ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్ ప‌ట్టుబ‌డుతోంది.
10.52 ల‌క్ష‌ల బోగ‌స్ పాన్ కార్డులు
ఇండియాలో దాదాపు 10.52లక్షల బోగ‌స్ పాన్‌కార్డులున్నాయని గ‌వ‌ర్న‌మెంట్ చెబుతోంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 11 ల‌క్ష‌ల 35 వేల పాన్‌కార్డ్‌ల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. అందులో దాదాపు ప‌దిన్న‌ర ల‌క్ష‌ల పాన్‌కార్డ్‌లు ప‌ర్స‌న‌ల్‌వే. ఈ బోగ‌స్ కార్డుల‌ను అడ్డుకోవ‌డానికే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ పాన్‌కార్డుకు ఆధార్‌కార్డు లింక‌ప్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని 139ఏఏ అనే యాక్ట్ ను తీసుకొచ్చింది. దీనిపై కొంత‌మంది కోర్టుకు వెళ్ల‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ బోగ‌స్ కార్డుల లెక్క బ‌య‌ట‌పెట్టింది. అయితే 10.52లక్షల న‌కిలీ పాన్‌కార్డ్‌లు ఉన్న‌ప్ప‌టికీ అవి మొత్తం పాన్‌కార్డుల సంఖ్యలో 0.4% మాత్ర‌మేన‌ని పిటిష‌న‌ర్లు వాదించారు. అందువ‌ల్ల ఆధార్‌, పాన్‌కార్డ్ లింకేజి త‌ప్ప‌నిస‌రి కాద‌న్నారు. ఇన్ని ల‌క్ష‌ల బోగ‌స్ కార్డులు ఉన్నా త‌క్కువ‌ కాద‌న‌డం స‌రికాద‌ని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. బోగ‌స్ కంపెనీల‌కు చేరిపోతోంది
ఇలాంటి బోగ‌స్ పాన్‌కార్డుల ద్వారా నిజంగా లేని బోగ‌స్ కంపెనీల‌కు మ‌నీ ట్రాన్సాక్ట్ అయిపోతుంద‌ని, బ్లాక్‌మ‌నీ పెరిగిపోవ‌డానికి ఇది కూడా కార‌ణ‌మేన‌ని గ‌వ‌ర్న‌మెంట్ త‌ర‌పున అటార్నీ జ‌న‌ర‌ల్ సుప్రీం కోర్టులో చెప్పారు. సూట్‌కేస్ కంపెనీల‌ను అడ్డుకుని బ్లాక్‌మ‌నీని కంట్రోల్ చేయాలంటే ఆధార్‌, పాన్ లింక‌ప్ త‌ప్ప‌నిస‌ర‌న్నారు.

Pan card aadhar linkage Bogus pan cards Black money పాన్‌కార్డ్‌ ఆధార్‌ అనుసంధానం బోగ‌స్ పాన్‌కార్డ్‌లు బ్లాక్‌మ‌నీ