‌లో యాపిల్ కంపెనీ ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వీటి ద్వారా ఫోన్ చాలా సెక్యూర్‌గా ఉంటుంద‌ని ఆ సంస్థ క్ల‌యిమ్ చేస్తోంది. అప‌రిచితులు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసే అవ‌కాశం అస్స‌లు ఉండ‌ద‌ని చెబుతోంది ఆ సంస్థ‌.  అయితే ఈ ఫేస్ ఐడీ , ట‌చ్ ఐడీ నిజంగా అంత సెక్యూర్‌గా ఉంటాయా?

ఎలా ప‌ని చేస్తాయి...
ఐ ఫోన్లో మ‌నం ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీని సెట్ చేసుకుంటే చాలు. ఫోన్‌ను ఎవ‌రైనా అన్‌లాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే సాధ్యం కాదు. కేవ‌లం బ‌యోమెట్రిక్‌లో ఇచ్చిన థంబ్ సెట్ అయితేనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. లేక‌పోతే మీ కెమెరాకు ఇచ్చిన ఇన్‌పుట్ ఫేస్ మ్యాచ్ అయితేనే ఐఫోన్ ఓపెన్ అవుతుంది. ఈ సెక్యూరిటీ ఫెయిల్ అయ్యే అవ‌కాశాలు నూటికి 100 వంతు  కూడా ఉండ‌వ‌నేది ఆ సంస్థ మాట‌.  ఫేస్ ఐడీ లేదా, ట‌చ్ ఐడీ మ్యాచ్ చేయాలంటే కేవ‌లం ఆ ఫోన్ ఓన‌ర్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌ట‌.

50 వేల మందిలో ఒక‌రికే!
సాధార‌ణంగా ఒక‌రికి వేలి ముద్ర‌లు మ‌రొక‌రికి సెట్ కావు. ఒకేలా ఉండ‌వు. అందువ‌ల్ల బ‌యోమెట్రిక్‌లో ఎంట‌ర్ చేసిన వేలి ముద్ర‌లు చాలా సెక్యూర్‌. అయితే ఎక్క‌డో ఒక చోట మాత్రం కాస్త వేలి ముద్ర‌లు పోలి ఉండే అవ‌కాశాలున్నాయ‌ట అది కూడా 50 వేల మందిలో ఒక‌రికే ఆ అవ‌కాశం ఉంది. అప్పుడు మాత్ర‌మే ఫోన్ ఓపెన్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ట‌. ఇక ఫేస్ ఐడీ విష‌యానికి వ‌స్తే ఇది మ‌రీ సెక్యూర్ అట‌. ఎందుకంటే ల‌క్ష మందిలో ఒక‌రికి మాత్ర‌మే అలా ఫేస్‌ను మ్యాచ్ చేసే అవ‌కాశం ఉంద‌ట‌. ఇక పాస్‌కోడ్ను 10 వేల మందిలో ఒక‌రు మ్యాచ్ చేయ‌చ్చ‌ట‌. అందుకే ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ చాలా సేఫ్ అంటోంది యాపిల్‌.

Secure Face ID Touch ID passcode Attacks యాపిల్ ఫేస్ ఐడీ ట‌చ్ ఐడీ సెక్యూర్‌