ఇప్పుడే బీటెక్‌లో చేరిన విద్యార్థులకు నాలుగేళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఆ మార్పులకు తగినట్టు విద్యార్థులు ఏవిధమైన అంశాలపై ఫోకస్ పెట్టాలి? అనే అంశాలను సమగ్రంగా వివరిస్తున్నాం కదా! మొదటి మరియు రెండో సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన సమాచారం రెండో భాగంలో ఇచ్చాం. ఇప్పుడు మూడు మరియు నాలుగో సంవత్సరాల్లో ఎలాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలి, ఇంటర్వ్యూల్లో విజయం సాధించి నేరుగా ఉద్యోగం సాధించేందుకు విద్యార్థులు ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3వ ఇయర్: క్లౌడ్ వేవ్ & ఏఐ ఇంటిగ్రేషన్
మొదటి, రెండు సంవత్సరాల్లో కోడింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, డేటా స్ట్రక్చర్లు వంటి కోర్ సబ్జెక్టులపై పట్టు సాధించిన తర్వాత.. ఇప్పుడు మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇదే సరైన సమయం. విద్యార్థి దశ నుంచి ఉద్యోగులుగా మారేందుకు అవసరమయ్యే స్కిల్స్‌కు మెరుగుదిద్దేంకు తొలి అడుగు పడేది ఇక్కడే.
క్లౌడ్ కంప్యూటింగ్ (AWS / Azure / GCP)
- ఎందుకు ఉపయోగపడుతుంది: 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి సాఫ్ట్‌వేర్ మరియు అప్లికేషన్ క్లౌడ్ పైనే రన్ అవుతుంది. AWS Certified Solutions Architect లేదా Google Cloud Associate వంటి సర్టిఫికేషన్ కోర్సులు చేయడం వల్ల సర్వర్లను ఎలా మేనేజ్ చేయాలో ప్రాక్టికల్ అవగాహన వస్తుంది.
- ప్రామాణిక పుస్తకం (Standard Book): AWS Certified Solutions Architect Official Study Guide – Joe Baron.
ఏఐ & లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇంటిగ్రేషన్ (AI API Integration)
- ఎందుకు ఉపయోగపడుతుంది: కేవలం ఏఐని వాడటం కాదు, OpenAI లేదా Anthropic APIలను ఉపయోగించి మీ సొంత అప్లికేషన్లలో ఏఐ ఫీచర్లను ఎలా లింక్ చేయాలో ఈ కోర్సు నేర్పుతుంది. (DeepLearning.AI లో దీనికి ఉచిత కోర్సులు లభిస్తాయి).
- ప్రామాణిక పుస్తకం (Standard Book):AI Agents for Beginners – Sharanam Shah & Vaishali Shah. (2030 నాటి ఏఐ ఏజెంట్ల విప్లవాన్ని, వాటి సాంకేతికతను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది).
లినక్స్ బేసిక్స్ (Linux Basics & Advanced Networks)
- ఎందుకు ఉపయోగపడుతుంది: ప్రొడక్షన్ లెవెల్ సర్వర్లు అన్నీ లినక్స్ పైనే నడుస్తాయి. లినక్స్ కమాండ్స్ నేర్చుకోవడం వల్ల సర్వర్ల ఆపరేషన్స్ సులువవుతాయి. అలాగే ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ క్షుణ్ణంగా తెలియడానికి అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్స్ అవసరం.
- ప్రామాణిక పుస్తకాలు (Standard Books):
- OS కోసం: Operating System Concepts – Silberschatz, Galvin, and Gagne
- నెట్‌వర్క్స్ కోసం: Computer Networks – Andrew S. Tanenbaum.
క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ బిల్డింగ్ (Advanced Projects)
- ఎందుకు ఉపయోగపడుతుంది: కేవలం చిన్న చిన్న యాప్స్ కాకుండా, మార్కెట్లోని నిజమైన సమస్యలను తీర్చే 2 లేదా 3 పెద్ద ప్రాజెక్ట్స్ (మార్కెట్ వేల్యూ ఉన్నవి) సొంతంగా బిల్డ్ చేయడం వల్ల మీ రెజ్యూమే బలంగా మారుతుంది.
ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్స్ (Internships)
- ఎందుకు ఉపయోగపడుతుంది: మూడో సంవత్సరం వేసవి సెలవుల్లో కచ్చితంగా ఏదైనా కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు నిజమైన కార్పొరేట్ కంపెనీలలో పనులు ఎలా జరుగుతాయో లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
4వ ఇయర్: సిస్టమ్ డిజైన్ & ప్లేస్‌మెంట్స్
చివరి సంవత్సరంలో కంపెనీలు మిమ్మల్ని నేరుగా ప్రాజెక్టుల్లోకి తీసుకునేలా చేసే కోర్సులు చేయాలి. బీటెక్ చివరి సంవత్సరానికి వచ్చే సరికి విద్యార్థులు నేర్చుకున్న సబ్జెక్టులను ఉద్యోగాలుగా మార్చుకునే (Placements) కీలకమైన దశలో ఉంటారు.
