యాపిల్.. టెక్నాలజీ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. యాపిల్ నుంచి ఒక ప్రొడక్ట్ రిలీజ్ అవుతుందంటే టెక్నాలజీ లవర్స్ అంతా కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. ఐ ఫోన్లు రిలీజ్ అయ్యేటప్పుడు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో తెల్లవారకముందే స్టోర్ల ముందు లైన్లలో నిలబడి మరీ కొంటారు. ఇదంతా ఇప్పటి మాట. కానీ 40 ఏళ్ల క్రితం యాపిల్ ఓ చిన్న కంపెనీ. అప్పుడు తయారుచేసిన యాపిల్ -1 అనే కంప్యూటర్ను వేలం వేస్తే జర్మనీలో ఒకరు 80 లక్షలు పెట్టి కొన్నారు.
స్టీవ్ జాబ్స్ హయాంలో తయారైంది..
నలభై సంవత్సరాల క్రితం యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్జాబ్స్ హయాంలో రూపొందించిన తొలి కంప్యూటర్ ‘యాపిల్-1’ శనివారం జర్మనీలో వేలానికి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ ఇంజనీర్ అప్పట్లో ఈ కంప్యూటర్ను కొన్నారు. కంప్యూటర్నే కాదు వాటిని కొన్న బిల్లలు, రిసీట్లు కూడా చాలా జాగ్రత్తగా దాచారు ఇప్పుడు వేలంలో రూ.80లక్షల 40 వేలు పలికింది. ఇప్పటికీ ఈకంప్యూటర్ చక్కగా పనిచేస్తోంది.
ఇప్పటికీ పనిచేస్తుంది..
40 ఏళ్ల కిందట తయారైన ఈ యాపిల్-1 లోపవర్డ్ పీసీ. దీనిలో ర్యామ్ ఎంతో తెలుసా కేవలం 8 కేబీ. ఇప్పటి స్టాండర్డ్ యాపిల్ పీసీతో కంపేర్ చేస్తే ఇది ఆరు లక్షల రెట్లు తక్కువ. అయితే ఇప్పటికీ ఈ కంప్యూటర్ పని చేస్తుండడం చాలా విశేషం. ప్రపంచంలో ఇప్పటికీ ఎనిమిది యాపిల్ -1 పీసీలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. అయితే ఈ కంప్యూటర్కు వేలంలో ఇంతకంటే ఎక్కువ మొత్తం పలుకుతుందని ఆశించినా అనుకున్నంత స్పందన రాలేదని ఆర్గనైజర్లు అంటున్నారు.
Apple 1 computer rare Apple pc Inr 80 lakhs sold 80 ల‌కà±à°·â€Œà°²à± 40 సంవ‌తà±à°¸â€Œà°°à°¾à°²à± యాపిలౠ1 à°•à°‚à°ªà±à°¯à±‚ట‌రà±â€Œ జ‌రà±à°®â€Œà°¨à±€ వేలం