స్మార్ట్‌వాచ్‌లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయ్‌!

స్మార్ట్‌వాచ్‌లు... ఆధునికి ప్ర‌పంచంలోకి వేగంగా దూసుకొచ్చిన టెక్నాల‌జీ ఇది. ఒక‌ప్పుడు వాచ్ అంటే వాచ్ మాత్ర‌మే. ఇప్పుడు వాచ్ అంటే దానితో ఎన్నో ప‌నులు చేసుకోవ‌చ్చు. మ‌న స‌మ‌యాన్ని ఆదా చేసుకోవడ‌మే కాక‌.. మ‌న బుర్ర‌కు మ‌రీ ఎక్కువ ప‌ని చెప్ప‌కుండా స్మార్ట్‌వాచ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రిమైండ‌ర్లు సెట్ చేసుకోవడం ద‌గ్గ‌ర నుంచి మ‌న  ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డ‌డం వ‌ర‌కు స్మార్ట్‌వాచ్‌లు జ‌నాల‌కు బాగా న‌చ్చాయి. అయితే స్మార్ట్‌ఫోన్లలా వీటిని యూజ‌ర్లు ఎందుకు ఎక్కువ‌గా కొన‌ట్లేదు. యూరోపియ‌న్ మార్కెట్లో త‌ప్ప స్మార్ట్‌వాచ్‌లు ఎందుకు విస్త‌రించ‌ట్లేదు? స‌్మార్ట్‌వాచ్‌లు ఫెయిల్ అయ్యాయా?

అన్ని కంపెనీలు ప‌డ్డాయి..
స్మార్ట్‌ఫోన్ల హ‌వా మొద‌లైన కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత స్మార్ట్‌వాచ్‌ల జోరు కూడా ప్రారంభం అయింది. యాపిల్‌, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు ఈ స్మార్ట్‌వాచ్‌ల మీద దృష్టి సారించాయి. భారీ ఎత్తున ఈ వాచ్‌ల‌ను ఉత్ప‌త్తి చేసి మార్కెట్లోకి వ‌దిలాయి కూడా. భార‌త్‌లోనూ ఈ స్మార్ట్‌వాచ్‌ల అమ్మ‌కం ఏమాత్రం త‌క్కువ‌గా లేదు.  స్మార్ట్‌ఫోన్ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డానికి, ఫిట్‌నెస్ కంపానియ‌న్స్‌గా ఉండ‌డ‌టానికి స్మార్ట్‌వాచ్‌లు బాగా ప‌ని చేశాయి. ఫోన్ కాల్స్ టాప్ చేయ‌డానికి, అలారం, ఈమెయిల్‌, వీడియోలు, ఫొటోలు పంపడానికి ఒక సాధ‌నంలా ఉప‌యోగ‌ప‌డింది. అయితే ఇదంతా ఎర్లీ స‌క్సెస్ మాత్ర‌మే. ఇప్పుడు వ‌స్తున్న ఫోన్లే ఈ ప‌నుల‌న్నీ చేసేస్తుంటే ఇక స్మార్ట్‌వాచ్‌లు ఎవ‌రి కోసం అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉద‌యిస్తోంది. దీంతో వీటిని కొనేందుకు కూడా ఎవ‌రూ ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ట్లేదు. కొంత‌మంది వాచ్‌ల‌ను కొన్నా వాటిని వాడ‌కుండా ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ట‌.

ధ‌ర కూడా కార‌ణ‌మా!
స్మార్ట్ వాచ్‌ల ధ‌ర స్మార్ట్ ఫోన్ల‌కు ఏ మాత్రం త‌క్కువ కాదు. దీంతో ఎక్కువ‌మంది వినియోగ‌దారులు స్మార్ట్‌ఫోన్‌నే స్మార్ట్‌వాచ్‌లా కూడా వాడుకుంటున్నారు. రిమైండ‌ర్ల‌తో పాటు అలారం, టైమ్ ఇలా అన్ని ఫోన్‌లోనే ఉండ‌డంతో ఎక్కువ‌శాతం మంది స్మార్ట్‌వాచ్‌ల జోలికి రావ‌ట్లేదు. ఇదే గ‌త కొంత‌కాలంగా స్మార్ట్‌వాచ్‌ల అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూపిస్తోంది. అమెరికా, బ్రిట‌న్ లాంటి దేశాల్లో ఫ‌ర్వాలేదు కానీ ఆసియా ఇత‌ర ప్రాంతాల్లో స్మార్ట్ వాచ్‌ల అమ్మ‌కం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. దీంతో కొత్త‌గా ఏమైనా ఫీచ‌ర్లు తీసుకొస్తే త‌ప్ప వీటి అమ్మ‌కాల‌ను పెంచ‌డం అంత తేలిక కాద‌నే విష‌యం యాపిల్‌, శాంసంగ్ లాంటి బ‌డా కంపెనీల‌కు అర్థ‌మైపోయింది.  ఎంట‌ర్‌ప్రైజ్ ప్రొడెక్ట్‌లా కాకుండా కంజ్యుమ‌ర్ బేస్డ్‌గా వ‌చ్చిన‌ప్పుడే స్మార్ట్‌వాచ్‌ల ప‌రిస్థితి మారుతుంద‌నేది నిపుణుల అభిప్రాయం.

smartwatches failed Apple Sumsung notifications calls alarms email రిమైండ‌ర్లు స్మార్ట్‌వాచ్‌లు టెక్నాల‌జీ ఫెయిల్ ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