ఆండ్రాయిడ్ పాత వెర్షన్లకు కూడా మరో మూడేళ్ల వరకు వాట్సాప్ సపోర్టు

ఇదిగో ఆపేస్తున్నాం... అదిగో ఆపేస్తున్నాం అంటూ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ల స్మార్టు ఫోన్ల యూజర్లకు ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చింది. తాజాగా జూన్ 30తో పాత వెర్షన్లకు సపోర్టు ఆపేస్తామని చెప్పింది. కానీ... మళ్లీ మనసు మార్చుకున్నట్లుంది. మరో మూడేళ్ల వరకు అన్ని వెర్షన్లకూ సపోర్టు కొనసాగిస్తామని ప్రకటించింది.
వాట్సాప్ వెబ్ సైట్లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2020 ఫిబ్రవరి 1 వరకు ఆండ్రాయిడ్ 2.3.7 వెర్షన్ , అంతకంటే పాత వెర్షన్లకు కూడా సపోర్టు ఉంటుంది. నిజానికి 2016 డిసెంబరు నాటికే ఆండ్రాయిడ్ 2.1.. 2.2 వెర్షన్లకు వాట్సాప్ ఆగిపోతుందని ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు.
అవి మాత్రం ఆగిపోతాయి..
అయితే... నోకియా సింబియాన్ ఎస్ 60 వెర్షన్లకు మాత్రం ఈ జూన్ 30తో వాట్సాప్ సపోర్టు ఎండ్ అయిపోతుంది. అలాగే, బ్లాక్ బెర్రీ ఓఎస్ కు 2017 డిసెంబరు 31తో ఆగిపోనుంది.
విండోస్ కు కూడా ఈ ఏడాదే లాస్ట్
విండోస్ 8.0 కంటే పాత ప్లాట్ ఫాంలకు 2017 డిసెంబరు 31వరకు టైముంది. నోకియా ఎస్ 40కి 2018 డిసెంబరు 31 వరకు ఉంటుంది.

android whatsapp symbion windows whatsapp support ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు విండోస్ వాట్సాప్ సింబియాన్