దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా?

సెల్‌ఫోన్ విప్ల‌వంలో భాగంగా వ‌చ్చినవే ఆండ్రాయిడ్ ట్యాబ్‌లెట్స్‌. పెద్ద స్క్రీన్ ఉండి మ‌న‌కు చూసేందుకు సుల‌భంగా ఉండ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌.  అంతేకాదు త‌ర్వాత కాలింగ్ సౌక‌ర్యం కూడా రావ‌డం వ‌ల్ల ట్యాబ్స్ ఒక ద‌శ‌లో ఫ్యాష్య‌న్‌గా మారిపోయింది. దాదాపు అన్ని సెల్‌ఫోన్ కంపెనీలు ట్యాబ్స్ త‌యారీ చేసి వ‌దిలాయి. కానీ స్మార్ట్‌ఫోన్లే పెద్ద స్క్రీన్ల‌తో రావ‌డంతో ట్యాబ్స్‌కు రానురాను క్రేజ్ ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ట్యాబ్స్ కొనేవాళ్లు బాగా త‌గ్గిపోయారు.. అస‌లు ట్యాబ్స్ ఫెయిల్ కావ‌డానికి ఏంటి కార‌ణం?

2010లో యాపిల్ కంపెనీ ఐపాడ్‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత పెద్ద స్క్రీన్‌పై అందరి దృష్టి మ‌ళ్లింది. శాంసంగ్‌, మోట‌రోలా లాంటి కంపెనీలు ట్యాబ్‌పై దృష్టి పెట్టాయి. లెనొవొ లాంటి కంపెనీలు త‌క్కువ ధ‌ర‌కే ట్యాబ్‌ల అమ్మాకాన్ని మొద‌లు పెట్టాయి. అయితే చాలా ట్యాబ్స్‌లో కాలింగ్ స‌దుపాయం లేక‌పోవ‌డం, ఎక్కువ ధ‌ర ఉండ‌డంతో ఆరంభంలో ఎవ‌రూ వీటిని ప‌ట్టించుకోలేదు.  అయితే శాంసంగ్ లాంటి కంపెనీలు పెద్ద స్క్రీన్ల‌తో ఫోన్ల‌ను తీసుకు రావ‌డంతో ట్యాబ్స్‌పై కాస్త ఆస‌క్తి త‌గ్గింది. దీనికి తోడు ట్యాబ్స్‌లో ఉప‌యోగించే ఓఎస్‌పై కూడా కంపెనీలకు స్ప‌ష్ట‌త లేకుండాపోయింది. ఎందుకంటే మంచి ఓఎస్ పెడితే ధ‌ర బాగా పెంచాల్సి వ‌చ్చింది. 

త‌క్కువ ఓఎస్ పెడితే అంత పెద్ద స్క్రీన్‌, డిజైన్‌కు అది సెట్ అయ్యేది కాదు.  హ‌నీ కోంబ్ లాంటి చాలా ఓఎస్‌ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించారు. అయితే రాను రాను ఓఎస్ విష‌యంలోనూ, స్పెసిఫికేష‌న్స్ విష‌యంలోనూ వినియోగ‌దారులు ట్యాబ్ కంటే ఫోన్‌ల‌నే ప్రిఫ‌ర్ చేస్తుండ‌డంతో కంపెనీల‌న్నీ మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాయి. ఫ‌లితం కొత్త ట్యాబ్ రాక బాగా త‌గ్గిపోయింది.  శాంసంగ్ లాంటి కంపెనీలు త‌ప్ప గూగుల్ ఇత‌ర కంపెనీలు ఈ ట్యాబ్‌ల‌ను దాదాపుగా త‌గ్గించేశాయి. ముందు ముందు ఈ ప‌రిస్థితి ఎక్క‌డిదాకా వెళుతుందో చూడాలి.

Reason Android Tablets Failed sumsung apple google