4జీ... భారత్‌లో తాజాగా ఊపేస్తున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ ఉంటే కచ్చితంగా 4జీ డేటా వాడాల్సిందే.. అనేంతంగా 4జీ దేశంలో విస్తరిస్తోంది. అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు పోటీపడి మరీ తక్కువ ధరతో 4జీ డేటాను ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. వినియోగదారులు కూడా 4జీ డేటా అనే సరికే చాలా ఉత్సాహపడి మరీ సిమ్‌లు తీసుకుంటున్నారు. కానీ విషయానికి వస్తే 4జీ అంటే అత్యంత వేగంగా ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించేది. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. పేరుకే 4జీ .. వేగంలో మాత్రం చాలా లేజీగా ఉంటోంది. దీనికి కారణం ఏంటి?
వేగం 5.14 ఎంబీపీఎస్ మాత్రమే!
భారత్‌లో 4జీ వేగం ఎవరైనా చెప్పగలరా! ఎవరెన్ని లెక్కలు చెప్పినా అవి తప్పేంతగా నిజాలు ఉన్నాయి. 4జీ స్పీడ్‌ను అందిస్తున్న 75 దేశాల జాబితాలో భారత్ దిగువ నుంచి రెండో స్థానంలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో 4జీ స్పీడ్ వేగం కేవలం 5.14 ఎంబీపీఎస్ మాత్రమే ఉందని వైర్‌లెస్ మాపింగ్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ తన పరిశోధనలో వెల్లడించింది. 4జీ ఎల్‌టీఈ అందుబాటు విషయంలో మాత్రం భారత్ స్థానం ప్రపంచవ్యాప్తంగా 15గా ఉంది. 4జీ సిగ్నల్ వేగం తగ్గడానికి ఎన్నో కారకాలు ఉంటాయని.. భారత్‌కు 4జీ స్పీడ్ నియంత్రణకు ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నాయని ఆ కంపెనీ తెలిపింది.
కారణాలు ఇవేనా..
4జీ ఎల్‌టీఈ కోసం ఎంత స్పెక్ట్రమ్ కేటాయిస్తున్నారనేదే కీలకం. 2016 స్పెక్ట్రమ్ వేలంలో 4జీ ఎల్‌టీఈ కోసం కేవలం 700 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ ఇవ్వడంతో టెలికోస్ బిడ్డింగ్‌ను బాయ్‌కాట్ చేశారు కూడా. అత్యంత ఎక్కువ ధరను కూడా చూపడం కూడా మరో కారణం. భారత్ న్యూ 4జీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుందా లేదా అనేది కీలకం. తాము ఎల్‌టీఈ అడ్వాన్స్‌డ్ వెర్షన్ వాడుతున్నట్లు ఎయిర్‌టెల్ చెబుతోంది. 2300 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇందులో వాస్తవమెంతో అధికారికంగా తెలియదు. భారత్‌లో అస్తవ్యస్తంగా ఉన్న టెలికాం నెట్‌వర్క్స్ వల్ల కూడా 4జీ సేవలకు అంతరాయం కలుగుతుందట.
కాల్‌డ్రాప్స్ ఎక్కువయ్యాయి
ముఖ్యంగా కాల్‌డ్రాప్స్ బాగా ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయంలో జియో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో జియో ఎంటర్ అయిన తర్వాత టెలికాం కంపెనీలు 4జీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ స్థిరంగా సేవలు అందించడంలో విఫలం అవుతున్నాయి. ముఖ్యంగా ఐడియా లాంటి పెద్ద కంపెనీ కూడా 4జీ సేవల్ని అందించడంలో సక్సెస్ కాలేకపోయింది. 4జీ సేవల్ని 15 కన్నా తక్కువ ఎంబీపీఎస్ స్పీడ్‌తో అందిస్తే ఉపయోగం ఏమంటని వినియోగదారుల మాట.
India 4G LTE availability high speeds low spectrum smartphones Jio Airtel Idea à°¸à±à°ªà±†à°•à±à°Ÿà±à°°â€Œà°®à± వేలం à°Žà°²à±â€Œà°Ÿà±€à°ˆ à°…à°¡à±à°µà°¾à°¨à±à°¸à±â€Œà°¡à± 4జీ నియంతà±à°°â€Œà°£â€Œ వైరà±â€Œà°²à±†à°¸à± మాపింగà±