ఐటీ రంగంపై ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో ఈ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టారు. ఒకవైపు ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌ల భయాలు, మరోవైపు `నాలుగేళ్లలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవ మేథస్సును మించిపోతుంది` అంటూ ఎలోన్ మస్క్ హెచ్చరికలు.. విద్యార్థులను అయోమయంలో పడేస్తున్నాయి. అసలు నాలుగేళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఉద్యోగాలు పెరుగుతాయా, తగ్గుతాయా? ఏఐ యుగంలోనూ మన కెరీర్ సేఫ్‌గా ఉండాలంటే ఏయే టెక్నాలజీలు నేర్చుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ మొదటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కోడ్ ఏఐది - రివ్యూ మీది
- మారుతున్న కోడింగ్ శైలి: నాలుగేళ్ల తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు, కేవలం లైన్ల కొద్దీ కోడ్ రాయడమే మీ ముఖ్య ఉద్దేశం కాదు. ఆ పనిని ఏఐ టూల్స్ చూసుకుంటాయని గమనించండి.
- ఏఐ టూల్స్ హవా: 40% ఆటోమేషన్: రాబోయే రోజుల్లో సాధారణ కోడింగ్, బగ్ ఫిక్సింగ్, టెస్టింగ్ వంటి పనుల్లో 30 నుంచి 40% Devin AI, GitHub, Copilot వంటి ఏఐ టూల్స్ చూసుకునే అవకాశాలున్నాయి.
- డెవలపర్స్ కొత్త బాధ్యతలు: మీ ప్రధాన బాధ్యత ఏఐ జనరేట్ చేసిన కోడ్‌ను రివ్యూ చేయడం, అందులోని తప్పులను సరిదిద్దడం, సిస్టమ్స్ డిజైన్, సెక్యూరిటీ పర్యవేక్షించడం కావొచ్చు.
ఎక్కువ వేతనంతో ఏఐ ఉద్యోగాలు
ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయా అంటే లేదంటున్నారు టెక్ విశ్లేషకులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం, ఏఐ వల్ల సంప్రదాయ ఉద్యోగాలు కొనసాగకపోయినా, సరికొత్త సాంకేతికతకలతో అంతకంటే ఎక్కువ వేతనం ఇచ్చే కొత్త ఉద్యోగాలు రావొచ్చు.
2030లో ఐటీ ఇండస్ట్రీలో వినిపించే కొత్త ఏఐ ఉద్యోగాలేంటంటే..
- ఏఐ ఇంటిగ్రేటర్స్/ఇంజనీర్లు: సిద్ధంగా ఉన్న ఏఐ మోడల్స్‌ను కంపెనీ అప్లికేషన్లకు సురక్షితంగా అనుసంధానించే నిపుణులు.
- ఏఐ ప్రొడక్టు మేనేజర్లు / సిస్టమ్ ఆర్కిటెక్ట్: మనుషులు మరియు ఏఐ ఏజెంట్ల కలయికతో పెద్ద సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను డిజైన్ చేసేవారు.
- డేటా ఆర్కిటెక్ట్ & ప్రైవసీ స్పెషలిస్ట్‌లు: ఏఐ మోడల్స్ శిక్షణకు అవసరమైన భారీ డేటాను క్లీన్ చేయడం మరియు డేటా సెక్యూరిటీని చూసుకోవడం.
- ఏఐ ఎథిక్స్ అండ్ కాంప్లియన్స్ ఆఫీసర్స్: ఏఐ వాడకం వల్ల చట్టపరమైన లేదా నైతికపరమైన సమస్యలు రాకుండా పర్యవేక్షించే అధికారులు.
స్మార్ట్‌గా పనిచేసే ఇంజనీర్లదే హవా
- హైప్ నుంచి నిలకడ వైపు..: నాలుగేళ్లలో ఏఐ హైప్ లేదా బుడగ అనేది ఉండకపోవచ్చు. ఏఐ సాంకేతికత పూర్తిగా స్థిరపడి, ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక సాధారణ సాధనంగా మారుతుంది.
- టార్గెట్: 'స్మార్ట్ ఇంజనీర్స్: 2030 నాటి ఐటీ మార్కెట్.. కేవలం కోడింగ్ తెలిసిన వాళ్లను కాదు, ఏఐని ఆయుధంగా వాడుకుంటూ సరికొత్త వ్యవస్థలను నిర్మించే స్మార్ట్ ఇంజనీర్ల కోసం ఎదురుచూస్తోంది.
