క్లౌడ్ టెక్నాలజీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తర్వాత అంతటి డిమాండ్ ఉన్న మరో క్లౌడ్ Microsoft Azure. ఎంటర్ప్రైజ్ (కార్పొరేట్) కంపెనీలలో ఈ క్లౌడ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు, నాన్-ఐటీ నుంచి ఐటీకి మారాలనుకునే ఉద్యోగులకు అజూర్ క్లౌడ్ ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. అజూర్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు సర్టిఫికేషన్ కూడా చేస్తే ఉద్యోగానికి ఢోకా లేదంటున్నారు టెక్ నిపుణులు. క్లౌడ్ నైపుణ్యాలతో పాటు అధిక వేతనాన్ని అందించే ఈ సర్టిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
Microsoft Certified: Azure Fundamentals (AZ-900): అజూర్ క్లౌడ్ సర్వీసెస్, సెక్యూరిటీ మరియు ప్రైవసీ గురించి బేసిక్స్ నేర్చుకోవచ్చు. Non-IT బ్యాక్‌గ్రౌండ్ వారు కూడా సులువుగా చేయవచ్చు.
- ఫీజు (Paid): సుమారు ₹3,696 + Taxes.
- ఉచితమార్గం: మైక్రోసాఫ్ట్ ఏటా నిర్వహించే Microsoft Cloud Skills Challenge లేదా Microsoft Build ఈవెంట్లలో పాల్గొని టాస్క్‌లు పూర్తి చేస్తే 100% ఫ్రీ ఎగ్జామ్ వోచర్ లభిస్తుంది.
- కంపెనీ వోచర్లు ఉంటే: మీరు పనిచేసే ఐటీ కంపెనీకి మైక్రోసాఫ్ట్‌తో టై-అప్ ఉంటే, మీరు Enterprise Skills Initiative పోర్టల్ ద్వారా ఈ పరీక్షను పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
- ఎవరికి మంచిది: క్లౌడ్ నేర్చుకోవాలనుకునే నాన్-ఐటీ ఉద్యోగులు, ఫ్రెషర్స్, కాలేజీ విద్యార్థులకు మంచిది.
- ఎలా మంచిది: క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాథమికాంశాలు, అజూర్ కోర్ సర్వీసులు (కంప్యూట్, నెట్వర్కింగ్, స్టోరేజ్), మరియు క్లౌడ్ సెక్యూరిటీ/ప్రైవసీ గురించి బేసిక్ నాలెడ్జ్ లభిస్తుంది.
Microsoft Certified: Azure AI Fundamentals (AI-900): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) కాన్సెప్ట్స్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌లో ఎలా పనిచేస్తాయో నేర్పుతుంది.
- ఫీజు: ₹3,696 + 18% GST అంటే సుమారు ₹4,360 వరకు అవుతుంది.
- ఉచితమార్గం: మైక్రోసాఫ్ట్ ఏటా నిర్వహించే Microsoft Cloud Skills Challenge లేదా Microsoft Build ఈవెంట్లలో పాల్గొని టాస్క్‌లు పూర్తి చేస్తే 100% ఫ్రీ ఎగ్జామ్ వోచర్ లభిస్తుంది.
- కంపెనీ వోచర్లు ఉంటే: మీరు పనిచేసే ఐటీ కంపెనీకి మైక్రోసాఫ్ట్‌తో టై-అప్ ఉంటే, మీరు Enterprise Skills Initiative పోర్టల్ ద్వారా ఈ పరీక్షను పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
- ఎవరికి ఉపయోగం: AI/ML రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్, కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా AI కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగం.
- ఎలా ఉపయోగపడుతుంది: మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, కంప్యూటర్ విజన్ (ఇమేజ్ రికగ్నిషన్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP), మరియు జనరేటివ్ AI (Generative AI) ప్రాథమికాంశాలపై అవగాహన వస్తుంది.
Microsoft Certified: Azure Data Fundamentals DP-900 (Data): ఇది క్లౌడ్ డేటాబేస్ టెక్నాలజీ మరియు డేటా అనలిటిక్స్ బేసిక్స్ గురించి వివరిస్తుంది.
- ఫీజు: సుమారు ₹3,696 + 18% GST
- ఉచితమార్గం: మైక్రోసాఫ్ట్ ఏటా నిర్వహించే Microsoft Cloud Skills Challenge లేదా Microsoft Build ఈవెంట్లలో పాల్గొని టాస్క్‌లు పూర్తి చేస్తే 100% ఫ్రీ ఎగ్జామ్ వోచర్ లభిస్తుంది.
