భార‌త్ లో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేస్తున్న‌ యాప్స్ ఏవో తెలుసా?

ప్ర‌తి ప‌నికీ ఒక యాప్‌... స్మార్టు ఫోన్ల‌లో మ‌నం లోడ్ చేసే యాప్ లు అన్నీఇన్నీ కావు. అవ‌స‌రాల కోసం, ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం, ఇంకా ర‌క‌ర‌కాల ప‌నుల కోసం ఎన్నో యాప్స్ వాడుతుంటాం. అయితే, అత్య‌ధికులు వాడే యాప్ ఏంటో తెలుసా... వాట్స్ యాప్‌. అవును.. ఇండియాలో అత్యంత అధికంగా డౌన్ లోడ్ అవుతున్న‌ది ఇదే. మేరీ మీక‌ర్స్ ఇంట‌ర్నెట్ ట్రెండ్స్ రిపోర్ట్ 2017 ప్రకారం ఇండియాలో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకుంటున్న టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ లో వాట్స్ యాప్ టాప్ లో ఉంది. ఈ లిస్టులో టాప్ టెన్ లో ఏమున్నాయో చూద్దాం.
కాగా ఈ టాప్ టెన్ జాబితాలో నాలుగు యాప్ లు ఫేస్ బుక్ కు చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. అందులోనూ మూడు టాప్ 5లో ఉన్నాయి.
1. WhatsApp ఫేస్ బుక్ కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్స‌ప్. ఇండియాలో ఎక్కువ‌గా డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ లో ఇది ఫ‌స్ట్ ప్లేస్ను ద‌క్కించుకుంది. ఇండియాలో 20 కోట్లు మంది యాక్టివ్ వాట్స్ యాప్ యూజ‌ర్స్ ఉన్నార‌ట‌. అంతేకాదు, వాట్స‌ప్ ను వీడియో కాలింగ్ కోసం ఎక్కువ‌గా యూజ్ చేసుకున్నే దేశాల్లో ఇండియా మొద‌టి స్థానంలో ఉంద‌ట‌.
2. Facebook Messenger ఫేస్ బుక్ కంపెనీకే చెందిన ఫేస్ బుక్ మెసెంజ‌ర్ యాప్ రెండో ప్లేస్ లో ఉంది. రీసెంట్ గా ఈ యాప్ లో గేమ్ ప్లేయింగ్ ఫీచ‌ర్స్ ను కూడా త‌న యూజ‌ర్స్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. దీనికి మ‌రింత‌గా ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో మరికొన్నాళ్ల పాటు రెండో స్థానం ఖాయ‌మంటున్నారు.
3. SHAREit చైనా కు చెందిన షేర్ ఇట్ యాప్ మూడో స్థానాన్ని ఆక్ర‌మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా షేర్ ఇట్ యాప్ కు 100 కోట్ల మంది కంటే ఎక్కువ రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్స్ ఉన్నారు. ప్ర‌తి నెల దాదాపు 40 కోట్ల‌ యాక్టివ్ యూజ‌ర్స్ ఉంటున్నారు. 4. Truecaller ఈ మూడింటి త‌రువాత స్వీడ‌న్ కు చెందిన డ‌య‌ల‌ర్ యాప్ ట్రూకాల‌ర్ ఉంది. ఈ యాప్ లో రీసెంట్ గా ఎస్ఎంఎస్, ఫ్లాష్ మెసేజింగ్ ఫీచ‌ర్ ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో దీనికి మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతోంది.
5. Facebook ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 సోష‌ల్ నెట్ వ‌ర్క్ ఫేస్ బుక్ ఐదో స్థానాన్ని ఆక్ర‌మించింది. ఏప్రిల్ 2017 వ‌ర‌కు ఫేస్ బుక్ కు ఇండియాలో 213 మిలియ‌న్ యూజ‌ర్స్ ఉన్నార‌ట‌.
6. UC Browser చైనా కు చెందిన యాప్ యూసీ బ్రౌజ‌ర్ ఆరో స్థానాన్ని ఆక్ర‌మించింది. చైనా ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా నుంచి వ‌చ్చిందే ఈ యాప్.
7. MX Player కొరియా కు చెందిన వీడియో ప్లేయ‌ర్ యాప్ ఎంఎక్స్ ప్లేయ‌ర్ ఏడో స్థానాన్ని ఆక్ర‌మించింది.
8. Hotstar స్టార్ ఇండియా కంపెనీ కి చెందిన హాట్ స్టార్ యాప్ ఎనిమిదో స్థానాన్ని ఆక్ర‌మించింది. దాదాపు 50000 గంట‌ల బుల్లి తెర వీడియోలు ఈ యాప్ లో ఉంటాయి. దాదాపు 8 భాష‌ల‌కు చెందిన చానెల్స్ ప్రోగ్రామ్స్ ను ఈ యాప్ ద్వారా చూడొచ్చు.
9. JioTV రిల‌యెన్స్ జియో నుంచి వ‌చ్చిన యాప్ జియో టీవీ. ఈ యాప్ లో దాదాపు అన్ని భాష‌ల‌కు చెందిన 454 చానెల్స్ ను చూడొచ్చు.
10. Facebook Lite ఇక ఫేస్ బుక్ లైట్ యాప్ ప‌దో స్థానాన్ని ఆక్ర‌మించింది. త‌క్కువ స్పీడ్ ఉన్న ఇంట‌ర్నెట్ వాడేవాళ్లు ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవ‌చ్చు.

top 10 android apps in india whatsapp facebook messanger facebook facebook lite jio tv hotstar shareit truecaller mx plyer