- ఉత్పాదకతకు ప్రాధాన్యం: గతంలో ఐదుగురు డెవలపర్లు చేసే పనిని, 2030 లో ఏఐ టూల్స్ సహాయంతో ఒక్కరే చేయాల్సి రావచ్చు. అందువల్ల, ఏఐ టూల్స్‌ను తెలివిగా వాడుకుంటూ వేగంగా ప్రాజెక్ట్స్ పూర్తి చేసేవారికే మార్కెట్లో విలువ ఉంటుంది.
-హై-స్కిల్డ్ ఉద్యోగాల యుగం: కేవలం కోడ్ రాయడం, మాన్యువల్ టెస్టింగ్ చేయడం వంటి ప్రాథమిక (Entry-level) ఉద్యోగాల స్థానంలో సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్, మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే హై-స్కిల్డ్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
నాలుగేళ్లలో డిమాండ్ ఉండే టెక్నాలజీలు ఇవి..
భారతదేశంలో డిజిటల్ ఎకానమీ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెరుగుదల వల్ల ఈ క్రింది రంగాల్లో మాత్రం ప్రెషర్స్‌కి అంటే 2030లో బీటెక్ ముగించుకునే విద్యార్థులకు భారీగా అవకాశాలు, ప్యాకేజీలు ఉంటాయి.
- ఏఐ& మెషిన్ లెర్నింగ్: ఏఐ మోడల్స్ నిర్మించడం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మరియు ఏజెంట్ ఆప్స్ AgentOps.
- క్లౌడ్ అండ్ డెవాప్స్ (Cloud & DevOps): ఏడబ్ల్యూఎస్, అజూర్ పరిజ్ఞానంతో పాటు Docker, Kubernetes వంటి క్లౌడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మేనేజ్ చేసే నైపుణ్యం ఉన్న వారికి కొరత ఉండదు.|
- సైబర్ సెక్యూరిటీ (Cybersecurity): ఏఐ వాడకం పెరిగే కొద్దీ సైబర్ దాడుల ముప్పు పెరుగుతుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనలిస్టులకు 20% పైగా వృద్ధి ఉంటుంది.
- డేటా అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ (Data & AI Integration): ఏఐ మోడల్స్‌ను సాఫ్ట్‌వేర్‌కు కనెక్ట్ చేసే టెక్నీషియన్స్
ప్రాబ్లమ్ సాల్వర్లకే డిమాండ్
కేవలం బేసిక్ కోడింగ్, హెచ్‌టిఎమ్‌ఎల్ (HTML), లేదా సాధారణ వెబ్‌సైట్ డిజైనింగ్ మాత్రమే తెలిసిన వారికి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. AI టూల్స్ (GitHub Copilot, Devin వంటివి) సాధారణ కోడింగ్‌ను సెకన్లలో పూర్తి చేయగలవు కాబట్టి, కంపెనీలు కేవలం కోడర్ల కంటే ప్రాబ్లమ్ సాల్వర్స్ (Problem Solvers) ని కోరుకుంటాయి.
స్కిల్స్‌కే ప్రాధాన్యత
నాలుగేళ్ల తర్వాత కేవలం బీటెక్ సర్టిఫికేట్ లేదా మంచి పర్సంటేజ్ (GPA) ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు రావడం కష్టం. మీరు కాలేజీలో ఉన్నప్పుడే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏవైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కనిపెట్టారా అనే ప్రాక్టికల్ స్కిల్స్ చూసి మాత్రమే కంపెనీలు తీసుకుంటాయి.
సాఫ్ట్‌వేర్ మార్కెట్ 2030లో మరింత అద్భుతంగా ఉండబోతోంది. అయితే డిగ్రీ సర్టిఫికేట్ల కంటే నిరంతరం కొత్త కొత్త విషయాలు నేర్చుకునే తత్త్వం ఉన్న వారే ఆ మార్కెట్‌లో విజేతలుగా నిలుస్తారు. నాలుగేళ్ల తర్వాత ఏఐ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా.. అప్పటి జాబ్ మార్కెట్ పోటీని తట్టుకుని నిలబడాలంటే విద్యార్థులు ఇప్పటి నుంచే ఎలాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలనే అంశాలను రెండో భాగంలో తెలుసుకుందాం!
it job market 2030 tech job market job market insights jobs of 2030 tech job market forecast 4 years of btech btech 4 years roadmap jobs btech freshers b.tech freshers job reality btech fresher jobs btech jobs