షియోమీ 3ఎస్.. ఆన్‌లైన్లో అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్


చైనీస్ మొబైల్ కంపెనీ షియోమీ మంగ‌ళ‌వారం త‌న కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ షియోమీ (రెడ్‌మీ) 4ను ప్ర‌క‌టించ‌నుంది. దీనికంటే ముందు వ‌చ్చిన షియోమీ 3ఎస్‌, షియోమీ 3ఎస్ ప్రైమ్ ఫోన్లు ఇండియ‌న్ మార్కెట్లో బాగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో రెడ్‌మీ 4పైనా అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

భారీగా 3ఎస్‌, 3 ఎస్ ప్రైమ్ సేల్స్
గ‌త ఏడాది ఆగ‌స్టులో షియోమి త‌న 3ఎస్‌, 3 ఎస్ ప్రైమ్ మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో 3ఎస్ ధ‌ర 6,999 రూపాయ‌లు. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్ తో వ‌చ్చింది. 3 ఎస్ ప్రైమ్ 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌తో వ‌చ్చింది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉన్న 3 ఎస్ ప్రైమ్ ధ‌ర 8,999 రూపాయ‌లు. పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా షియోమీకున్న అనుకూల‌త‌ల‌న్నీ ఉండ‌డంతో ఈ ఫోన్లు బాగా అమ్మ‌డుపోయాయి. ఈరెండు వేరియంట్లు క‌లిసి 40 ల‌క్ష‌ల ఫోన్లు అమ్మిన‌ట్లు రెడ్‌మీ ప్ర‌క‌టించింది.

ఆన్‌లైన్లో బాగా సేల్స్
3ఎస్‌, 3 ఎస్ ప్రైమ్ మోడ‌ల్స్ ఆ ప్రైస్ రేంజ్‌లో మంచి ఆప్ష‌న్ల‌తో ఉండ‌డంతో అంద‌రూ వీటిని కొన‌డానికి ఆస‌క్తి చూపారు. ఆన్‌లైన్ సేల్స్‌లో ఎప్పుడు పెట్టినా ఇవి వెంట‌నే అమ్మ‌డైపోయాయి. గంట‌ల వ్య‌వ‌ధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అని వ‌చ్చేది. ఫిబ్ర‌వ‌రికి 30 ల‌క్ష‌ల ఫోన్లు అమ్మిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ రెండు నెల‌ల కాలంలోనే మ‌రో 10 ల‌క్ష‌ల ఫోన్లు అమ్మ‌డం గ‌మ‌నార్హం. 3ఎస్ ఫోన్లు మొత్తం 40 ల‌క్ష‌లు సేల్ అయ్యాయ‌ని, ఆన్‌లైన్లో అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదేన‌ని షియోమి ప్ర‌కటించింది. ఇదే ఊపు రెడ్‌మీ 4 మోడ‌ల్‌కు కూడా కొన‌సాగుతుంద‌ని కంపెనీ ఆశిస్తోంది.

షియోమీ 3ఎస్ ఆన్‌లైన్ సేల్స్ టాప్‌ షియోమీ 4 Redmi 3s Redmi 3s prime Highest selling smart phone online sales