సుమారు 25 సంవత్సరాలకు పైగా సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఆడియో ఫార్మాట్ అయిన MP3 ఇక మాయం కానుందా? దీని సర్వీస్ లను నిలిపివేయడం ద్వారా ఇది దాదాపు డెడ్ అయిపోతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. MP3 గా పేరుగాంచిన MPEG -1 మరియు MPEG-2 ఆడియో లేయర్ 1989 లో లంచ్ చేయబడింది. అయితే పెరుగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ , ఫ్లాట్ ఫాం షిఫ్తింగ్ లను దృష్టిలో ఉంచుకుని దీనియొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ దీని లైసెన్స్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అసలు ఈ MP3 ఎలా డెడ్ అవుతుంది?
టెక్నికల్ గా చూసుకుంటే ఈ MP3 ఫార్మాట్ లో ఉన్న ఆడియో ఫైల్ లు పనిచేస్తాయి. అయితే వీటికి లైసెన్స్ మొదలైన సపోర్ట్ లు ఏవీ ఉండవు. అంటే MP3 యొక్క క్వాలిటీ తగ్గుతూ వచ్చి కొంతకాలానికి అసలు MP3 అనేదే లేకుండా పోతుంది. ఫ్రాన్ హోపెర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే సంస్థ మోడరన్ MP3 ఫార్మాట్ ను డిజిటల్ ఆడియో ఎం కోడింగ్ కోసం భద్రపరుస్తుంది. ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత MP3 కి అసోసియేట్ గా ఉన్న అన్ని సర్వీస్ లను నిలిపివేస్తూ లైసెన్స్ లను రద్దు చేస్తున్నట్లు ఇది ప్రకటించింది. అంటే యూజర్ లు MP3 ఫార్మాట్ లో పాటలు వినవచ్చు కానీ దీనికి పరిశ్రమ వైపు నుండి ఏ విధమైన సపోర్ట్ ఉండదు. ఆడియో ఫైల్ యొక్క సైజు ను సుమారు 95 శాతం వరకూ తగ్గించి ఇది అద్భుతమైన క్వాలిటీ ని అందిస్తుంది. అదే MP3 యొక్క గొప్పదనం.
మరి MP3 మాయం అయిన తర్వాత ఆడియో ఫైల్ ల భవిష్యత్ ఏమిటి?
అడ్వాన్స్డ్ ఆడియో కోడింగ్ లేదా AAC అనేది MP3 యొక్క వారసునిగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని టీవీ మరియు రేడియో బ్రాడ్ కాస్టింగ్ లోనూ ఈ AAC ని ఉపయోగిస్తున్నారు. ఈ AAC కూడా ఫ్రాన్ హోపెర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే డెవలప్ చేశారు. వారు చెబుతున్న దానిప్రకారం ఇది మరిన్ని ఎక్కువ ఫీచర్ లతో అద్భుతమైన క్వాలిటీ తో కూడిన మ్యూజిక్ ను అందిస్తుంది. ఆన్ లైన్ స్త్రేమింగ్ పోర్టల్ లైన యు ట్యూబ్, ఐ ట్యూన్స్, నోకియా లాంటివి కూడా ఇప్పుడు ఆడియో ఫైల్ లను ఎన్ కోడింగ్ చేసుకోవడానికి AAC నే ఉపయోగిస్తున్నాయి. ఇక MP3 కనుమరుగు అయినట్లే.
MP3 AAC