వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో క్రియేట్ చేసే ఈ ఫీచ‌ర్  ఐఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్ అయింది.  కానీ గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఫీచ‌ర్‌ను తీసుకురాలేక‌పోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లాంటి యాప్‌ల‌ను  యూజ‌ర్లు ఉప‌యోగించుకుంటున్నా అంత ఫీల్ లేదు. 

ప్ర‌య‌త్నాల‌న్నీ ఫెయిల్ 
మెసేజింగే ఫ్యూచ‌ర్‌గా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో  ఈ విష‌యంలో తాను మిస్స‌య్యింది ఏమిటో  గూగుల్ గుర్తించింది.  వెంట‌నే గూగుల్  హేంగ‌వుట్స్‌ను తీసుకొచ్చింది.  అయితే ఈ మొబైల్ యాప్‌లో ఉన్న లోపాలతో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.  త‌ర్వాత Allo,  Duoల‌ను తీసుకొచ్చింది. ఇవీ ఆశించిన స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ ప‌రిస్థితుల్లో సొంత మెసేజింగ్ యాప్ గా.. ఐమెసేజ్‌కు పోటీ ఇవ్వ‌గ‌ల‌ద‌ని గూగుల్ న‌మ్మ‌ద‌గ్గ ఫీచ‌ర్లు ప్ర‌స్తుతం ట్రూకాల‌ర్‌లోనే క‌నిపిస్తున్నాయి.  

ట్రూ కాల‌ర్ ప్ల‌స్‌పాయింట్స్ 
కాల‌ర్ ఐడీ యాప్‌గా గ‌త రెండేళ్లుగా ఆండ్రాయిడ్ యూజ‌ర్లంద‌రికీ బాగా ద‌గ్గ‌రైంది ట్రూకాల‌ర్‌. ఇది మెసేజింగ్ యాప్ కాదు. కానీ అలా మార‌డానికి చాలా ఛాన్సులున్నాయి. ట్రూకాల‌ర్ 8 అప్డేట్‌తో ఈ యాప్ ఫ్లాట్ ఫాంలో చాలా డ్రాస్టిక్ ఛేంజెస్ వ‌చ్చాయి.  ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌లో ఎక్కువ మంది ట్రూకాల‌ర్ వాడుతున్నారు. మీ ఫ్రెండ్స్ కూడా దీనిలో రిజిస్ట‌ర్ అయి ఉంటారు. కాబ‌ట్టి వాళ్లు కూడా ట్రూకాల‌ర్ డేటా బేస్‌లో ఉన్న‌ట్లే. అందువ‌ల్ల మీరు దీన్ని వాడుకోవ‌డం ఈజీ.  
* ఎస్ఎంఎస్‌లు, కాల్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రూకాల‌ర్ హ్యాండిల్ చేస్తుంది. స్పామ్ ఫిల్ట‌ర్స్ దీనికి మ‌రో ప్ల‌స్‌పాయింట్. 
* Google Duo ద్వారా పీర్ టు పీర్ పేమెంట్స్‌, వీడియో కాలింగ్ కూడా చేసుకోవ‌చ్చు.  
* ట్రూ కాల‌ర్‌లో ప‌ర్స‌న‌ల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుక‌వ‌చ్చు. సోష‌ల్ నెట్‌వ‌ర్క్ లింక్స్ యాడ్ చేసుకోవ‌చ్చు. 
* రిసీవ్ చేసుకునే ప‌ర్స‌న్ ట్రూ కాల‌ర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడా లేదా తెలుసుకోవ‌చ్చు.  
* లేటెస్ట్ అప్‌డేట్‌తో వ‌చ్చిన ఫ్లాష్ మెసేజింగ్ ఫీచ‌ర్‌తో చిన్న టెక్స్ట్ బిట్స్‌, ఎమోజీస్‌, లొకేష‌న్ ఇన్ఫోను  క్విక్‌గా పంపొచ్చు.  

వీటి గురించే ఆలోచ‌న 
ఐమెసేజ్ మాదిరిగా డెడికేటెడ్ యాప్‌లా ట్రూకాల‌ర్‌ను తీర్చిదిద్ద‌డానికి ఇన్ని అనుకూల‌తలున్నా ఒక‌వేళ స‌ర్వీస్‌లో ల్యాప్సెస్ వ‌స్తే ఇప్ప‌టికే ఉన్న యూజ‌ర్ల‌లో ట్రూ కాల‌ర్ రిపుటేష‌న్ పోతుంద‌ని గూగుల్ సందేహిస్తోంది. అదీ కాక ట్రూ కాల‌ర్ బేసిక‌ల్‌గా కాల‌ర్ ఐడీ ఫ్లాట్‌ఫాం కాబ‌ట్టి ప్రైవ‌సీ విష‌యంలో కొంత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.  పూర్తి స్థాయి మెసేజింగ్  యాప్‌గా మారాలంటే ఇది కొంత నెగిటివ్ అయ్యే అవ‌కాశం ఉంది.   

True caller Messaging app iMessage ట్రూ కాల‌ర్‌ వాట్సాప్‌ మెసేజింగ్ యాప్స్‌