రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్లు కొన‌డంలో మంచి.. చెడు

మ‌నం ఒక్కోసారి కొత్త గాడ్జెట్ల‌ను కొనే ముందు రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్ల‌ను కొని వాటి ప‌నితీరు బాగుంటే మ‌ళ్లీ అదే మోడ‌ల్ కొంటుంటాం. అంటే బ్రాండ్ న్యూ మోడ‌ల్ కాకుండా కొన్ని రోజుల వాడిన గాడ్జెట్‌ను కాస్త మెరుగుప‌రిచి తిరిగి అమ్మే ఔట్ లెట్లు ఉంటాయి. ధ‌ర కూడా త‌క్కువ‌నే ఉండ‌డ‌డంతో వీటికి కూడా గిరాకీ బాగా ఉంటుంది. మ‌నీ సేవ్ చేద్దామ‌నే ఉద్దేశం ఉన్న‌వాళ్లు, కొత్త వ‌స్తువుల‌పై పెద్ద‌గా మోజు లేని వాళ్లు వీటిపై దృష్టి సారిస్తారు. అయితే ఇలాంటి గాడ్జెట్లు కొన‌డం అస‌లు మంచిదేనా! రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్ల వాడ‌కం బాగుంటుందా? 


సెకండ్‌హ్యాండ్ కాదు..
రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్లు అంటే చాలా మందికి ఒక త‌ప్పుడు అభిప్రాయం ఉంటుంది. అవి సెకండ్‌హ్యాండ్ వ‌స్తువుల‌ని. అయితే రీ ఫ‌ర్బిష్డ్‌ అంటే సెకండ్‌హ్యాండ్ వ‌స్తువులు కాదు. అయితే మ‌నం ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇచ్చిన‌ప్ప‌డు క‌స్ట‌మ‌ర్లు కొన్ని ప్రొడెక్ట్స్‌ను వెన‌క్కి పంపించేస్తారు. అంటే ఆ ప్రొడెక్టు వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు.. లేదా ఏమైనా డామేజ్ కావొచ్చు.  షిప్‌మెంట్ సంద‌ర్భంగా ప్రొడెక్ట్స్ మీద చిన్న గీత‌లు ప‌డొచ్చు. ఇలాంటి ప్రొడెక్ట్స్‌నే రీ ఫ‌ర్బిష్డ్‌ ప్రొడెక్ట్స్ అంటారు. వీటిని కంపెనీలు ఒరిజిన‌ల్ రేటు కంటే కాస్త త‌క్కువ రేటుకు అమ్ముతాయి. అలా అని చెప్పి ఇవేమి పాత వ‌స్తువులు కాదు. కొత్త‌వే కాస్త డామేజ్ అయిన‌వని అర్థం.  ఇలాంటి ప్రొడెక్ట్స్‌ను అమ్మ‌డానికి ప్ర‌త్యేకంగా కొన్ని షాప్ లు కూడా  ఉంటాయి.  

25 శాతం త‌క్కువ ధ‌ర‌కు..
రీ ఫ‌ర్బిష్డ్‌ వ‌స్తువుల‌కు ధ‌ర ఎప్పుడూ త‌క్కువ‌గా ఉంటుంది. ఎంత త‌క్కువ అంటే ఒక్కోసారి మ‌నం ఊహించ‌నంత త‌క్కువ ధ‌ర‌కు ఈ ప్రొడెక్టులు దొరికే అవ‌కాశాలు ఉంటాయి. అంటే సాధార‌ణ ధ‌ర కంటే ఇవి 25 శాతం త‌క్కువ ధ‌ర‌కు దొర‌క‌డం వీటి ప్ర‌త్యేక‌త‌.  మీరు అదృష్ట‌వంతులైతే అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు కూడా దొర‌కొచ్చు.  చాలామంది తాము కొనే వ‌స్తువులు త‌మ క‌నీస అవ‌స‌రాలు తీర్చితే చాలు అనుకుంటారు. అంటే మెయిల్స్ చెక్ చేసుకోవడం, పంపుకోవ‌డం, రీడింగ్ రిపోర్ట్స్‌, ఫేస్‌బుక్ బ్రౌజింగ్ లాంటివి ఉంటే చాల‌ని భావిస్తారు.  ఇలా రాజీ ప‌డే వారికి రీ ఫ‌ర్బిష్డ్‌ గూడ్స్ బెస్ట్ ఆప్ష‌న్‌. అయితే వీటికి గ్యారెంటీ లేక‌పోయినా వారెంటీ ఉంటుంది. అంటే ఏమైనా రిపేర్లు వ‌చ్చినా కంపెనీకి కాంటాక్ట్ చేసి చేయించుకోవ‌చ్చు.

రీ ఫ‌ర్బిష్డ్‌ గూడ్స్ కొనేముందు ఏం చూడాలంటే..
రిటర్న్ పాల‌సీ గురించి ఒక‌సారి తెలుసుకోవాలి. మాన్యువ‌ల్ స‌రిగా చ‌ద‌వాలి. లాప్‌టాప్‌, కెమెరా లాంటి ఖ‌రీదైన వ‌స్తువులు కొనేముందు ప్రొటెక్ష‌న్ పాల‌సీ గురించి ఆరా తీయాలి. సుదీర్ఘ కాలం వారెంటీ ఉన్న గూడ్స్‌ను ఎంచుకోవాలి. అమెజాన్‌, బెస్ట్‌బై, యాపిల్ లాంటి న‌మ్మ‌క‌మైన కంపెనీల‌ను ఎంచుకోవ‌డం ఉత్త‌మం. ఒక ప్రొడెక్ట్ కొనే ముందు దాని గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుని రంగంలోకి దిగాలి.

buying refurbished technology second-hand return online రిటర్న్ పాల‌సీ రీఫ‌బ్రిష్డ్ ప్రొటెక్ష‌న్ త‌క్కువ ధ‌ర‌