ఆ ఓఎస్ ల‌కు వాట్సాప్ మ‌రో 25 రోజులే ప‌నిచేస్తుంది..

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, విండోస్‌, బ్లాక్ బెర్రీ అన్నిట్లోనూ లేటెస్టు ఓఎస్ లు వ‌చ్చేశాయి. పాత ఓఎస్ లు వాడుతున్న‌వారిని వేళ్ల‌మీద లెక్కించొచ్చేమే. ఆండ్రాయిడ్ విష‌యానికొస్తే కిట్ క్యాట్ కంటే పాత వెర్ష‌న్లు దాదాపు క‌నుమ‌ర‌గైపోయాయి. అందుకే వాట్సాప్ కూడా ఇప్పుడు అలాంటి పాత ఓఎస్ ల‌కు స‌పోర్టు ఆపేయ‌బోతోంది. జూన్ 30 నుంచి కొన్ని పాత ఓఎస్ వెర్ష‌న్ల‌కు వాట్సాప్ ప‌నిచేయ‌డం మానేస్తుంది.
నిజానికి పాత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌కు స‌పోర్ట్ నిలిపివేస్తున్న‌ట్లు వాట్సాప్ గ‌తంలోనే ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లో యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేకత రావ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వాట్సాప్ అప్ప‌టికి వాయిదా వేసింది. కానీ... జూన్ 30 త‌రువాత అదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని వాట్సాప్ అనుకుంటోంది.
స‌పోర్టు ఆపేయ‌నున్న ఓఎస్ లు ఇవే..
బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా)
నోకియా ఎస్‌40, నోకియా సింబియన్‌ ఎస్‌60
ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2
విండోస్‌ ఫోన్‌ 7.1
ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్ 6 ఫోన్లు
ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉన్న ఫోన్ల‌లో జూన్ 30 త‌రువాత వాట్సాప్ ప‌నిచేయ‌దు. మిగ‌తావారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

Your WhatsApp could stop working from June 30 android 2.1 android 2.2 windows