రెండేళ్ల‌లో ఇండియ‌న్ ఫోన్ మేక‌ర్స్‌పై చైనా కంపెనీల డామినేష‌న్‌కు కార‌ణాలేంటి? 

చైనా ఫోన్లు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను క‌మ్మేశాయి. ఇండియాలో అమ్ముడ‌వుతున్న ఫోన్ల‌లో 50 శాతానికిపైగా చైనీస్‌బ్రాండ్లే. ఒప్పో, వివో, షియోమీ, నూబియా,  లాంటి చైనీస్  ఫోన్ల దెబ్బ‌కు ఇంటెక్స్‌, మైక్రోమ్యాక్స్‌, లావా, కార్బ‌న్ లాంటి ఇండియ‌న్ ఫోన్లు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. రెండేళ్ల క్రితం ఇండియ‌న్ మొబైల్ మార్కెట్లో   మైక్రోమ్యాక్స్‌, కార్బ‌న్‌, లావా వంటి మ‌న లోక‌ల్ కంపెనీల షేర్  54%. అయితే ఈ రెండేళ్ల‌లో ఇందులో 35% బిజినెస్‌ను వాటి నుంచి చైనా ఫోన్లు లాక్కోగ‌లిగాయి. దీనికి కార‌ణాలు చాలానే ఉన్నాయి.  

చైనా ఫోన్ల‌కే ఇండియ‌న్ బ్రాండ్‌
ఇండియాలో ఫీచ‌ర్ ఫోన్ల హ‌వా న‌డుస్తున్న‌ప్పుడు నోకియా, శాంసంగ్ లాంటి ఇంట‌ర్నేష‌నల్ బ్రాండ్‌ల‌దే మేజ‌ర్ షేర్‌. అప్పుడు మైక్రోమ్యాక్స్‌, లావాలాంటి ఇండియ‌న్ కంపెనీలు మార్కెట్లోకి వ‌చ్చాయి. ఇవి త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్‌ఫోన్లు త‌యారు చేసి త‌మ బ్రాండ్ నేమ్ వేసి ఇచ్చేలా చైనా కంపెనీలతో డీల్ చేసుకున్నాయి.  చైనాలో మొబైల్స్ త‌యారీ  కుటీర‌ప‌రిశ్ర‌మ స్థాయి నుంచి పెద్ద పెద్ద కంపెనీల వ‌ర‌కు ఉంటుంది. అందుకే వెంట వెంట‌నే త‌యారై త‌క్కువ ధ‌ర‌కే ఇండియాకు చేరేవి. నోకియా, శాంసంగ్ సంవ‌త్స‌ర‌మంతా రీసెర్చ్ చేసి ఒక కొత్త మోడ‌ల్ తెస్తే మైక్రోమ్యాక్స్‌, లావా లాంటి ఇండియ‌న్ కంపెనీల చైనీస్ కంపెనీల ద్వారా రెండు, మూడు నెల‌ల‌కు ఓ కొత్త మోడ‌ల్ త‌యారు చేయించి మార్కెట్లోకి వ‌దిలేవి. అలా ఫీచ‌ర్ ఫోన్ మార్కెట్‌లో 50 శాతానికి పైగా షేర్ సంపాదించాయి.  త‌ర్వాత స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చేస‌రికి సీన్ మారిపోయింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ల వ‌ర‌కు కూడా ఇండియ‌న్ కంపెనీలు బాగానే న‌డిపించాయి. అయితే త‌ర్వాత రీసెర్చి డెవ‌ల‌ప్‌మెంట్ చేసి కొత్త ఫీచ‌ర్ల‌తో ఫోన్లు తెచ్చేందుకు ఇండియ‌న్ కంపెనీల ద‌గ్గ‌ర ఎక్స్‌ప‌ర్ట్‌లు లేరు. ఎందుకంటే ఇవి చైనా కంపెనీలు త‌యారుచేసి ఇచ్చిన ఫోన్ల‌ను అమ్ముకునే మార్కెట్ వ్యూహాల మీద  త‌ప్ప ఆర్ అండ్‌డీ మీద దృష్టి పెట్ట‌లేదు. 

కొత్త ఫీచ‌ర్ల‌తో కుమ్మేసిన‌ చైనా బ్రాండ్స్ 
ఇదే టైంలో ప్ర‌పంచ మొబైల్ మార్కెట్‌లో అతిపెద్ద హ్యాండ్ అయిన చైనా త‌న‌కున్న అనుభ‌వాన్ని ఉప‌యోగించి ఇండియ‌న్ యూజర్ల‌కు ఏది ఇష్ట‌మో ప‌సిగ‌ట్టింది.  అలా భారీ స్క్రీన్స్‌, పెద్ద మెగాపిక్సెల్ కెమెరాలు, సెల్ఫీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ చేయ‌గ‌ల ఫోన్లు, భారీ బ్యాట‌రీల‌తో ఇండియ‌న్ల మ‌న‌సు దోచాయి. షియోమి, ఒప్పో, వివో, జియోనీ లాంటి ప్రొడ‌క్ట్‌ల స‌క్సెస్‌కు ఇదే కార‌ణం. ఇండియ‌న్ బ్రాండ్స్ ఈ విష‌యంలో ఇంకా వెన‌క‌బ‌డే ఉన్నాయి. 


