టెక్నాలజీ మన లైఫ్లో విడదీయలేనంత భాగమైపోయింది. అందుకే గ్యాడ్జెట్లు లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అయితే వాటిలో వస్తున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసేందుకు కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంటాయి. యాప్స్, సాఫ్ట్వేర్లకు కూడా అప్డేట్లు ఇప్పుడు సర్వసాధారణం. కానీ కొన్ని మొబైల్ కంపెనీలు నెలలు, సంవత్సరాల తరబడి అప్డేట్ ఇవ్వదు. మరికొన్ని కంపెనీలు రెండు రోజులకోసారి తమ ప్రొడక్ట్లకు అప్డేట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ రెండింటిలో ఏది మంచిది? అసలు రెగ్యులర్ అప్డేట్స్ వల్ల మంచి ఎంత? చెడు ఎంత?
కంపెనీలు ఏమంటాయి?
సాఫ్ట్వేర్లో ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ను క్లియర్ చేయడం, బగ్స్ను ఫిక్స్ చేయడం, కొత్త ఫీచర్లను యాడ్ చేయడం.. ఇవీ ప్రధానంగా సాఫ్ట్వేర్ అప్డేట్ లక్ష్యాలు. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కస్టమర్పై తమకున్న కన్సర్న్ చూపిస్తుందని చాలా కంపెనీలు చెబుతుంటాయి. ఉదాహరణ వన్ ప్లస్. లాస్ట్ ఇయర్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన వన్ప్లస్ మొబైల్ కంపెనీ తన ప్రొడక్ట్స్కు రెగ్యులర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తుంది. కొన్ని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్ లేదా డివైస్ను అమ్ముకున్నాక నెలల తరబడి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వవు. కానీ మేము అలా కాదని వన్ప్లస్ అంటోంది. అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడమంటే ఆఫ్బేక్డ్ కేక్ను కస్టమర్కు అమ్మేసి తర్వాత దాన్ని పూర్తిగా వండడానికి ప్రయత్నించడం లాంటిదని ఓ పెద్ద సెల్ఫోన్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రొడక్ట్ సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయకుండా రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం కస్టమర్కు ఇన్కన్వినియెన్స్ కాదా అని క్వశ్చన్ చేశారు. కానీ మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్లకు రెగ్యులర్ అప్డేట్లు ఇస్తుంటాయి.
కన్స్యూమర్ల అభిప్రాయమేంటి?
వన్ప్లస్ 5 వాడుతున్నా. రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా డేటా వేస్ట్. అప్డేట్ చేస్తే కొన్ని నిముషాలపాటు ఫోన్ పనిచేయదు. నిజంగా చెప్పాలంటే అప్డేట్ కు ముందు, తర్వాత పెద్ద తేడా ఏమీ కనిపించదని ఓ యూజర్ చెప్పారు. మరికొంత మంది కస్టమర్లు తమ ఫోన్ కొని చాలా రోజులయినా ఎప్పుడూ అప్డేటే రాలేదని, సాఫ్ట్వేర్ డెవలప్ చేసిందో లేదో , కొత్తఫీచర్లు యాడ్ చేసిందో లేదో అర్ధం కావడం లేదని అంటున్నారు.
ఫైనల్గా చెప్పాలంటే..
ఏ ప్రొడక్ట్నయినా 100 పర్సెంట్ పక్కాగా తయారుచేయడం సాధ్యం కాని పని. అందుకని ప్రాబ్లమ్స్ను రెక్టిఫై చేస్తూ, కొత్త ఫీచర్లు యాడ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వడం మంచి పనే. కాకపోతే కాస్త మన టైం కొన్ని నిముషాలు వేస్టవుతుంది. కానీ ప్రొడక్ట్ పెర్ఫార్మెన్స్ మెరుగవుతున్నప్పుడు ఇది తప్పదు. నోకియా లూమియా 920 మోడల్లో కెమెరా పెర్ఫార్మెన్స్ ఇలాగే ఇంప్రూవ్ అయింది. ఫ్రీక్వెంట్గా వస్తే రానివ్వండి.. తప్ప మొత్తానికి అప్డేట్స్ ఇవ్వకపోతే అసలు మనకు అమ్మిన ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడేది ఎలా అంటున్నారు ఎక్స్పర్ట్లు.
Software Updates  Smartphones Bug fixing Softwae upgrade à°Žà°•à±à°•à±à°µ సాఫà±à°Ÿà±â€Œà°µà±‡à°°à± à°…à°ªà±à°¡à±‡à°Ÿà±à°¸à±â€Œ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°¸à±â€Œ బ‌గౠఫికà±à°¸à°¿à°‚à°—à±â€Œ సాఫà±à°Ÿà±â€Œà°µà±‡à°°à± à°…à°ªà±â€Œà°—à±à°°à±‡à°¡à±