ఆండ్రాయిడ్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O)' డెవలపర్ వెర్షన్‌ను గూగుల్ ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇంతవరకు దీనికి స్పెసిఫిక్ గా ఏ పేరూ పెట్టలేదు. కానీ.. దీనికి సంబంధించి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నిటిలోనూ ఓట్ మీల్ కుకీ (Oatmeal Cookie) అనేది బాగా వినిపిస్తోంది. కానీ గూగుల్ మాత్రం ఓరియో (Oreo)అని పెట్టాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓరియో వైపే మొగ్గు
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఓ లో 3వ డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ (O) పూర్తి స్థాయి వెర్షన్ విడుదల కానుండగా దీనికి ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్ నంబర్‌ను గూగుల్ కేటాయించింది. ఆండ్రాయిడ్ ఓ (O) పేరును 'ఓట్‌మీల్ కుకీ లేదా 'ఓరియో' అని పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండింటిలో ఓరియో పేరు పట్లే గూగుల్ మొగ్గు చూపుతున్నట్టు సిలికాన్ వ్యాలీలో వినిపిస్తోంది.
కమర్షియల్ పర్పజ్
గతంలో వచ్చిన ఆండ్రాయిడ్ 4.4 వెర్షన్‌కు కిట్‌క్యాట్ అని ఓ చాక్లెట్ కంపెనీ పేరు పెట్టారు. దీంతో గూగుల్‌కు ఆ కంపెనీ తరఫు నుంచి ప్రమోషన్ కింద లాభం కూడా కలిగింది. దీంతో ఇప్పుడు ఓరియో పేరిట బిస్కెట్ పేరును ఆండ్రాయిడ్ ఓ (O)కు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
android o oreo oatmeal cookie ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± à°“ ఓరియో ఓటౠమీలౠకà±à°•à±€ డెవలపరౠవెరà±à°·à°¨à±