కాంపిటీష‌న్ పెరుగుతున్నా వెంట‌నే గుర్తించ‌క‌పోవ‌డం
చైనా కంపెనీలు ఇండియ‌న్ మార్కెట్‌లోకి కొత్త ఫీచ‌ర్ల‌తో స్మార్ట్‌ఫోన్లు తెస్తున్నా ఇండియ‌న్ కంపెనీలు పెద్ద థ్రెట్ ఫీల‌వ‌లేదు. అది కూడా ఓకార‌ణం

ప‌బ్లిసిటీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం 
చైనా కంపెనీలు పెద్ద‌గా ప‌బ్లిసిటీ మీద దృష్టిపెట్ట‌కుండా డిజైన్‌పైనే దృష్టి పెట్టి స‌క్సెస‌య్యాయి. షియోమి ఫోన్ల‌కు ఇప్ప‌టికీ పెద్ద‌గా ప‌బ్లిసిటీ ఖ‌ర్చు ఉండ‌దు. ఒప్పో, వివోలాంటివి ప‌బ్లిసిటీ చేస్తున్నాయంటే వాటి ఖ‌రీదు 15, 20 వేల రూపాయ‌లు ఉండ‌డం వ‌ల్ల  ఆ స్థాయ యూజ‌ర్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అంతే త‌ప్ప అన‌వ‌స‌రంగా కాదు. వివో ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్‌కు 500 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. రెండు నెల‌ల‌పాటు యూత్ మొత్తం ఐపీఎల్‌ను క‌ల‌వ‌రిస్తార‌ని తెలుసు కాబ‌ట్టే దీనిమీద అంత పెట్టింది. అలా స్ట్రాట‌జీస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటున్నాయి.   అదిఇండియ‌న్ కంపెనీలు డిజైన్‌, కొత్త ఫీచ‌ర్ల‌కంటే పబ్లిసిటీ మీద మాత్ర‌మే ఖ‌ర్చుపెట్టి మార్కెట్లో వెన‌క‌బ‌డ్డాయి. ప్ర‌చారం ఎంత చేసినా ఫోన్లో విష‌యం ఉండాల‌న్న సూత్రం ఇక్క‌డ ప‌ని చేసింది. 

మార్కెటింగ్ స్ట్రాటజీస్ 
షియోమి, ఒప్పో, వివో మొద‌ట్లో ఆన్‌లైన్ సేల్సే చేసేవి. అయితే ఇండియ‌న్ మార్కెట్‌లో 80% సెల్‌ఫోన్ సేల్స్ ఆఫ్‌లైన్ ద్వారానే జ‌రుగుతున్నాయ‌ని గ్ర‌హించి ఆఫ్‌లైన్లోకి దిగాయి.  షియోమి ఫోన్లు ఇప్పుడు ఇండియాలో 600 రిటైల్ స్టోర్స్‌లో అమ్మ‌డవుతున్నాయి. ఈ ఇయ‌ర్ చివ‌రికి 1500 స్టోర్స్‌లో అమ్ముతామంటున్నారు.  సొంతంగా స్టోర్స్ పెట్టి క్లిక్క‌య్యాయి. అలాగ‌ని ఆన్‌లైన్‌ను కూడా వ‌ద‌ల్లేదు. ఇండియా కంపెనీల‌కు ఆ స్ట్రాట‌జీలు లేవు. ప‌క్క‌వాళ్ల‌ను గుడ్డిగా అనుక‌రిస్తూ బోల్తాప‌డుతున్నాయి.  షియోమి, ఒప్పో, వివోలాంటి డిఫ‌రెంట్ ఫీచ‌ర్ల‌తో ఫోన్లు తెస్తుంటే మైక్రోమ్యాక్స్‌, లావా, కార్బ‌న్ , ఇంటెక్స్ లాంటి ఇండియ‌న్ కంపెనీలు ఇంచుమించుగా ఒకేలాంటి ఫీచ‌ర్ల‌తో ఫోన్లు తేవ‌డం స్ట్రాట‌జీలేక‌పోవ‌డ‌మే. 
డీల‌ర్ల‌కు మార్జిన్లు బాగా ఇవ్వ‌డం
చైనా కంపెనీలు ఒప్పో, వివో డీల‌ర్ల‌కు, అమ్మ‌కందారుల‌కు 30% వ‌ర‌కు మార్జిన్ ఇస్తున్నాయి. ఇండియ‌న్ బ్రాండ్స్ ఇంత ఇవ్వ‌వు. అందుకే అమ్మేవాళ్లు కూడా చైనా ఫోన్లు అమ్మ‌డానికే ఇంట‌రెస్ట్ చూపిస్తున్నారు. 

 

Indian Smartphones China companies oppo Xioami Intex Micromax Lava ఇండియ‌న్ బ్రాండ్స్‌ స్మార్ట్‌ఫోన్లు చైనా కంపెనీలు ఒప్పో వివో షియోమి ఇంటెక్స్‌ మైక్రోమ్యాక్స్‌ లావాÂ