ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల రాజ్యం. 5వేల నుంచి మొదలుపెట్టి లక్షా 50వేల రూపాయల వరకు విలువైన ఎన్నో రకాల స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి . అసలు వీటిలో ఏ రేంజ్ ఫోన్ కొనాలి? మనం ఎంత ధర పెట్టి కొంటున్నామో ఎప్పుడన్నా ఆలోచించారా? దీనిమీద టెక్నాలజీ ఎక్స్పర్ట్లు చేస్తున్న ఓ విశ్లేషణ మీ కోసం..
15వేలు చాలు
స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీల మధ్య ఇప్పుడు ప్రైస్వార్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్లు అంటే 60, 70 వేల రూపాయల విలువ చేసే ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇప్పుడు 15వేల రూపాయలకు కాస్త అటూఇటూగా ఉండే మీడియం రేంజ్ స్మార్ట్ఫోన్లలో లభిస్తున్నాయి. షియోమి, రియల్మీలతోపాటు తాజాగా శాంసంగ్ కూడా 14, 15వేల రూపాయల ధరలోనే 48 మెగాపిక్సెల్ కెమెరా, 4వేలకు పైగా ఎంఏహెచ్ ఉన్నబ్యాటరీ, 6 అంగుళాలకు పైగా సైజ్ ఉన్న సూపర్ అమౌల్డ్ డిస్ప్లేలతో కూడిన స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే మనకు ఈ ఫోన్లు చాలు. ఎందుకంటే ఇంతకు మించి ఫీచర్లు మనం స్మార్ట్ఫోన్లలో వాడం.
బ్రాండ్ ఇమేజ్ కోసం కొనొద్దు
వన్ప్లస్ లేదా ఐ ఫోన్ .. ఇలా ప్రీమియం బ్రాండ్ ఫోన్లను చాలా మంది షో కోసమే కొంటుంటారు. వాటి ధర 60, 70 వేలపై మాటే. నిజంగా వాటిని అవసరమై కొంటున్నామా? లేదా బ్రాండ్ చూపించుకోవడానికి కొంటున్నామా ఆలోచించుకోండి. వీటిలో ఉండే కెమెరా వంటి ఫీచర్లన్నీ ఇప్పుడు 20వేల రూపాయల్లోపు ఫోన్లలో కూడా దొరుకుతున్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి నిజంగా ఆ బ్రాండ్ ఫోన్లు వాడాల్సిన అవసరం, స్టేటస్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటే తప్ప అంత ఖరీదు పెట్టి కొనడం అనవసరమన్నది నిపుణుల మాట.
ఎంత కాలం వాడతారో చూసుకోండి
సాధారణంగా ఇప్పుడు స్మార్ట్ఫోన్లు వాడేవారిలో చాలామంది ఏడాదికోసారి ఫోన్ మారుస్తున్నారు. కొంతమంది జాగ్రత్తగా వాడేవారు, తరచూ ఫోన్ మార్చడానికి ఇష్టపడేవారు 2ఏళ్ల వరకు వాడుతున్నారు. ఐ ఫోన్ అయితే యావరేజ్న రెండున్నరేళ్ల వరకు వాడుతున్నట్లు ఓ అంచనా. ఆ తర్వాత దాన్ని అమ్మితే సగం డబ్బులు కూడా రావు కాబట్టి దానికి తగ్గట్లే మీ కొనుగోలు ఉండాలట.
మూడో వంతు మనీయే తిరిగొస్తుంది!
మీరు 15వేలు పెట్టి కొన్న ఫోన్ ఏడాది తర్వాత సెకండ్ హ్యాండ్కు అమ్మితే 5,6 వేలకు మించి రాదు. ఎందుకంటే మీరు కొన్నాక కంపెనీలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లాంటి సైట్లలో వాటిని 40, 50% వరకు డిస్కౌంట్లతో దివాళీ సేల్, దసరా సేల్ అని అమ్మేస్తుంటాయి. కాబట్టి మీ పాత ఫోన్కి 5వేల ధర రావడమే ఎక్కువ. అంటే మీరు కొన్న ఖరీదులో మీకు తిరిగొచ్చేది 30 నుంచి 40 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 60, 70 వేలు లేదా లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొంటే ఈజీగా మీకు 30 నుంచి 50 వేలు లాస్. ఎందుకంటే స్మార్ట్ఫోన్ అనేది విపరీతంగా ధర పడిపోయే వస్తువు.
ఈఎంఐల్లో కొనకండి
ఇక్కడ మీకు ఎక్స్పర్ట్లు చెప్పే ఈజీ సూత్రం ఒకటే. మీరు ఫోన్ను ఒకేసారి డబ్బులు పెట్టి కొనండి. అది 5 వేలో, 10 వేలో, 15 వేలు లేదా 20 వేలు.. అదే మీ రేంజ్ అనుకోండి. మీరు ఈఎంఐల్లో కొంటున్నారంటే అప్పు చేసి కొంటున్నట్లే. కాబట్టి కంపెనీలు నో కాస్ట్ ఈఎంఐ అని వడ్డీ లేకుండా ఇస్తున్నా ఆ ఫోన్ కొనొద్దని నిపుణులు చెబుతున్నారు.
తరచి చూసుకోండి
లక్ష రూపాయలు పెట్టి బైక్ కొంటే కనీసం ఆరేడేళ్లు తిరుగుతాం. తర్వాత కూడా దాన్ని కనీసం 40 నుంచి 50 వేలకు అమ్ముతాం. అదే లక్ష రూపాయల ఫోన్ను ఐదారేళ్లు వాడగలమా? ఒకవేళ వాడామే అనుకో అప్పుడు మీచేతికొచ్చేది ఎంత ఆలోచించండి.. ఆ తర్వాత మీకే అర్ధమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఛాయిస్ మీదే మరి.
à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°² ఖ‌రీదౠసà±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°²â€Œà°•à± à°Žà°‚à°¤ ఖ‌రీదౠపెటà±à°Ÿà±Šà°šà±à°šà±  సà±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à± à°ªà±à°°à±ˆà°¸à± రేంజà±â€Œ how much spend for smart phone purchase