ఆండ్రాయిడ్ కప్ కేక్ 1.5 మొదలుకొని తాజాగా నూగట్ 7.0 వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ లో అనేక వెర్షన్ లు వచ్చాయి. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ (O) ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విడుదల కానుంది. కొత్త వెర్షన్ వస్తుంటే పాత వెర్షన్లు వెనుకబడిపోతూ వచ్చాయి. అయినా... ఇప్పటికీ కొన్ని డివైస్ లలో పాత వెర్షన్లు ఉన్నాయి. అవి ఇంకా వాడుకలోనే ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో అంతకు ముందు ఆండ్రాయిడ్ మార్కెట్ అని ఉండేది. దాన్ని 2012లో గూగుల్ ప్లేగా మార్చారు. అయితే ఇప్పటికీ పాత ఆండ్రాయిడ్ ఓఎస్‌లలో గూగుల్ ప్లే యాప్ ఆండ్రాయిడ్ మార్కెట్‌గానే ఉంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ 2.1 (ఎక్లెయిర్) అంతకు ముందు ఓఎస్ వెర్షన్లలో ఉన్న ఆండ్రాయిడ్ మార్కెట్‌కు ఇకపై సపోర్ట్‌ను గూగుల్ నిలిపివేయనుంది. దీంతో ఈ నెల 30వ తేదీ నుంచి సదరు ఓఎస్‌లలో యూజర్లు ఆండ్రాయిడ్ మార్కెట్‌ను వాడుకోవడం కుదరదు.
నిజానికి పాత ఆండ్రాయిడ్ వెర్షన్లు ఉన్న ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో అసలు ఆ పాత ఓఎస్‌లకు సపోర్ట్ చేసే యాప్‌లను కూడా డెవలపర్లు విడుదల చేయడం లేదని, అందుకే ఆండ్రాయిడ్ 2.1 (ఎక్లెయిర్) అంతకు ముందు వెర్షన్లలో ఉన్న ఆండ్రాయిడ్ మార్కెట్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నామని గూగుల్ ప్రకటించింది. దీంతో ఈ నెల 30వ తేదీ నుంచి సదరు ఓఎస్‌లు ఉన్న డివైస్‌లలో యూజర్లు ఆండ్రాయిడ్ మార్కెట్‌ను వాడుకోలేరని గూగుల్ తెలిపింది. సో... ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు ఉన్నవారు ఇక వాటిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.
android android market nougat kitkat eclairs cup cake ice cream sandwich ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± మారà±à°•ెటౠఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± ఓఎసౠకపౠకేకౠనౌగటౠఎకà±à°²à°¯à°¿à°°à±à°¸