- కంపెనీ వోచర్లు ఉంటే: మీరు పనిచేసే ఐటీ కంపెనీకి మైక్రోసాఫ్ట్‌తో టై-అప్ ఉంటే, మీరు Enterprise Skills Initiative పోర్టల్ ద్వారా ఈ పరీక్షను పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
- ఎవరికి ఉపయోగం: డేటా సైన్స్ / డేటా అనలిటిక్స్ వైపు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులకు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు (DBA), క్లౌడ్ డేటాబేస్కు మారాలనుకునే జూనియర్ ఇంజనీర్లకి మంచి ఎంపిక.
- ఎలా ఉపయోగపడుతుంది: SQL మరియు నాన్-రిలేషనల్ (NoSQL) డేటా వివరాలు, అజూర్ క్లౌడ్‌లో డేటా సేవ్ చేయడం, బిగ్ డేటా అనలిటిక్స్ (Power BI) బేసిక్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు.
Microsoft Certified: Azure Administrator Associate (AZ-104): అజూర్ క్లౌడ్ నెట్వర్కింగ్, స్టోరేజ్ మరియు కంప్యూట్ రిసోర్సెస్‌ను ఎలా మేనేజ్ చేయాలో నేర్పుతుంది.
- ఫీజు (Paid): సుమారు ₹4,800 + Taxes
- ఉచితమార్గం: మైక్రోసాఫ్ట్ ఏటా నిర్వహించే Microsoft Cloud Skills Challenge లేదా Microsoft Build ఈవెంట్లలో పాల్గొని టాస్క్‌లు పూర్తి చేస్తే 100% ఫ్రీ ఎగ్జామ్ వోచర్ లభిస్తుంది.
- కంపెనీ వోచర్లు ఉంటే: మీరు పనిచేసే ఐటీ కంపెనీకి మైక్రోసాఫ్ట్‌తో టై-అప్ ఉంటే, మీరు Enterprise Skills Initiative పోర్టల్ ద్వారా ఈ పరీక్షను పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
- ఎవరికి ఉపయోగం: 6 నెలల నుంచి ఏడాది పాటు అజూర్ క్లౌడ్‌తో ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారికి, డెవాప్స్ ఇంజనీర్లకు ఇది సులభంగా ఉంటుంది
- ఎలా ఉపయోగపడుతుంది: కంపెనీలో సీనియర్ రోల్స్‌కు లేదా ప్రమోషన్లకు ఇది అదనపు అర్హతగా మారుతుంది.
Microsoft Certified: AZ-305 (Architect Expert): మైక్రోసాఫ్ట్ అజూర్‌లో ఇది అత్యున్నత స్థాయి (Highest Level) సర్టిఫికేషన్. దీనివల్ల మార్కెట్లో మీ ప్రొఫైల్‌కు విపరీతమైన వాల్యూ ఉంటుంది
- పరీక్ష ఫీజు: ₹4,800 + 18% GST (మొత్తం కలిపి సుమారు ₹5,664)
- ఎవరికి మంచిది: కనీసం 2 నుంచి 5 సంవత్సరాల ఐటీ లేదా క్లౌడ్ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు (Cloud Architects) మంచిది.
- ఎలా ఉపయోగపడుతుంది: ఒక అప్లికేషన్‌కు ఎలాంటి స్టోరేజ్ వాడాలి, ఖర్చు ఎలా తగ్గించాలి (Cost Optimization), మరియు హ్యాకింగ్ అవ్వకుండా నెట్వర్క్ ఎలా డిజైన్ చేయాలో నేర్పుతుంది. అజూర్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఉన్న నిపుణులకు మార్కెట్లో అత్యధిక జీతాలు లభిస్తున్నాయి.
AZ-400 (Designing and Implementing Microsoft DevOps Solutions): మైక్రోసాఫ్ట్ అందించే ఒక Expert-level Cloud Certification. దీనిని విజయవంతంగా పూర్తి చేస్తే Microsoft Certified: DevOps Engineer Expert అనే ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభిస్తుంది.
- ఎగ్జామ్ ఫీజు (Fee): సుమారు ₹4,800 INR + Taxes.
- ఇవి పాసయితేనే: అధికారికంగా "DevOps Expert" సర్టిఫికేట్ మీ చేతికి రావాలంటే, సర్టిఫికేషన్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి:
1. Microsoft Certified: Azure Administrator Associate (AZ-104) OR
2. Microsoft Certified: Azure Developer Associate (AZ-204)
- ఎవరికి మంచిది: DevOps Engineers & SysAdmins, Cloud Administrators / Solutions Architects కి ఇది మంచి సర్టిఫికేషన్.
- ఎలా ఉపయోగపడుతుంది: మైక్రోసాఫ్ట్ ఇచ్చే 'Expert' ట్యాగ్ మీ రెస్యూమ్ (Resume) కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మీ విలువను పెంచుతుంది.
#IT #cloudtechnology #azure #certifications #azurecertifications #Itcareer #azurecloud