జియో, ఆధార్ ఈ రెండూ భారత్లో ఇప్పుడు ఎక్కువ నానుతున్న పేర్లు. ఆధార్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అయితే.. జియో పూర్తిగా ప్రైవేటు సంస్థ రిలయన్స్ది. అయితే ఈ రెండు డేటాబేస్లు లీక్ కావడం పెద్ద సంచలనమే అయ్యాయి. గతంలో ఆధార్ డేటా లీక్ కాగా. . తాజాగా జియో డేటాబేస్ ఆన్లైన్లో ప్రత్యక్షంగా అయింది. ఈ డేటాలతో సంబంధం ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఈ తాజా లీక్లు ఆందోళన కలిగిస్తున్నాయి. జియో సంగతి పక్కనపెడితే. . అన్నిటి మూలమైన ఆధార్ డేటాబేస్ లీక్ కావడం జనానికి బాగా వర్రీ ఫ్యాక్టర్గా మారింది. ఈ లీక్ల గురించి మనం కొన్ని ప్రశ్నలు వేసుకుని... దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
1.జియో డేటా లీక్ కావడమే కాక మ్యాజిక్ఏపీకే.డామ్ అనే వెబ్సైట్లో ఆ డేటాను పోస్ట్ చేశారు. వారం రోజుల క్రితమే దీన్నిపోస్ట్ చేసినా... గత ఆదివారం మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది. అది కూడా ట్విటర్ ద్వారా. మ్యాజిక్ ఏపీకేలో పెట్టిన జియో సమాచారం వెతకడం చాలా సులభంగా ఉంది. దీనికో సెర్చ్బార్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా నంబర్ టైప్ చేస్తే చాలు వెంటనే ఆ డేటా ప్రత్యక్షం అవుతుంది.
2. లీక్ అయిన జియో డేటాబేస్లో యూజర్లకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, పూర్తి వివరాలు, చిరునామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధార్ వెరిఫికేషన్తోనే జియో నంబర్లు ఇష్యూ చేశారు. ఇది కూడా ఒక ఆందోళన కలింగించే అంశమే. దీని ద్వారా ఆధార్ వివరాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి.
3. లీక్ అయిన సమాచారం మ్యాజిక్ఏపీకే.కామ్లో ఎక్కువ సేపు ఉండలేదు. ఈ వెబ్సైట్ వెంటనే క్లోజ్ అయింది. లేకపోతే దీన్ని హోస్ట్ చేసేవాళ్లు సైట్ను ఆఫ్లైన్లో పెట్టి ఉండొచ్చు. అయితే ఈ డేటాను ఎవరికైనా హాకర్లకు, క్రిమినల్స్కు అమ్మితే ఏంటి పరిస్థితి అనేదే సందేహం. దీన్ని ఎవరికి సందేహం రాకుండా కూడా అమ్మకానికి పెట్టేచ్చు. నా దగ్గర 120 మిలియన్ల మంది యూజర్ల డేటా ఉందని వారు చెప్పొచ్చు. ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ డేటాను కూడా వారు ట్రాక్ చేయచ్చు.
4. డేటా లీక్ కాలేదని, వినియోగదారుల డేటా సేఫ్ అని జియో ప్రకటించింది. డేటా ఎలాగో పొరపాటున వచ్చిందని అంతేకాదని మొత్తం డేటాబేస్ మొత్తం సురక్షితంగా ఉందని రిలయన్స్ చెప్పింది. దీనిని ఈడీ విచారణ జరిపించాలని ఆ సంస్థ కోరింది. డేటా గురించి పుకార్ల గురించి నమ్మద్దని జియో కస్టమర్లను కోరింది.
5. జియో ఆరంభం అయ్యే ముందు మీ డేటా లీక్ అయిందంటే నమ్మే అవకాశాలు ఉంటాయి. అయితే ఎంతో పకడ్బందీగా ఉంటే జియో డేటా ఇన్ని నెలల తర్వాత లీక్ కావడం అంత సులభం కాదు. అయతే మ్యాజిక్ఏపీకే.కామ్లో పెట్టిన డేటా శాంపిల్ మాత్రమేనని ఆ సంస్థ తెలిపింది. అయితే ఆధార్ లీక్ అయినా జియో లీక్ అయినా మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సింది ఈ మెయిల్ గురించే. ఎందుకంటే మన డిజిటల్ లైఫ్ అంతా వాటి మీదే ఆధారపడి ఉంది.
6. జియో డేటా లీక్ అయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే జియో కస్టమర్కేర్కు ఫోన్ చేసి మీ డేటా గురించి వివరాలు అడిగి తెలుసుకోండి. ఈ డేటాను ఎవరైనా వాడే అవకాశం ఉందా అని ఆరా తీయండి. అయితే ఉన్న ప్రమాదం ఏంటంటే ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలు ఆ డేటాలో ఉండడం. ఇప్పుడు వాలెట్లకు ఈ రెండూ కీలకం.
Jio data leak safe is Aadhaar information phone numbers Email Ids డేటాబేసౠఆనà±â€Œà°²à±ˆà°¨à±â€Œ ఆధారౠవెరిఫికేష‌నà±â€Œ à°®à±à°¯à°¾à°œà°¿à°•à±à°à°ªà±€à°•ే.కామà±â€Œ