సరా యాప్.. ఇప్పుడు దీని గురించే విపరీతమైన చర్చ. మంచికంటే చెడు స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందనడానికి ఇదే ఉదాహరణ. మీరు ప్రొఫైల్ను క్రియేట్ చేసుకుంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్ బ్యాక్ పొందడానికి వీలుగా ఈ యాప్ను డిజైన్ చేశారు. మీకు పరిచయస్తులు కాకపోయినా, ఆఖరికి వాళ్లకు సరా అకౌంట్ లేకపోయినా కూడా మంచి ఫీడ్ బ్యాక్ పంపడానికి వీలు కల్పించారు. కానీ ఇవన్నీ మన సమాజంలో ఉన్న చెడ్డ మనస్తత్వాలకు వేదికవుతున్నాయి. శాడిస్టిక్ ఆలోచనలతో అవతలివాళ్లను ట్రాల్ చేయడానికి చాలా మంది సరా యాప్ను ఉపయోగించుకుంటున్నారు. అసభ్యకరమైన మెసేజ్లతో మానసికంగా హింసిస్తున్నారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్తో వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.
తప్పెవరిది?
సరా యాప్ చాలా తక్కువ రోజుల్లోనే ఏకంగా 30 కోట్ల మంది యూజర్లను సంపాదించుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి యూజర్లున్నారు. నిజంగా వీళ్లంతా కన్స్ట్రక్టివ్ ఫీడ్ బ్యాక్ అందుకోగలిగతే వాళ్లందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. యాప్ డెవలప్ చేసిన Zain al-Abidin Tawfiq ఉద్దేశం కూడా అదే. కానీ చాలామంది దీన్ని తమ లోని అక్కసును వెళ్లగక్కడానికి, ఎదుటివాళ్లను కామెంట్స్తో హింసించడానికి దీన్ని వాడుకుంటున్నారు. ఇది యాప్ డెవలపర్ తప్పా? సొసైటీలో ఉన్న మనుషుల తప్పా? అనేది ఆలోచించుకోవాలని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ముసుగు కప్పుకున్నప్పుడే మనుషుల్లో ఉన్న అసలు మనస్తత్వం బయటికి వస్తుందన్నట్లు ఈ యాప్ తో చాలా మంది తమలోని శాడిస్ట్, పర్వర్టెడ్ మెంటాలిటీని బయటపెట్టుకుంటున్నారు.
యాప్కు సాధ్యం కాదు
ఇలా ట్రాల్ చేసేవాళ్లను, బూతు కామెంట్లు రాసేవాళ్లను యాప్ అడ్డుకోలేదు. ఎందుకంటే సరా యాప్కున్న మొత్తం సిబ్బంది ముగ్గురు. వీళ్లు ముగ్గురూ 30 కోట్ల సరా యూజర్ అకౌంట్స్ను మానిటర్ చేయడం అనేది అసాధ్యం. అయితే దీని డెవలపర్ మాత్రం ఈ ఇష్యూపై సీరియస్గా దృష్టి పెట్టామని చెబుతున్నారు. యూజర్లను బ్లాక్ చేసుకునే సౌకర్యం, అసభ్యకరమైన పదాలను అడ్డుకోవడానికి వర్డ్ ఫిల్టర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తామని చెబుతున్నారు. అయితే మోరల్ వాల్యూస్ను పక్కనపెట్టి మనిషిలోని శాడిస్ట్ లక్షణాలు బయటపడుతున్నంతకాలం ఎన్ని మెజర్స్ వస్తే ఏం లాభం?
Sarahah App Negative feedback Troll స‌రా యాపà±â€Œ à°Ÿà±à°°à°¾à°²à±â€Œ నెగిటివౠఫీడౠబà±à°¯à°¾à°•à±â€Œ Â