శాంసంగ్ తన తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 36,900 రూపాయల ధర ఉన్న ఈ ఫోన్ను
31,900 రూపాయలకే అందించనుంది. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్కార్ట్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్
హెచ్డీ అమౌల్డ్ డిస్ప్లే కలిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచర్లన్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాటరీ బ్యాకప్, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ ఇలా
అన్నింటిలోనూ ఈ ఫోన్ ఫీచర్లన్నీసూపరే. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 4,500 విలువైన వైర్లైస్ ఛార్జర్ ఫ్రీ. శాంసంగ్ స్టోర్లో ఐసీఐసీఐ బ్యాంక్
క్రెడిట్కార్డ్తో కొంటే 2,500 క్యాష్బ్యాక్ కూడా వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఎందుకింత సడెన్గా తగ్గించింది?
గెలాక్సీ సీ 9 ప్రో ఈ సంవత్సరం మొదట్లో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్ బాగున్నా మార్కెట్లో ఈ ఫోన్కు అంత క్రేజ్
రాలేదు. మరోవైపు వన్ప్లస్ 3, వన్ప్లస్ 3టీ మోడల్స్తో ప్రీమియం మిడ్రేంజ్లో మిగిలిన ఫోన్లకు సవాల్ విసురుతోంది. పెర్ఫార్మెన్స్పరంగా
వన్ప్లస్ బెస్ట్ ఛాయిస్ అన్నది దాని యూజర్ల మాట. అంతేకాదు వన్ప్లస్ తన కొత్త స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 5ను ఇండియాలో ఈ నెల 22న లాంచ్
చేయనుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లతో సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోందని టెక్ వర్గాలు రోజుకో న్యూస్ లీక్ చేస్తున్నాయి. వన్ప్లస్
ఇప్పటివరకు తీసుకొచ్చిన ఏ ఫోన్కూ రిలీజ్కు ముందే ఇంత క్రేజ్ రాలేదు. పైగా దాని ధర కూడా 35 వేలకు దగ్గరలో ఉంటుందని అంచనా.
వన్ప్లస్ 5తో అదే ప్రైస్ రేంజ్లో గెలాక్సీ సీ9 కంపీట్ చేయడం కష్టమని, ఆ ఫోన్ రిలీజ్కు ముందే కస్టమర్లను ఎట్రాక్ట్ చేయాలనే శాంసంగ్ ఎలాంటి
ప్రకటన లేకుండా సడెన్గా ధర తగ్గించిందని మార్కెట్ విశ్లేషణ.
గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్లు
* 6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లే
* 16 మెగాపిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా
* 6 జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ .. ఎస్డీ కార్డ్తో 256 జీబీ వరకు ఎక్స్పాండబుల్
* ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 653 ఎస్ఓసీ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Samsung Galaxy C9 Pro 6GB RAM smartphone Rs 5 000 price cut Samsung online store శాంసంగౠగెలాకà±à°¸à±€ సీ9 à°ªà±à°°à±‹ 6జీబీ à°°à±à°¯à°¾à°®à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±â€Œ 5వేల త‌గà±à°—à°¿à°‚à°ªà±