సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

మ‌హానాడు.. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల‌కోసారి జ‌రుపుకునే పార్టీ పండుగ‌. మూడు రోజులపాటు ఒక ఉత్స‌వంలా నిర్వ‌హిస్తాయి టీడీపీ క్యాడ‌ర్‌. క్యాడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కు అంద‌రూ ఒక‌చోట చేరి పార్టీ ప్రోగ్రెస్ గురించి డిస్క‌స్ చేసుకుంటారు. ఫ్యూచ‌ర్ ప్లానింగ్‌తో ముందుకెళుతుంటారు. ఈసారి వైజాగ్‌లో మ‌హానాడు నిర్వ‌హించారు. సోష‌ల్ మీడియాలో ఈ ప్రోగ్రాం సూప‌ర్‌హిట్ అయింది. కోటి మంది సామాజిక మాధ్యమాల్లో ఈ వేడుకను చూశారని ఆ పార్టీ ప్రెసిడెంట్‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు.
ఫేస్‌బుక్ పేజీకి 29 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్సు
టీడీపీ అఫీషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీకి 29 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్సు ఉన్నారు. దీనిలో మ‌హానాడు లోని ప్ర‌తి ముఖ్య‌మైన అంశాన్ని, సీఎం, మినిస్ట‌ర్స్‌, పార్టీ టాప్ లీడ‌ర్స్ ప్ర‌సంగాల‌ను లైవ్ వీడియోలు పెట్టారు. ఫొటోలు పోస్ట్ చేశారు. వీటికి వేలాది వ్యూస్ వ‌చ్చాయి. ప్ర‌తి పోస్టును క‌నీసం 2వేల‌మందికి పైగా లైక్ చేశారు. వంద‌ల కొద్దీ షేర్ల‌తో పార్టీ క్యాడ‌ర్ వీటిని పంచుకున్నారు. మహానాడు ప్రారంభం సంద‌ర్భంగా ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద చంద్ర‌బాబు, పార్టీ లీడ‌ర్లు నివాళుల‌ర్పించే వీడియో, ఫొటోకు అత్య‌ధిక వ్యూస్ వ‌చ్చాయి. చంద్ర‌బాబు ప్ర‌సంగాన్ని ల‌క్షా 16వేల మంది చూశారు.
వాట్సాప్‌,ట్విట్వ‌ర్ల‌లోనూ సంద‌డి
వాట్సాప్ గ్రూప్‌ల మ‌ధ్య కూడా సంద‌డి ఏర్ప‌డింది. తొలిరోజు తీర్మానాల‌పై మీ అభిప్రాయాలు చెప్పాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఒక నెంబ‌ర్‌కు వాట్సాప్ చేయ‌మ‌ని చెప్పారు. మంచి అభిప్రాయాలు వెల్ల‌డించిన‌వారికి మ‌హానాడు వేదిక‌పై మాట్లాడే అవ‌కాశం క‌ల్పించారు. చంద్ర‌బాబు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మహానాడు ట్వీట్లు చేశారు. లోకేష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లోనూ దీనిపై చాలా ట్వీట్లు చేశారు. వీట‌న్నింటికీ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TDP Mahanadu social network Facebook Twitter WhatsApp సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌ ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ ట్విట్ట‌ర్‌ టీడీపీ మ‌హానాడు