ఒకప్పుడు ఇండియాలో మొబైల్ డేటా చాలా ఖరీదైన వ్యవహారం.. ఒక్కో కేబీకి ఇంతని వసూలు చేసేవి కంపెనీలు. దీంతో ఒక జీబీ డేటా వాడుకుంటే బిల్లు గూబ గుయ్యిమనేది. జియో వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. 400తో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1 జీబీ డేటా చొప్పున దాదాపు మూడు నెలలు ఇస్తోంది జియో. మిగతా కంపెనీలు ఇలాంటివి చాలా ఆఫర్లు తెచ్చాయి. ఇలా చౌకగా జియోతో కొన్నాళ్లపాటు ఉచితంగా అందిన డేటా ఇండియన్స్ను మొబైల్ అడిక్ట్లుగా మారుస్తుందా అంటే అవునంటున్నాయి సర్వే సంస్థలు.
మనమే టాప్
ఇప్సాస్ ( Ipsos) సర్వే ప్రకారం అత్యధికంగా మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగించే 23 దేశాల లిస్ట్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా మూడో ప్లేస్లో ఉంది. అంతేకాదు ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ రాకెట్ స్పీడ్తో పెరుగుతోంది. క్లెయినర్ పెర్కిన్స్ ఇంటర్నెట్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్వైడ్గా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 10% పెరుగుతుంటే ఇండియాలో ఏకంగా 28% పెరుగుతోంది. 2009లో ఇండియాలో 4% మంది ఇంటర్నెట్ వాడేవారు. 2016చివరికి 27% మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇండియాలో 45 కోట్ల మొబైల్ ఇంటర్నెట్ యూజర్లున్నారు. వీళ్లను ఆకట్టుకోవడానికి పెద్ద కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఇండియాలో డేటా స్పీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లోనూ బాగా పనిచేయడానికి ఫేస్బుక్, స్కైప్, లింకెడిన్ లాంటివి లైట్ యాప్స్ను రిలీజ్ చేశాయి.
ఇవీ నష్టాలు
ఇండియాలో రూల్స్ ప్రకారం 18 ఏళ్లు నిండినవారికే సిమ్ కార్డులు అమ్మాలి. కానీ మనదగ్గర టెన్త్, ఇంటర్ పిల్లలు కూడా సెల్ వాడేస్తున్నారు. చిన్న వయసు నుంచే పిల్లలు మొబైల్ గేమ్స్కు అలవాటు పడుతున్నారు. మొబైల్ డేటా చౌకవడంతో మామూలు గేమ్స్ మానేసి అన్లైన్ గేమ్స్ ఆడి అడిక్ట్ అయిపోతున్నారు. బ్లూవేల్ గేమ్ ఆడి ప్రాణాలు తీసుకుంటున్న వారిలో మైనర్లే ఎక్కువ. మరోవైపు ఫేస్బుక్ స్నేహాలు, ప్రేమలు చిన్న వయసులోనే రేప్లు, మర్డర్లకు దారి తీస్తున్నాయి. యూత్ తోపాటు మధ్య వయసువారికీ ఫేస్బుక్, వాట్సాప్ లేందే కాలం గడవని పరిస్థితి వచ్చేస్తోంది. ఇవి అవసరానికో, సరదాగానో కాకుండా వ్యసనంగా మారిన వాళ్లు ఎందరో ఉన్నారు. వీటన్నింటికీ మొబైల్ ఇంటర్నెట్ ఒక్కటే కారణం కాకపోయినా ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి.
Mobile data cheap Data Free Data Mobile internet Users online games చౌక డేటా ఉచిత డేటా మొబైలౠడేటా ఇంట‌రà±à°¨à±†à°Ÿà± యూజ‌రà±à°¸à±â€Œ ఆనà±â€Œà°²à±ˆà°¨à± గేమà±à°¸à±â€Œ Â