కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలన్న ఆలోచన ఒకసారి బుర్రలో మొదలైతే ఆగడం కష్టమే కానీ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒక నెల రోజులు ఆగడం బెటరని అంటున్నారు టెక్ నిపుణులు. జూన్ చివరి వరకు ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయని చెప్తున్నారు. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లతోపాటు రిటెయిల్ మార్కెట్‌లోనూ వ్యాపారులు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఫోన్లను అమ్ముతున్నారు. అయితే ఆ ఆఫర్లు, రాయితీలు జూన్ చివరి వరకు మరింత పెరగొచ్చని తెలుస్తోంది.
కారణమేంటి..?
జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ బిల్లును అమలు చేయనుంది. ఈ క్రమంలో జూలై 1 నుంచి మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అందుకు కారణం వాటి విడి భాగాలపై పన్నును పెంచడమే. దీంతో ఫోన్ తయారీ ఖర్చు పెరిగి తద్వారా ఫోన్ల ధరలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలు అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వ్యాపారులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను ఇప్పటికే క్లియర్ చేసుకునే పనిలో పడినట్టు తెలిసింది. అందుకనే వారు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తున్నట్టు వ్యాపారవర్గాల నుంచి తెలుస్తోంది.
మరిన్ని ఆఫర్లు
గత రెండు నెలలుగా ఫోన్ల షిప్‌మెంట్లలో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో విక్రయదారులు ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలో పడినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకనే వారు ప్రస్తుతం ఆఫర్లను ప్రకటిస్తున్నారు. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలులోకి రానున్నందున జూన్ చివరి వారంలో వ్యాపారులు మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. దీంతో ఆ ఒక్క వారంలోనే పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించవచ్చని తెలుస్తున్నది. కాబట్టి అంతవరకు వెయిట్ చేయడం బెటర్
gst goods services tax smart phone offer price drop à°ªà±à°°à±ˆà°¸à± à°¡à±à°°à°¾à°ªà± à°§à°°à°² తగà±à°—à±à°¦à°² ఆఫరà±à°²à± జీఎసà±à°Ÿà±€