పొగాకు, సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల్లో జరుగుతోంది. స్మోకింగ్,
టుబాకో యూజ్ వల్ల ఆరోగ్యం గుల్లవుతుండడం, క్యాన్సర్ల వంటి వ్యాధులతో ఏటా జనం చనిపోతుండడంతో ప్రభుత్వాలు పొగాకు అమ్మకాలను
నిరోధించడానికి భారీ ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే సినిమాలు, టీవీల్లో కూడా స్మోకింగ్ సీన్స్ వస్తే పొగ తాగడం ఆరోగ్యానికి
హానికరం అంటూ కింద సబ్టైటిల్స్ మాదిరిగా వేయాలని రూల్ పెట్టారు. ఒకప్పుడు మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లలో వచ్చే సిగరెట్ యాడ్లు ఇప్పుడు
ఆగిపోయాయి. సినిమా స్టార్స్ కూడా ఒకప్పుడ సిగరెట్ యాడ్స్ చేసేవారు. ఇప్పుడు వాళ్లూ మానేశారు. ఇలా టుబాకో ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో
ఇంటర్నెట్ బేస్డ్గా టొబాకో బిజినెస్కు ప్రచారం జరుగుతుండడం మారిన ట్రెండ్ను చూపిస్తోంది.
సోషల్ మీడియాలో..
అన్ని సెక్టార్మలో మాదిరిగానే ఈ టొబాకో ప్రొడక్ట్ల ప్రచారంలోనూ టెక్నాలజీ కీలకంగా మారింది. గతంలో మాదిరిగా టీవీలు, పేపర్లలో యాడ్స్
ఇవ్వడం ఇప్పుడు కుదరడం లేదు. దీంతో కంపెనీలు స్ట్రాటజీ మార్చేశాయి. ఇప్పుడంతా ఇంటర్నెట్ బేస్డ్ ప్రచారమే. సోషల్ మీడియా ఎంటరయ్యాక
కంపెనీలకు మరింత వెసులుబాటు వచ్చింది. సోషల్ మీడియాలో, ఈ మెయిల్ మార్కెటింగ్ లోనూ టొబాకో ప్రొడక్ట్స్ ప్రచారం సాగుతోంది. గతంలో
మీరు టొబాకో రిలేటెడ్ టెర్మ్స్ గురించి సెర్చ్ చేసినా, వాటికి సంబంధించిన వెబ్సైట్ల గురించి బ్రౌజ్ చేసినా మీరు మళ్లీసారి సోషల్ నెట్వర్క్ లేదా
రిలేటెడ్ వెబ్సైట్ చూస్తున్నప్పుడు కచ్చితంగా ఒక్కటైనా ఈ తరహా యాడ్ కనిపిస్తుంది.
ఈ -సిగరెట్లు
మామూలు సిగరెట్ల కంటే ఈ- సిగరెట్లు ఆరోగ్యానికి తక్కువ నష్టం కలిగిస్తాయని రీసెర్చ్లు తేల్చాయి. సిగరెట్ మానలేనంతగా బానిసైనవారు ఈ
సిగరెట్లను వాడితే సిగరెట్ తాగిన ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దీనిపై ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. అమెరికా లాంటి కొన్ని
దేశాల్లో సెలబ్రిటీలు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ - సిగరెట్లు అమ్మేవారికి ఇంటర్నెట్ అడ్డా. బోలెడన్ని ఫ్లేవర్లు, ఆరోగ్యకరమన్న
ప్రచారం, రెడీమేడ్గా దొరుకుతుండడం, వందల సంఖ్యలో పెడలర్స్ (అమ్మేవారు) ఉండడంతో ఆన్లైన్లో ఈ -సిగరెట్ బిజినెస్ బాగా పెరుగుతోంది.
Technology Changing World Of Tobacco à°ˆ -సిగ‌రెటà±à°²à± పొగాకౠఉతà±à°ªâ€Œà°¤à±à°¤à±à°²à± సిగ‌రెటà±à°²à± ఇంట‌రà±à°¨à±†à°Ÿà± సోష‌లౠమీడియా