సిస్టమ్ డిజైన్ (System Design)
- ఎందుకు ఉపయోగపడుతుంది: లక్షలాది మంది వాడినా క్రాష్ అవ్వకుండా ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఎలా డిజైన్ (Scalability, Security) చేయాలో నేర్పే కోర్సు ఇది. 2030 లో కోడ్ అంతా ఏఐ రాసేస్తుంది కానీ ఆ కోడ్‌ను సిస్టమ్ ఆర్కిటెక్చర్‌గా మార్చే డిజైన్ స్కిల్స్ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పుస్తకం: Designing Data-Intensive Applications – Martin Kleppmann.
డెవ్-ఆప్స్ బేసిక్స్ (DevOps & CI/CD)
- ఎందుకు ఉపయోగపడుతుంది: మీరు రాసిన సాఫ్ట్‌వేర్ కోడ్‌ను కంపెనీలు ఎలా ఆటోమేటిక్‌గా టెస్ట్ చేసి, సర్వర్లలో డిప్లాయ్ (Deploy) చేస్తాయో ఈ కోర్సు నేర్పుతుంది. Docker మరియు Kubernetes వంటి కంటెయినరైజేషన్ టూల్స్ నేర్చుకోవడం వల్ల 2030 నాటి క్లౌడ్-నేటివ్ మార్కెట్లో మీకు తిరుగులేని డిమాండ్ ఉంటుంది.
- ప్రామాణిక పుస్తకం (Standard Book): The DevOps Handbook – Gene Kim, Jez Humble, Patrick Debois, and John Willis. (కార్పొరేట్ కంపెనీలలో డెవలప్‌మెంట్, ఐటీ ఆపరేషన్స్ ఎలా కలిసి పనిచేస్తాయో అర్థం కావడానికి ఇది బెస్ట్).
లైవ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (Mock Interviews & Coding)
- ఎందుకు ఉపయోగపడుతుంది: చదువు పూర్తయ్యాక ఎదురయ్యే ఇంటర్వ్యూ భయాన్ని పోగొట్టుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఏఐ (AI) అసిస్టెంట్స్ లేదా చాట్‌జిపిటి సాయం లేకుండా, సొంతంగా లైవ్ కోడింగ్ టెస్టులు రాయడం మరియు మాక్ ఇంటర్వ్యూలు (Mock Interviews) ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ వంద రెట్లు పెరుగుతుంది.
గిట్‌హబ్ బేస్డ్ రెజ్యూమే బిల్డింగ్ (GitHub Resume)
- ఎందుకు ఉపయోగపడుతుంది: మీ సర్టిఫికెట్లలో మార్కుల కంటే, మీ GitHub ప్రొఫైల్ లోని మీ లైవ్ ప్రాజెక్ట్స్ మరియు కోడింగ్ హిస్టరీ మీ రెజ్యూమేని మిగిలిన విద్యార్థుల కంటే ఎంతో బలంగా మారుస్తుంది. టాప్ కంపెనీలు మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేయడానికి ఇదే ప్రధాన కారణం అవుతుంది.
ప్రాక్టికల్ నాలెడ్జ్‌కే ప్రాధాన్యత!
- మారిన ఇంటర్వ్యూ సమీకరణాలు: ఒకప్పుడు ఇంటర్వూల్లో ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోయేది.. కానీ రాబోయే రోజుల్లో కంపెనీలు మీ GitHub ప్రొఫైల్, మీరు కాలేజీలో చేసిన లైవ్ ప్రాజెక్ట్స్, మరియు మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే చూస్తాయి. ఇంటర్వ్యూలలో మిమ్మల్ని ఏఐ టూల్స్ వాడకుండా స్క్రీన్ షేర్ చేసి లేదా బోర్డు పైన లాజిక్ రాయమని (Whiteboard Coding) అడిగే అవకాశాలు ఉన్నాయి.
- పోటీ పడనున్న కంపెనీలు: ఏఐ టూల్స్‌ను స్మార్ట్‌గా వాడుకుంటూ, మార్కెట్ సమస్యలను తీర్చే అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేయగల ఫ్రెషర్స్‌ను కంపెనీలు పోటీ పడి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి.
బీటెక్ నాలుగేళ్ల కాలాన్ని కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా, రేపటి మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగించండి. టెక్నాలజీ మార్కెట్ ఎంత వేగంగా మారినా.. కోర్ ఫండమెంటల్స్, నిరంతరం నేర్చుకునే తత్వం (Continuous Learning), ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ బలంగా ఉన్న ఇంజనీర్ల కెరీర్‌కు మార్కెట్‌లో ఎప్పటికీ తిరుగుండదు. ఏఐ ని ఒక షార్ట్‌కట్‌లా కాకుండా, మీ నైపుణ్యాలను పెంచుకునే ఒక గొప్ప సహచరుడిగా వాడుకుంటూ ముందుకు సాగడమే 2030 ఐటీ ప్రపంచంలో విజయానికి ఏకైక రాజమార్గం!
it job market 2030 tech job market job market insights jobs of 2030 tech job market forecast 4 years of btech btech 4 years roadmap jobs btech freshers b.tech freshers job reality btech fresher jobs btech jobs btech 3rd year roadmap final year btech final year projects b.tech final year